Telangana

News August 3, 2024

సూర్యాపేట: తెల్లవారుజామున మహిళ దారుణ హత్య 

image

సూర్యాపేట మండలంలో జాటోత్ తండాలో తెల్లవారుజామున దారుణం జరిగింది. తండాకు చెందిన దరావత్ రమణను దారుణంగా హత్య చేశారు.  ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

News August 3, 2024

ఖమ్మం జిల్లాలో సీడీపీఓల బదిలీ

image

ఖమ్మం జిల్లాలో పలు మండలాలకు చెందిన సీడీపీఓలను బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఖమ్మం రూరల్(M)(1)లో పనిచేస్తున్న శివమ్మ అదే మండలానికి, అటు ఖమ్మం రూరల్(M) (2) జయలక్ష్మి మణుగూరుకు, ఖమ్మం అర్బన్ కవిత మధిరకు, చండ్రుగొండ(M) నిర్మల జ్యోతి కల్లూరుకు, అశ్వారావుపేట(M) సరస్వతి తిరుమలాయపాలెంకు, బూర్గంపాడు(M) సలోమి చండ్రుగొండకు, తిరుమలాయపాలెం (M) కనకదుర్గ సత్తుపల్లికి బదిలీ అయ్యారు.

News August 3, 2024

MBNR: రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య

image

మక్తల్ పట్టణానికి చెందిన దంతనూర్ కుర్మయ్య (45) అనే వ్యక్తి పట్టణ శివారులోని ఎల్లమ్మ కుంట వద్ద రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. పట్టాలపై పడివున్న కుర్మయ్యను శనివారం ఉదయం స్థానికులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకున్నాడని స్థానికులు తెలిపారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

News August 3, 2024

నిజామాబాద్: శ్రావణమాసంలో ఆర్టీసీ ఆఫర్

image

శ్రావణ మాసం సందర్భంగా ఆర్టీసీ రీజియన్ పరిధిలో స్పెషల్ ఆఫర్ అందించనున్నామని ఆర్ఎం జానీ రెడ్డి తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ఎలాంటి డిపాజిట్ లేకుండా పెళ్లిళ్లు ఇతర వేడుకలకు బస్సులను ముందుగా బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నామన్నారు. ప్రైవేట్ బస్సుల కంటే తక్కువ ఛార్జీ తీసుకుంటామని డ్రైవర్లకు కూలీ చెల్లించే అవసరంలేదన్నారు. అరుణాచలం వరకు బస్సు సర్వీసులు నడుపుతున్నామని పేర్కొన్నారు.

News August 3, 2024

‘స్వచ్ఛదనం-పచ్చదనం’కి సమాయత్తం.. రేపటి నుంచి షురూ!

image

రాష్ట్ర ప్రభుత్వం ‘స్వచ్ఛదనం-పచ్చదనం’ కార్యక్రమాన్ని రేపటి నుంచి ఈనెల 9 వరకు అమలు చేయనుంది. ఉమ్మడి MBNR జిల్లాలో 1,692 గ్రామపంచాయతీలు, 19 పురపాలికలు ఉన్నాయి. 5 జిల్లాల పరిధిలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఆయా జిల్లా కలెక్టర్లు, అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇప్పటికే అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. వర్షాకాలం కావడంతో పారి శుద్ధ్య వ్యవస్థ అధ్వానంగా మారింది. వాటిపై దృష్టి పెట్టమన్నారు.

News August 3, 2024

MBNR: 5 నుంచి శ్రావణం.. నెలరోజులు మస్తు లగ్గాలు

image

మూడంతో మూడు నెలలు నిలిచిపోయిన శుభ కార్యక్రమాలు సోమవారం నుంచి మళ్లీ ప్రారంభం కానున్నాయి. ఈనెల 5 నుంచి శ్రావణ మాసం మొదలవుతుంది. ఈనెల 8,9,10,11, 15,17,18,22,23,24,28,30 తేదీలలో వివాహ ముహూర్తాలు ఉన్నాయని, శంకుస్థాపనలు, గృహప్రవేశాలకు ఇప్పటికే చాలామంది శుభ ముహూర్తాలు నిర్ణయించినట్లు అర్చకులు తెలిపారు. శ్రావణ మాసం సెప్టెంబర్ 3తో ముగుస్తుంది.

News August 3, 2024

MDK: చేప.. చెరువుకు చేరేనా?

image

చేప పిల్లల పంపిణీ పథకం ఈ ఏడాది ఆలస్యమయ్యేల కనిపిస్తుంది. శుక్రవారం జిల్లా కేంద్రంలోని మత్యశాఖ ఆఫీస్‌లో బిడ్లకు సంబంధించి టెండరు బాక్సు తెరవగా ఒక్కరూ టెండర్‌‌లో పాల్గొనకపోవడంతో అధికారులు అవాక్కయ్యారు. జిల్లాలో మొత్తం 1,160 చెరువులు, కుంటలు ఉన్నాయి. 227 మత్స సహాకార సంఘాలు ఉండగా వీటిలో 11,013 మంది సభ్యులు ఉన్నారు. ఈ ఏడు 3.41 కోట్ల చేప పిల్లలు వదలాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.

News August 3, 2024

ఖమ్మంలో విద్యుత్ షాక్‌తో మహిళ మృతి

image

విద్యుత్ షాక్ గురై ఓ మహిళ మృతి చెందిన ఘటన ఖమ్మంలో శుక్రవారం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. ఖమ్మంకి చెందిన గోటం నాగలక్ష్మి ఓ కోచింగ్ సెంటర్లో ఆయాగా పనిచేస్తోంది. శుక్రవారం తన వద్ద తాళం చెవిని గ్రౌండ్ ఫ్లోర్ నుంచి పై ఫ్లోర్లో ఉన్న వారికి ఇచ్చేందుకు తాళాలు విసరగా అవి విద్యుత్ తీగలపై పడ్డాయి. వాటిని ఆమె ఇనుప రాడ్ ద్వారా తీస్తుండగా షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందింది. 

News August 3, 2024

ఆదిలాబాద్: రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి

image

రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థి మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. ఆదిలాబాద్‌ జిల్లా బేల(M) సాంగిడికి చెందిన ప్రీతమ్(27) భిక్కనూరు(M) TU పీజీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. శనివారం కళాశాలలో వీడ్కోలు సమావేశం ఉండడంతో పనుల నిమిత్తం శుక్రవారం బయటికి వెళ్లాడు. బస్టాండ్‌ ప్రాంతంలో రోడ్డు దాటుతుండగా ఆటో ఢీకొట్టడంతో ప్రీతమ్ అక్కడికక్కడే చనిపోయాడు.

News August 3, 2024

నిజామాబాద్: బ్యాంకు మేనేజర్ అరెస్ట్

image

UNION బ్యాంక్‌లో అవకతవకలకు పాల్పడిన మాజీ సీనియర్ మేనేజర్‌అరెస్టయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. నిజామాబాద్‌లోని బ్యాంకు బడాబజార్ సీనియర్ మేనేజర్ అజయ్‌ ఖాతాదారులను నమ్మించి రూ.3కోట్లు వసూలు చేశారు. వారి హామీపత్రాలను వాడుకొని డబ్బులు తీసుకున్నాడు. మోసపోయిన బాధితుల్లో ఒకరు జులై 16న పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. అజయ్‌ను శుక్రవారం సాయంత్రం నిజామాబాద్ రైల్వే స్టేషన్‌లో అరెస్ట్ చేశారు.