Telangana

News August 5, 2024

వరంగల్: క్వింటా పత్తి రూ.7,160

image

రెండు రోజుల విరామం అనంతరం ఈరోజు ఉదయం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ప్రారంభం కాగా పత్తి తరలివచ్చింది. అయితే ధర మాత్రం రైతన్నలకు నిరాశ కలిగించింది. పత్తి క్వింటాకు రూ.7,160 పలికింది. పత్తి ధరలు పెరగకపోవడంతో రైతన్నలు ఆవేదన చెందుతున్నారు. కాగా మార్కెట్లో కొనుగోళ్ల ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది.

News August 5, 2024

కడెం ప్రాజెక్టు నుంచి 957 క్యూసెక్కుల నీటి విడుదల

image

కడెం ప్రాజెక్టు నుంచి 957 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని ఆ ప్రాజెక్టు అధికారులు తెలిపారు. కడెం ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 700 అడుగులు కాగా, సోమవారం ఉదయం ప్రాజెక్టులో 696.22 అడుగుల నీటిమట్టం ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి 4,323 క్యూసెక్కుల నీరు వస్తోంది.

News August 5, 2024

MBNR: నామినేటెడ్ పదవులపై నేతల ఆశలు!

image

ఉమ్మడి జిల్లాలో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు కార్యకర్తలు నామినేటెడ్ పదవులపై ఆశలు పెట్టుకున్నారు. అధికారంలో ఉన్న లేకున్నా కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని పనిచేసిన వారు కొంతమంది అయితే ఎన్నికల సమయంలో పార్టీ మారిన నాయకులు మరికొందరు ఉన్నారు. ఈ నేపథ్యంలో పలువులు నాయకులు కార్యకర్తలకు నామినేటెడ్ పదవులను కట్టబెట్టి స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీ పెద్దలు భావిస్తున్నారు.

News August 5, 2024

HYD: విచారణ కమిటీ వేసిన సీపీ

image

సైబరాబాద్ పరిధిలోని షాద్‌నగర్ పట్టణ డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ రాంరెడ్డిపై వచ్చిన ఆరోపణలపై సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి స్పందించారు. రాంరెడ్డిని సైబరాబాద్ సీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తున్నట్లు తెలిపారు. వచ్చిన ఆరోపణలపై షాద్‌నగర్ ఏసీపీ రంగస్వామి విచారణ జరుగుతున్నట్లు తెలిపారు. విచారణ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

News August 5, 2024

ప్రతి విద్యార్థి కష్టపడి చదువుకోవాలి: కామారెడ్డి కలెక్టర్

image

ప్రతి విద్యార్థి కష్టపడి చదువుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిశ్ సాంగ్వాన్ విద్యార్థులకు సూచించారు. సోమవారం జుక్కల్ మండలంలో బస్వాపూర్‌లోని కస్తూర్బా బాలికల పాఠశాల విద్యార్థులతో మాట్లాడుతూ.. చదువు ఏ విధంగా చెబుతున్నారని అర తీసి ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య బోధన అందించడం జరుగుతుందన్నారు. కష్టపడి చదువుకుని మంచి ఫలితాలు తీసుకురావాలని అన్నారు. అనంతరం హాజరు పట్టికను పరిశీలించారు.

News August 5, 2024

HYD: విచారణ కమిటీ వేసిన సీపీ

image

సైబరాబాద్ పరిధిలోని షాద్‌నగర్ పట్టణ డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ రాంరెడ్డిపై వచ్చిన ఆరోపణలపై సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి స్పందించారు. రాంరెడ్డిని సైబరాబాద్ సీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తున్నట్లు తెలిపారు. వచ్చిన ఆరోపణలపై షాద్‌నగర్ ఏసీపీ రంగస్వామి విచారణ జరుగుతున్నట్లు తెలిపారు. విచారణ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

News August 5, 2024

కామారెడ్డి: గుర్తు తెలియని మృతదేహం లభ్యం

image

కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలంలోని రామేశ్వర పల్లి గ్రామ శివారులో గుర్తు తెలియని మృతదేహం గ్రామస్థులకు కనిపించింది. వ్యవసాయ బావుల వద్ద మృతదేహాన్ని గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. ఆయన వద్ద ఎలాంటి ఆనవాళ్లు లేకపోవడంతో పలు గ్రామాలకు సమాచారం అందించారు.

News August 5, 2024

ఆదిలాబాద్: రైతు బీమా దరఖాస్తుకు నేడే LAST

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నూతన రైతులు రైతు బీమాకు దరఖాస్తు చేసుకునేందుకు సోమవారం చివరి తేదీ అని అధికారులు తెలిపారు. క్లస్టర్ పరిధిలోని అన్ని గ్రామాలలో ఉన్న నూతన రైతులు తమ రైతు వేదికలో దరఖాస్తులు సమర్పించాలన్నారు. రైతు బీమా ఫామ్, రైతు ఆధార్ కార్డ్, నామిని ఆధార్ కార్డ్, పట్టా పాస్ బుక్, బ్యాంక్ జిరాక్స్ కాపీలను వారి వెంట తెచ్చుకోవాలని కోరారు.

News August 5, 2024

కొత్తగూడెం: పాఠశాలకు తాళం వేసి విద్యార్థుల నిరసన

image

అశ్వాపురం మండలం కొత్తూరు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సోమవారం పాఠశాలకు తాళం వేసి నిరసన కార్యక్రమం చేపట్టారు. 48 మంది విద్యార్థులకు ఏకైక ఉపాధ్యాయుడు ఉన్నారని చెప్పారు. దీనివల్ల విద్యార్థులకు సరైన విద్య బోధన అందడం లేదని అన్నారు. కావున మండల అధికారులు స్పందించి, పాఠశాలలో సరిపడా ఉపాధ్యాయులను నియమించాలని కోరారు.

News August 5, 2024

MBNR: ఇందిరమ్మ పథకం.. 42 వేల మందికి లబ్ధి!

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఒక్కో నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇళ్లు మంజూరు చేస్తామని రేవంత్ సర్కారు ప్రకటించారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పథకం కింద ఒక్కో గృహం నిర్మాణానికి రూ.5 లక్షలు లబ్ధి దారులకు ఇవ్వనున్నారు. ఉమ్మడి జిల్లాకు మొత్తం కలిపి 42 వేలకు పైగా ఇళ్లు మంజూరయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా. వీటి నిర్మాణానికి రూ.2 వేల కోట్లకు పైగా నిధులు అవసరం కానున్నాయి.