Telangana

News August 4, 2024

HYD: యామినీ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన CM

image

పద్మ పురస్కారాల గ్రహీత, ప్రముఖ నర్తకి యామినీ కృష్ణమూర్తి మృతి పట్ల రాష్ట్ర CM రేవంత్ రెడ్డి HYDలో సంతాపం తెలిపారు. భరత నాట్య, కూచిపూడి నృత్య కళకు యామినీ విశిష్ట సేవలందించారని, ఎంతో మంది యువతకు నాట్యం నేర్పించి దేశంలోనే కళారంగానికి ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చారని గుర్తు చేసుకున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆయన భగవంతుడిని ప్రార్థించారు.

News August 4, 2024

NLG: ఉమ్మడి జిల్లాలో సన్నాల సాగుకే సై

image

ఉమ్మడి నల్గొండ జిల్లా రైతులు వరిలో సన్న రకాల సాగుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. మార్కెట్లో సన్న రకం బియ్యానికి మంచి ధర పలుకుతోంది. అంతేకాకుండా ప్రభుత్వం రూ.500 బోనస్ ప్రకటించడం కూడా ఇందుకు ఊతమిస్తోంది. ఈసారి వర్షాలు అనుకూలించకపోయినప్పటికీ చాలా మంది రైతులు సన్నరకాల నారు పోశారు. నీటి వసతులు ఉన్నచోట నాట్లు సైతం వేశారు. సాగర్ కూడా నిండుతుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

News August 4, 2024

MDK: బకెట్లో పడి 8 నెలల చిన్నారి మృతి

image

బకెట్లో పడి 8 నెలల చిన్నారి మృతి చెందిన ఘటన మెదక్ జిల్లా పరిగిలో జరిగింది. స్థానికులు వివరాలు.. బిహార్‌కు చెందిన ధర్మేందర్ ఓ ఐరన్ కంపెనీలో పని చేస్తూ బీసీ కాలనీలో భార్య, 8 నెలల కూతురుతో కలిసి ఉంటున్నాడు. ఈ క్రమంలో చిన్నారిని గదిలో కూర్చోబెట్టి భార్య వాష్ రూంకి వెళ్లింది. అయితే ఆడుకుంటూ వెళ్లి చిన్నారి ప్రమాదవశాత్తు బాల్కనీలో ఉన్న బకెట్లో పడి మృతి చెందింది. దీంతో కుటుబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News August 4, 2024

ఆదిలాబాద్‌లో దోస్తానా అంటే ప్రాణం!

image

దోస్తానా అంటే ఆదిలాబాదీలు జాన్ ఇస్తారు. బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు వీడని బంధాలు‌ ADB జిల్లాలో కోకొల్లలు. ఆటపాటలతో పాటు ఆపదలోనూ తోడుంటూ‌‌ కొండంత అండగా ఉంటారు. ఇక స్కూల్‌‌ దోస్తుల జ్ఞాపకాలు లైఫ్‌లాంగ్ గుర్తుండిపోతాయి. ఫెయిర్ వెల్‌ పార్టీలో కన్నీరు కార్చిన మిత్రులెందరో ఉంటారు. అలాంటి మిత్రుల కోసమే నేడు అంతర్జాతీయ ఫ్రెండ్షిప్ డే జరుపుకుంటున్నారు. మరి మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు..?
Happy Friendship Day

News August 4, 2024

కరీంనగర్‌లో దోస్తానా అంటే ప్రాణం!

image

దోస్తానా అంటే కరీంనగర్ వాసులు జాన్ ఇస్తారు. బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు వీడని బంధాలు‌ నగరంలో కోకొల్లలు. ఆటపాటలతో పాటు ఆపదలోనూ తోడుంటూ‌‌ కొండంత అండగా ఉంటారు. ఇక స్కూల్‌‌ దోస్తుల జ్ఞాపకాలు లైఫ్‌లాంగ్ గుర్తుండిపోతాయి. ఫెయిర్‌వెల్‌ పార్టీలో కన్నీరు కార్చిన మిత్రులెందరో. అటువంటి మిత్రుల కోసమే నేడు అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం జరుపుకుంటున్నారు. మరి మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు..? Happy Friendship Day

News August 4, 2024

ఖమ్మం: పోడు రైతులకు తిరిగి రుణాలు

image

పోడు, అసైన్డ్ పట్టాలు కలిగి రుణమాఫీ పొందిన రైతులకు తిరిగి రుణాలు ఇవ్వనున్నట్లు ఖమ్మం జిల్లా కేంద్ర సహకార బ్యాంక్(డీసీసీబీ) సీఈఓ అబీద్ ఉర్ రెహమాన్ తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని పీఏసీఎస్ నుంచి కల్పిస్తున్న ఈ సౌకర్యాన్ని రైతులు సద్వినియోగం సూచించారు. కాగా, డీసీసీబీ పరిధిలో తొలి విడత 37,625 మంది రైతులకు రూ.121.63 కోట్లు, రెండో విడతలో 19,504 మంది రైతులకు రూ.88.09 కోట్లు రుణమాఫీ అయిందని తెలిపారు.

News August 4, 2024

నిజామాబాద్‌లో దోస్తానా అంటే ప్రాణం!

image

దోస్తానా అంటే నిజామాబాదీలు జాన్ ఇస్తారు. బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు వీడని బంధాలు‌ ఉమ్మడి NZB జిల్లాలో కోకొల్లలు. ఆటపాటలతో పాటు ఆపదలోనూ తోడుంటూ‌‌ అండగా ఉంటారు. ఇక స్కూల్‌‌ దోస్తుల జ్ఞాపకాలు లైఫ్‌లాంగ్ గుర్తుండిపోతాయి. ఫెయిర్ వెల్‌ పార్టీలో కన్నీరు కార్చిన మిత్రులెందరో ఉంటారు. అటువంటి మిత్రుల కోసమే నేడు అంతర్జాతీయ ఫ్రెండ్షిప్ జరుపుకుంటున్నారు. మరి మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు..?
Happy Friendship Day

News August 4, 2024

Friendship Day Special.. వరంగల్: యువకుడి ప్రాణాలు కాపాడిన మిత్రులు

image

పురుగు మందు తాగిన ఓ యువకుడిని మిత్రులు కాపాడిన ఘటన ములుగు జిల్లాలో జరిగింది. SI హరీశ్ ప్రకారం.. WGLలోని రామన్నపేటకు చెందిన సాయికృష్ణ ఐదేళ్ల క్రితం బీటెక్ పూర్తి చేశాడు. ఉద్యోగం రాకపోవడంతో మనస్తాపం చెంది వాజేడు మం.లోని బొగ్గులవాగు సమీపంలో శుక్రవారం రాత్రి పురుగుమందు తాగి స్నేహితులకు ఫోన్ చేసి చెప్పాడు. స్పందించిన మిత్రులు పోలీసులకు సమాచారమివ్వడంతో యువకుడిని ఆస్పత్రికి తరలించి ప్రాణాలు కాపాడారు.

News August 4, 2024

NZB: 5 నుంచి శ్రావణం.. నెలరోజులు మస్తు లగ్గాలు

image

మూడంతో మూడు నెలలు నిలిచిపోయిన శుభ కార్యక్రమాలు సోమవారం నుంచి మళ్లీ ప్రారంభం కానున్నాయి. ఈనెల 5 నుంచి శ్రావణమాసం మెుదలవుతోంది. ఈనెల 8, 9,10, 11, 15, 17, 18, 22, 23, 24, 28, 30 తేదీలలో వివాహ ముహూర్తాలు ఉన్నాయని, శంకుస్థాపనలు, గృహప్రవేశాలకు ఇప్పటికే చాలా మంది శుభ ముహూర్తాలు నిర్ణయించినట్లు అర్చకులు తెలిపారు. శ్రావణ మాసం సెప్టెంబర్ 3తో ముగుస్తుంది.

News August 4, 2024

నాగార్జునసాగర్ ప్రాజెక్టు తాజా సమాచారం

image

నాగార్జున సాగర్ ప్రాజెక్టు తాజా సమాచారంఇన్ ఫ్లో :4,58,393 క్యూసెక్కులు ఔట్ ఫ్లో : 40,560క్యూసెక్కులుపూర్తిస్థాయి నీటిమట్టం: 590 అడుగులు ప్రస్తుత నీటి మట్టం: 571.40 అడుగులుపూర్తి నీటి నిల్వ సామర్థ్యం: 312.5050 టీఎంసీలుప్రస్తుత నీటి నిల్వ: 260.0858 టీఎంసీలు