India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇళ్ల నుంచి బయటకు రావాలంటే జంకే పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో జిల్లా ప్రజలకు ఉపశమనం కలిగించేలా హైదరాబాద్ వాతావరణ శాఖ చల్లటి విషయం చెప్పింది. ఆదివారం నుంచి 3 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని వెల్లడించింది.
ఉమ్మడి NZB జిల్లా రోజు రోజుకు నిప్పుల కొలిమిని తలపిస్తుంది. మధ్యాహ్నం వేళ జిల్లా కేంద్రాలతో పాటు ముఖ్య పట్టణాల్లోని ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. నేడు NZB జిల్లా డిచ్పల్లి (మం) కొరట్పల్లిలో 43.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా.. KMR జిల్లా నిజాంసాగర్ (మం) హాసన్ పల్లిలో 42.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మున్ముందు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు.
ఓ మహిళ హత్యకు గురైన ఘటన HYD శంషాబాద్ పరిధి సంఘీగూడ శివారులో ఈరోజు జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. శంషాబాద్ పరిధి పాలమాకులకు చెందిన యాదమ్మను శంకరయ్య అనే వ్యక్తి హత్య చేసి, మృతదేహాన్ని పాతిపెట్టాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
లోక్‌సభ ఎన్నికలకు భారాస సిద్ధం అవుతోంది. ఇందులో భాగంగా పలు పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో అసెంబ్లీ స్థానాల వారీగా ఎన్నికల సమన్వయకర్తలను నియమించింది.
✒మహేశ్వరం-కనకమామిడి స్వామి గౌడ్
✒రాజేంద్రనగర్-పుట్టం పురుషోత్తం రావు
✒శేరిలింగంపల్లి- కె.నవీన్ కుమార్(MLC)
✒చేవెళ్ల-నాగేందర్ గౌడ్
✒పరిగి- గట్టు రామచంద్రరావు
✒వికారాబాద్- పటోళ్ల కార్తీక్ రెడ్డి
✒తాండూర్- బైండ్ల విజయ్ కుమార్(జడ్పీ వైస్ ఛైర్మన్)
ఓ మహిళ హత్యకు గురైన ఘటన HYD శంషాబాద్ పరిధి సంఘీగూడ శివారులో ఈరోజు జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. శంషాబాద్ పరిధి పాలమాకులకు చెందిన యాదమ్మను శంకరయ్య అనే వ్యక్తి హత్య చేసి, మృతదేహాన్ని పాతిపెట్టాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
మాజీ సీఎం KCR వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. శనివారం HYD గాంధీభవన్‌లో మంత్రి మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో రచ్చ చేస్తామని కేసీఆర్ అంటున్నారు. రేపటి నుంచి కాంగ్రెస్ నేతలంతా రోడ్లపైనే ఉంటారు. ఎవరు వస్తారో రండి, చూసుకుందాం. ఎవరిని ఎవరు తొక్కుతారో తేలుతుంది. చేనేత కార్మికులకు బీఆర్ఎస్ పార్టీ చేసిందేమీ లేదు’ అని విమర్శించారు. BRS పని అయిపోయిందని ఎద్దేవా చేశారు.

HYDలో ఎండ దంచి కొడుతోంది. దీంతో నగరంలో ప్రయాణం చేయాలంటేనే ప్రజలు ఆలోచిస్తున్నారు. తప్పని పరిస్థితుల్లో కొందరు మహిళలు సైతం పైసలైనా సరే.. ఏసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. ఏసీ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య వేసవి వేళ పెరుగుతోంది. మరికొంత మంది ప్రయాణికులు మెట్రోను సైతం ఆశ్రయిస్తున్నారు. ప్రయాణికులతో అటు మెట్రో, ఇటు ఏసీ బస్సులు కిటకిటలాడుతున్నాయి.

HYD నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బండారి లే అవుట్‌లో బీఆర్‌ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి విస్తృతంగా ప్రచారం చేశారు. రాగిడి మాట్లాడుతూ.. KCR హయాంలోనే అభివృద్ధి జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం కల్లబొల్లి కబుర్లు చెబుతూ ప్రజలను మభ్య పెడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వివేకానంద, నిజాంపేట్ మున్సిపాలిటీ డిప్యూటీ మేయర్ ధన్‌రాజ్ పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.