Telangana

News August 29, 2024

ఖమ్మంలో రోడ్డు ప్రమాదం.. గాల్లో ఎగిరిన దంపతులు

image

కారు ఢీకొన్నడంతో దంపతులిద్దరూ గాల్లోకి ఎగిరిపడిన ఘటన ఖమ్మంలో జరిగింది. పోలీసుల, స్థానికుల వివరాల ప్రకారం.. ఎంవీపాలెం గ్రామానికి చెందిన పెద్దిభిక్షం(50), వరలక్ష్మి బుధవారం ఐస్‌క్రీం విక్రయించుకుంటూ రోడ్డుపై వెళ్తున్నారు. ఈక్రమంలో ఖమ్మ నుంచి కురవి వైపు వెళ్తున్న కారు దంపతులిద్దరిని ఢీకొట్టింది. దీంతో వారు గాల్లో ఎరిగిపడ్డారు. ప్రమాదంలో పెద్దిభిక్షం చికిత్స పొందుతూ మృతి చెందారు. కేసు నమోదైంది.

News August 29, 2024

NZB: యాక్సిడెంట్‌లో ఇద్దరు మృతి.. UPDATE

image

NZBలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందిన విషయం తెలిసిందే. రూరల్ CI నరేశ్ వివరాల ప్రకారం.. కుమార్ గల్లీకి చెందిన రాజేశ్(19), మాక్లూర్‌కు చెందిన వంశీ(18), దుబ్బకు చెందిన ఆకాశ్(19) మంగళవారం ఓ కారు అద్దెకు తీసుకొని నగరానికి వెళ్లారు. బుధవారం వంశీని దించేందుకు మక్లూర్ వెళ్తుండగా కొండూరు సమీపంలో ఆగి ఉన్న లారీని ఢీకొన్నారు. రాజేశ్, వంశీ అక్కడికక్కడే మృతిచెందగా, ఆకాశ్ తీవ్రంగా గాయపడ్డాడు.

News August 29, 2024

మేడిగడ్డ బ్యారేజీకి కొనసాగుతున్న వరద

image

కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రధానమైన మేడిగడ్డ బ్యారేజీకి వరద ప్రవాహం కొనసాగుతోంది. బ్యారేజీలోకి 2.58 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో చేరుతుండగా 85 గేట్లను ఎత్తి, అంతే నీటిని దిగువకు పంపిస్తున్నారు. బ్యారేజీ వద్ద 390 మీటర్ల ఎత్తులో గోదావరి నది ప్రవహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. బ్యారేజీ వద్ద పకడ్బందీ జాగ్రత్తలు అధికారులు చేపట్టారు.

News August 29, 2024

మంచిర్యాల: బాలికను వేధించిన బాలుడిపై పొక్సో కేసు

image

బాలికను శారీరకంగా వాడుకొని మోసం చేసిన బాలుడిపై కేసు నమోదు చేసినట్లు మంచిర్యాల సీఐ బన్సిలాల్ తెలిపారు. మంచిర్యాలకు చెందిన ఓ బాలికను(17) ప్రేమపేరుతో మాయమాటలు చెప్పి ఓ బాలుడు పలుమార్లు అత్యాచారం చేశాడు. అనంతరం ఆమెను వేధిస్తున్నట్లు బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిపై పోక్సో కేసు నమోదు చేశారు. రిమాండ్ నిమిత్తం బాలుడిని బుధవారం కోర్టు హాజరుపర్చినట్లు సీఐ వెల్లడించారు.

News August 29, 2024

రాచకొండలో 19 మంది ఇన్‌స్పెక్టర్లు బదిలీ

image

రాచకొండలో 19 మంది ఇన్‌స్పెక్టర్లు, 10 మంది ఎస్సైలను బదిలీ చేస్తూ రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వెయిటింగ్‌లో ఉన్న ఆరుగురు ఇన్‌స్పెక్టర్లకు పోస్టింగ్ కల్పించారు. ఉప్పల్ డీఐగా రామలింగారెడ్డిని, పహడీ షరీఫ్ డీఐగా దేవేందర్, మాడ్గుల సీఐగా జగదీష్, ఎల్బీనగర్ సీఐగా వినోద్ కుమార్, తదితరులకు పోస్టింగ్ ఇచ్చారు.

ఖమ్మం: తొలి రోజు 1,475 కుటుంబాల నిర్ధారణ

image

రుణమాఫీ వర్తించని రైతు కుటుంబాల నిర్ధారణ ప్రక్రియ బుధవారం ప్రారంభం కాగా, జిల్లాలో తొలిరోజు 1,475 కుటుంబాల వారిని వ్యవసాయ శాఖ గుర్తించింది. రేషన్ కార్డులు లేకుండా రుణమాఫీకి అర్హులైన రైతుల జాబితాలను నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ మండలాల వారిగా నేరుగా వ్యవసాయ శాఖ అధికారులకు పంపించింది. ఈ జాబితాల ఆధారంగా కుటుంబ సభ్యుల నిర్ధారణ ప్రక్రియ వ్యవసాయ శాఖ చేపట్టింది.

News August 29, 2024

HYD: ఓయూలో రూ.23 లక్షల ప్యాకేజీతో ప్లేస్‌మెంట్‌

image

ఓయూలో ఇటీవల జరిగిన క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో ఎంబీఏ, టెక్నాలజీ మేనేజ్‌మెంట్ విద్యార్థులు 17 మందికి HDFC బ్యాంక్ కొలువులు ఇచ్చింది. రూ.8 లక్షల నుంచి రూ.23 లక్షల మధ్య వార్షిక వేతనంతో ఈ నియామకాలు జరిగాయి. MBA కళాశాలలో నాలుగో సెమిస్టర్ చదువుతున్న 120 మంది విద్యార్థుల్లో 109 మందికి వేర్వేరు కంపెనీలు నియామక పత్రాలు అందించనున్నాయి.

మునుగోడు: పలివెల మీదుగా వెళ్లే బస్సు సర్వీస్ రద్దు

image

రోడ్డు బాలేదన్న వంకతో కొన్నేళ్లుగా మునుగోడు మండలం పలివెల గ్రామం మీదుగా ప్రతి రోజు HYDకు వెళ్లే బస్సు సర్వీసును బుధవారం ఆర్టీసీ అధికారులు రద్దు చేశారు. నిత్యం ఉదయం 8:30 గంటలకు NLG డిపో నుంచి బయలుదేరే ఆ బస్సు మునుగోడు మీదుగా కచలాపురం , పలివెల, కోతులారం, మల్లారెడ్డిగూడెం, సర్వేల్ నుంచి HYDకు వెళ్లేది. తిరిగి మధ్యాహ్న సమయంలో అదే గ్రామాల మీదుగా NLGకు చేరుకునేది.