Telangana

News August 3, 2024

నాగార్జునసాగర్ ప్రాజెక్టు తాజా సమాచారం

image

నాగార్జున సాగర్ ప్రాజెక్టు తాజా సమాచారం మధ్యాహ్నం 12 గంటలకు ఈ విధంగా ఉంది.
ఇన్ ఫ్లో :4,17,147క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : 35,953 క్యూసెక్కులు
పూర్తిస్థాయి నీటిమట్టం: 590 అడుగులు
ప్రస్తుత నీటి మట్టం: 561.50అడుగులు
పూర్తి నీటి నిల్వ సామర్థ్యం: 312.5050 టీఎంసీలు
ప్రస్తుత నీటి నిల్వ: 235.9395టీఎంసీలు

News August 3, 2024

బీబీనగర్ పెద్ద చెరువులో మృతదేహం లభ్యం

image

యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండల కేంద్రంలోని పెద్ద చెరువులో గుర్తుతెలియని మృతదేహం శనివారం ఉదయం లభ్యమైంది. పోలీసులు చెరువు వద్దకు చేరుకొని మృతదేహాన్ని బయటకి తీశారు. మృతుడు హైదరాబాద్‌లోని వారసిగూడకు చెందిన సాయి కుమార్‌గా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

News August 3, 2024

పెద్దపల్లి: ఏసీబీకి చిక్కిన తహశీల్దార్

image

పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల తహశీల్దార్ ఏసీబీకి చిక్కాడు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాలు.. మందమర్రికి చెందిన రైతు కాడం తిరుపతి నుంచి రూ.10,000 లంచం తీసుకుంటుండగా తహశీల్దార్ జహేద్ పాషాతో పాటు అతడి బినామీ వీఆర్ఏ విష్ణు, డ్రైవర్ అంజద్‌‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రైతు వద్ద మ్యూటేషన్ కోసం లంచం తీసుకుంటున్నట్లు సమాచారం.

News August 3, 2024

తిరుగులేని నగరంగా మారనున్న హైదరాబాద్!

image

HYD త్వరలో తిరుగులేని నగరంగా మారుతుందా అంటే నిపుణులు అవుననే చెబుతున్నారు. నగర శివారులో 200 ఎకరాల్లో AI సిటీ, 100 ఎకరాల్లో స్కిల్ యూనివర్సిటీ, 100 ఎకరాల్లో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, హెల్త్ హబ్, ఫార్మా విలేజెస్, మూసి ప్రక్షాళన, 800 ఎకరాల్లో టెక్స్ టైల్ వెల్ స్పన్, 300 ఎకరాల్లో కైటెక్స్, 250 ఎకరాల్లో ఫాక్స్ కాన్, 15 ఎకరాల్లో ఒలెక్ట్రా లాంటి భారీ కంపెనీల ఏర్పాటు పూర్తైతే HYDకు తిరుగు లేదంటున్నారు.

News August 3, 2024

తిరుగులేని నగరంగా మారనున్న హైదరాబాద్!

image

HYD త్వరలో తిరుగులేని నగరంగా మారుతుందా అంటే నిపుణులు అవుననే చెబుతున్నారు. నగర శివారులో 200 ఎకరాల్లో AI సిటీ, 100 ఎకరాల్లో స్కిల్ యూనివర్సిటీ, 100 ఎకరాల్లో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, హెల్త్ హబ్, ఫార్మా విలేజెస్, మూసి ప్రక్షాళన, 800 ఎకరాల్లో టెక్స్ టైల్ వెల్ స్పన్, 300 ఎకరాల్లో కైటెక్స్, 250 ఎకరాల్లో ఫాక్స్ కాన్, 15 ఎకరాల్లో ఒలెక్ట్రా లాంటి భారీ కంపెనీల ఏర్పాటు పూర్తైతే HYDకు తిరుగు లేదంటున్నారు.

News August 3, 2024

NLG: ప్రియుడి వేధింపులకు వివాహిత ఆత్మహత్య

image

నకిరేకల్ మండలం నోములకి
చెందిన వెల్మకంటి అనిత(28) అనే వివాహిత, ప్రియుడి వేధింపులు తాళలేక ఉరివేసుకుని శుక్రవారం ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన టేకుల రాజేశ్‌తో అనితకు కొంతకాలం క్రితం వివాహేతర సంబంధం ఏర్పడింది. తనతోనే ఉండాలన్న రాజేశ్ వేధిస్తుండడంతో ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేశారు.

News August 3, 2024

పెంబి: ఉద్యోగం రాలేదని యువకుడి ఆత్మహత్య

image

ఉద్యోగం రాలేదని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన పెంబి మండలంలో జరిగింది. ఎస్ఐ శంకర్ తెలిపిన వివరాల ప్రకారం.. అంకెన గ్రామానికి చెందిన నైతం దత్తు రాం(19) పోస్ట్ మ్యాన్ ఉద్యోగానికి ఎగ్జామ్ రాశాడు. ఉద్యోగం రాకపోవడంతో మనస్తాపం చెంది ఈనెల 1న పురుగు మందు తాగగా కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు తెలిపారు.

News August 3, 2024

వరంగల్: శ్రావణ మాసంలో శుభ ముహూర్తాలు ఇవే!

image

మూడంతో మూడు నెలలు నిలిచిపోయిన శుభ కార్యక్రమాలు సోమవారం నుంచి మళ్లీ ప్రారంభం కానున్నాయి. ఈ నెల 8, 9, 10, 11, 15, 17, 18, 22, 23, 24, 28, 30 తేదీల్లో వివాహ ముహూర్తాలు ఉన్నాయని అర్చకులు తెలిపారు. శంకుస్థాపనలు, గృహ ప్రవేశాలకు ఇప్పటికే చాలా మంది శుభ ముహూర్తాలు నిర్ణయించినట్లు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే చాలా మంది వివాహాలకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. శ్రావణ మాసం సెప్టెంబర్ 3తో ముగుస్తుంది.

News August 3, 2024

కామారెడ్డి: ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య

image

కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి గ్రామానికి చెందిన రవి పటేల్ (40) గ్రామ శివారులో ఓ చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కుటుంబ సభ్యులతో గత కొద్ది రోజులుగా భూతగాదాల కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

News August 3, 2024

MBNR: ‘నేతన్నకు బీమా’దరఖాస్తుల ఆహ్వానం

image

చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం నేతన్నకు బీమా పథకం ప్రవేశ పెట్టిందని.. అర్హులైన కార్మికులు దరఖాస్తు చేసుకోవాలని చేనేత,జౌళిశాఖ AD గోవిందయ్య తెలిపారు. వనపర్తి, NGKL, గద్వాల జిల్లాల పరిధిలో 18 ఏళ్లు నిండిన చేనేత కార్మికులు బీమా చేయించుకోవాలని చెప్పారు. ఈనెల 9వ తేదీ నాటికి దరఖాస్తులను ఏడీ కార్యాలయంలో అందజేయాలని సూచించారు. కొత్తగా జియోట్యాగ్ నంబర్ వచ్చిన వారు కూడా అవకాశాన్ని పొందవచ్చని తెలిపారు.