Telangana

News August 4, 2024

ఫిలింఫేర్ అవార్డ్స్‌లో మెరిసిన ‘కరీంనగర్’

image

సినీ పరిశ్రమలో ప్రతిభ కనబర్చిన దర్శకులు, నటీనటులకు 2024 ఫిలింఫేర్ అవార్డ్స్ ప్రదానం చేసిన విషయం తెలిసిందే. అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన దర్శకులు వేణు ఎల్దండి, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన బలగం, దసరా సినిమాలకు ఈ అవార్డులు రావడం విశేషం. ఉత్తమ దర్శకులుగా వారు ఈ అవార్డులు అందుకోగా.. ఉత్తమ నటీనటులుగా నాని, కీర్తి సురేశ్‌లకు ఈ అవార్డులు దక్కాయి.

News August 4, 2024

ఖమ్మం: రేపటి నుంచి సందడే సందడి

image

మూడంతో మూడు నెలలు నిలిచిపోయిన శుభ కార్యక్రమాలు రేపటి నుంచి మళ్లీ ప్రారంభం కానున్నాయి. రేపటి నుంచి శ్రావణ మాసం మొదలవుతుంది. ఈనెల 8,9,10,11, 15,17,18,22,23,24,28,30 తేదీలలో వివాహ ముహూర్తాలు ఉన్నాయని ఇప్పటికే చాలామంది శుభ ముహూర్తాలు నిర్ణయించినట్లు అర్చకులు తెలిపారు. పెళ్లిళ్ల కోసం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కళ్యాణ మండపాలను సిద్ధం చేస్తున్నారు. శ్రావణ మాసం సెప్టెంబర్ 3తో ముగుస్తుంది.

News August 4, 2024

ఈ నెలాఖరులోగా ఇందిరమ్మ ఇండ్లు:మంత్రి

image

ఖమ్మం: ఈ నెలాఖరులోగా ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తుందని చెప్పారు. రైతులను రాజులు చేయాలని, రైతు ముఖంలో ఆనందం చూడాలని నెల రోజులలోపే రూ. 31 వేల కోట్లు రైతు పంట రుణమాఫీ చేశామన్నారు. ధరణి తో ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని పేర్కొన్నారు.

News August 4, 2024

మెదక్ రీజియన్‌‌లో 3.80 కోట్ల మంది ప్రయాణం

image

మహాలక్ష్మి పథకంలో భాగంగా మెదక్ రీజియన్‌‌లో ప్రతిరోజు లక్ష 70 వేల మంది మహిళలు ప్రయాణిస్తున్నారని మెదక్ ఆర్ఎం ప్రభులత తెలిపారు. ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన 9 డిసెంబర్ 2023 నుంచి నేటి వరకు సుమారుగా ఉచిత ప్రయాణాన్ని 3.80 కోట్ల మంది మహిళలు వినియోగించుకున్నారని, ఈ మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టడంతో 70%గా ఉన్న ఆక్యుపెన్సీ రేషియో నేడు 98%కి పెరిగిందన్నారు.

News August 4, 2024

NLG: 1,2 కాదు.. ఏకంగా 4 ప్రభుత్వ ఉద్యోగాలు

image

నల్గొండ జిల్లా పెద్దవూర మండలం తుంగతుర్తిలో వ్యవసాయ కుటుంబానికి చెందిన నడ్డి గోపాలకృష్ణ నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు. 2018 డిసెంబర్లో పంచాయతీ కార్యదర్శి, 2019 నవంబర్లో రైల్వేలో గ్రూప్-డీ ఉద్యోగం, 2020లో సివిల్ కానిస్టేబుల్‌గా ఎంపికై ప్రస్తుతం భువనగిరి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్నాడు. తాజాగా ప్రకటించిన టీజీపీఎస్సీ ఫలితాల్లో ఏఈఈ సివిల్ ఇంజినీర్ (గెజిటెడ్) ఉద్యోగం సాధించాడు.

News August 4, 2024

ఈనెల 7న రామప్పలో హుండీల లెక్కింపు

image

ఈనెల 7న రామప్ప దేవాలయం హుండీలను లెక్కిస్తున్నట్లు ఆలయ ఈవో బిల్లా శ్రీనివాస్ తెలిపారు. బుధవారం ఉ. 10 గంటలకు దేవస్థానం మండపంలో లెక్కింపు ప్రారంభమవుతుందన్నారు. ఈ కార్యక్రమానికి పోలీసు సిబ్బంది, అర్చకులు, సంబంధిత అధికారులు పాల్గొంటారని పేర్కొన్నారు.

News August 4, 2024

భువనగిరి: మూత్రశాల పక్కనే భోజన శాల

image

భువనగిరిలోని ప్రభుత్వ హైస్కూల్ పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. పాఠశాల ఆవరణలో మూత్రశాలల పక్కనే భోజనశాల ఏర్పాటు చేయడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దాదాపు 500 మంది విద్యార్థులకు అరకొర మూత్రశాలలతో పాఠశాల అంతా కంపు కొడుతోంది. విద్యార్థులు రోగాల బారిన పడాల్సి వస్తోందని తల్లిదండ్రులు వాపోతున్నారు. ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు.

News August 4, 2024

కోటగిరి: గొడ్డు కారంతో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం

image

నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం కొత్తపల్లి పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో కారం లేని పప్పు వడ్డించారని పిల్లలు తినేందుకు ఇష్టపడలేదు. దీంతో పిల్లలకు గొడ్డు కారం, నూనె పోసి ఇవ్వగా పిల్లలు దాంతోనే కడుపు నింపుకున్నారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న పిల్లల తల్లిదండ్రులు ప్రధానోపాధ్యా యుడిపై మండిపడి ఎంఈఓకు ఫిర్యాదు చేశారు.

News August 4, 2024

రైలు కింద పడి NG కాలేజ్ స్టూడెంట్ సూసైడ్ 

image

రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన నల్గొండ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో తెల్లవారుజామున జరిగింది. శేషమ్మ గూడెం గ్రామానికి చెందిన బొల్లెద్దు చందు (20) నల్గొండ ఎన్జీ కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు. శనివారం రాత్రి ఇంటి నుంచి వెళ్లిన చందు దుప్పలపల్లి సమీపంలో రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. సూసైడ్‌కు గల కారణాలు తెలియాల్సి ఉంది. 

News August 4, 2024

HYD: 3ఏళ్లలో బెంగళూరును అధిగమిస్తాం: మంత్రి

image

IT ఉత్పత్తుల ఎగుమతిలో రూ.7లక్షల కోట్లతో బెంగళూరు మొదటి స్థానంలో ఉండగా, హైదరాబాద్ రెండో స్థానంలో ఉందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. వచ్చే మూడేళ్లలో తాము బెంగళూరును అధిగమించి ముందుకెళ్లేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. కాగా, రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు నేటి నుంచి ఈనెల 13 వరకు మంత్రి అమెరికా, సౌత్ కొరియాలో పర్యటిస్తున్నారు.