Telangana

News August 10, 2024

పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో స్పాట్ అడ్మిషన్లు.. రేపే చివరి తేదీ

image

నల్గొండ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లొమా కోర్సుల్లో 2024-25 ప్రథమ సంవత్సరంలో మిగిలిపోయిన సీట్లకు ఆగస్టు 12 స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ సిహెచ్ నర్సింహారావు తెలిపారు. పాలిసెట్ 2024 అర్హత సాధించినవారు, పదో తరగతి, నేషనల్ ఓపెన్ స్కూల్ ఉత్తీర్ణులైన వారు స్పాట్ కౌన్సిలింగ్‌కు అర్హులన్నారు. ఆసక్తి గల విద్యార్థులు ఆగస్టు 11వ తేదీ వరకు కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News August 10, 2024

నిజామాబాద్ జిల్లాలో ఎనిమిది నూతన గ్రామ పంచాయతీలు

image

పంచాయతీ ఎన్నికల తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త పంచాయతీల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. కోటగిరి మండలంలో కొత్తగా 8 పంచాయతీలు ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఉమ్మడి మండలంలో ఇప్పటి వరకు 28 పంచాయతీలుండగా ఆ సంఖ్య 36కు చేరింది. ఎత్తొండ క్యాంపు, ఎక్లాస్పూర్ క్యాంపు, శ్రీనివాస్ రెడ్డి కాలనీ, బాకర్ ఫారం, జల్లాపల్లి పాత గ్రామం, జల్లాపల్లి తండా, తిర్మలాపూర్, రాంగంగానగర్ కొత్తగా ఏర్పడ్డాయి.

News August 10, 2024

చింతకాని: కరెంటు షాక్‌కు గురై యువకుడు మృతి

image

కరెంటు షాక్‌కు గురై ఓ యువకుుడ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన చింతకాని మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. నామవరంకి చెందిన బొలికొండ బాను(28) ఈనెల 2 కరెంటు షాక్ గురై, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు తెలిపారు. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు.

News August 10, 2024

వరంగల్: దేవాదాయ శాఖలో బదిలీలు

image

దేవాదాయ శాఖలో ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో 8 మంది ఉద్యోగులకు స్థానచలనం కలిగింది. దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ పరిధిలో 6బి కేటగిరీకి వచ్చే దేవాలయాల నుంచి ఇద్దరు, రీజినల్ జాయింట్ కమిషనర్ పరిధిలోకి వచ్చే 6ఏ దేవాలయాల్లో ఆరుగురికి బదిలీలు జరిగాయి. వేయి స్తంభాల గుడిలో పనిచేసే జూనియర్ అసిస్టెంట్ ప్రేమ్ కుమార్ ఐనవోలుకు, ఐనవోలు ఆలయంలో పనిచేసే జూనియర్ అసిస్టెంట్ మధుకర్ వేయిస్తంభాల గుడికి వచ్చారు.

News August 10, 2024

నాగర్ కర్నూల్: తండ్రిని గొడ్డలితో నరికి చంపిన కొడుకు

image

నాగర్ కర్నూల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తెల్కపల్లి మండలం గట్టునెల్లికుదురులో తండ్రిని కొడుకు గొడ్డలితో నరికి చంపాడువ్యసనాలకు బానిసైన కొడుకును తండ్రి సుల్తాన్ మందలించాడు. దీంతో కోపంలో తండ్రిని గొడ్డలితో నరికి చంపాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాలు తెలియాల్సి ఉంది.

News August 10, 2024

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎస్సైల బదిలీలు

image

బాసర జోన్ పరిధిలో ఎస్ఐలను బదిలీలు చేస్తూ బాసర జోన్ 2 ఐజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా ADB, నిర్మల్ జిల్లాలో పలువురు ఎస్ఐలకు స్థానచలనం కలిగింది. కుంటాల ఎస్ఐ రజినీకాంత్ బదిలీకాగా ఆయన స్థానంలో భాస్కర్ చారి, బోథ్ ఎస్ఐ రాము బదిలీకాగా ఆయన స్థానంలో ఎల్.ప్రవీణ్, బజరహత్నూర్ ఎస్సై నరేష్ బదిలీ కాగా ఆయన స్థానంలో అప్పారావు నియమితులయ్యారు. భైంసా టౌన్ ఎస్సై మహమ్మద్ షరీఫ్ నిజామాబాద్‌కు బదిలీ అయ్యారు.

News August 10, 2024

తూప్రాన్: ప్రోడక్ట్ బిజినెస్.. రూ. 6.50 లక్షల మోసం

image

ఆన్‌లైన్ పార్ట్ టైం జాబ్ కింద ప్రొడక్ట్ బిజినెస్ అంటూ సైబర్ నేరగాళ్లు రూ.6.50 లక్షలు కాజేసినట్లు తూప్రాన్ SI శివానంద తెలిపారు. తూప్రాన్ మండలానికి చెందిన వ్యక్తికి టెలిగ్రామ్ ‘మైఖేల్ కోర్స్ 2,185’ గ్రూపులో ఆన్‌లైన్ పార్ట్ టైం జాబ్ కింద ప్రొడక్ట్ బిజినెస్ అంటూ ఓ లింకు రాగా ఓపెన్ చేశాడు. పలు దఫాలుగా పెట్టుబడి పెట్టగా.. లాభాలు చూపించాడు. రూ.10లక్షల లాభం చూపించగా, విత్ డ్రా చేసేందుకు అవకాశం లభించలేదు.

News August 10, 2024

అడ్డాకుల: హత్య కేసులో.. 10 మందికి రిమాండ్

image

మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం కాటవరం గ్రామానికి చెందిన కొల్లంపల్లి హత్య కేసు నిందితులను శుక్రవారం పోలీసులు రిమాండ్‌కు తరలించారు. CI రామకృష్ణ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కొల్లంపల్లి 6 రోజుల క్రితం హత్యకు గురైన సంఘటన తెలిసిందే. ఈ ఘటనలో పోలీసులు 10 మందిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించామన్నారు.

News August 10, 2024

వరంగల్: ఈ గ్రంథాలయంలో 90వేల పుస్తకాలు

image

WGLలోని ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయం ఆకర్షణీయంగా నిలుస్తోంది. రూ.2కోట్ల స్మార్ట్ సిటీ నిధులతో నగరంలోని రంగంపేటలో నిర్మించిన ఈ గ్రంథాలయంలో 90 వేలకు పైగా పుస్తకాలున్నాయి. శిథిలావస్తలో ఉన్న గ్రంథాలయాన్ని ఆధునికీకరించిన తర్వాత ఇక్కడకు వచ్చే పాఠకుల సంఖ్య క్రమంగా పెరిగింది. రోజుకు సుమారు 900 మంది పాఠకుల వరకు వస్తున్నారు. ప్రతి రోజు ఉ.8 నుంచి రా.8 వరకు చదువుకోవచ్చు. మీరూ ఇక్కడకు వెళ్లుంటే కామెంట్ చేయండి.

News August 10, 2024

మెదక్: పల్లెల్లో పడకేసిన పారిశుధ్యం

image

పల్లెల్లో పారిశుధ్యం పడకేసింది. ఎక్కడ చూసినా చెత్తాచెదారం దర్శనం ఇస్తుంది. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 1,615 జీపీలు ఉన్నాయి. సిద్దిపేట జిల్లాలో 499, మెదక్‌ జిల్లాలో 469, సంగారెడ్డి జిల్లాలో 647 జీపీలు ఉన్నాయి. ఫిబ్రవరి 1, 2024తో జీపీల పాలకవర్గాల పదవీకాలం ముగిసింది. దీంతో ఆ రోజు నుంచి ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో కార్యదర్శులపై అదనపు భారం పడుతోంది.