Telangana

News August 1, 2024

మానవత్వం చాటుకున్న GHMC మేయర్

image

GHMC మేయర్ గద్వాల విజయలక్ష్మి మానవత్వం చాటుకున్నారు. గురువారం సా. KBR పార్క్‌కు ఆమె వాకింగ్‌కు వెళ్లారు. పార్క్ వద్ద నిస్సహాయస్థితిలో ఉన్న ఓ వృద్ధుడిని గమనించారు. స్వయంగా అతడి వద్దకు వెళ్లి సమస్యను తెలుసుకున్నారు. గత రెండు రోజులుగా ఏమీ తినలేదని, ఒక కాలు కూడా లేదని సదరు వృద్ధుడు‌ తెలిపాడు. చలించిపోయిన ఆమె‌ వెంటనే DRF సిబ్బందిని పిలిపించారు. పోలీసుల సహాయంతో బేగంపేటలోని షెల్టర్ హోంకు తరలించారు.

News August 1, 2024

మానవత్వం చాటుకున్న GHMC మేయర్

image

GHMC మేయర్ గద్వాల విజయలక్ష్మి మానవత్వం చాటుకున్నారు. గురువారం సా. KBR పార్క్‌కు ఆమె వాకింగ్‌కు వెళ్లారు. పార్క్ వద్ద నిస్సహాయస్థితిలో ఉన్న ఓ వృద్ధుడిని గమనించారు. స్వయంగా అతడి వద్దకు వెళ్లి సమస్యను తెలుసుకున్నారు. గత రెండు రోజులుగా ఏమీ తినలేదని, ఒక కాలు కూడా లేదని సదరు వృద్ధుడు‌ తెలిపాడు. చలించిపోయిన ఆమె‌ వెంటనే డీఆర్ఎఫ్ సిబ్బందిని పిలిపించారు. పోలీసుల సహాయంతో బేగంపేటలోని షెల్టర్ హోంకు తరలించారు.

News August 1, 2024

నిజాంసాగర్: ప్రజాపాలన కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్

image

నిజాంసాగర్ ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కేంద్రాన్ని గురువారం కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆకస్మికంగా సందర్శించారు. ప్రభుత్వ పథకాలకు సంబంధించి వివిధ కారణాలతో లబ్ధి కాని ప్రజల నుంచి దరఖాస్తుల, పరిశీలన, డిస్పోజల్‌ను పరిశీలించారు. ప్రజాపాలన కేంద్రాల ద్వారా స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించి వేగంగా ప్రజలకు లబ్ధి చేకూర్చాలని ఎంపీడీవో గంగాధర్‌ను కలెక్టర్ ఆదేశించారు.

News August 1, 2024

HNK: విషాదం.. డెంగ్యూతో నిండు గర్భిణి మృతి

image

డెంగ్యూ జ్వరంతో నిండు గర్భిణి మృతి చెందిన ఘటన HNK జిల్లా శాయంపేట మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల ప్రకారం.. గట్లకానిపర్తికి చెందిన శిరీష 9 నెలల గర్భవతి. శిరీషకు డెంగ్యూ జ్వరం రావడంతో 3 రోజుల క్రితం HNKలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది. ఆమె కడుపులో ఉన్న కవల శిశువులను బతికించేందుకు వైద్యులు చేసిన ప్రయత్నం వృథా అయింది. తల్లి, బిడ్డలు మృతి చెందారు.

News August 1, 2024

రేపు సాయంత్రం 4గంటలకు నాగార్జున సాగర్ నీరు విడుదల

image

నాగార్జునసాగర్ జలాశయానికి 2.82 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. సాగర్​ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం నీటిమట్టం 532.5 అడుగులుగా ఉంది. నిల్వ సామర్థ్యం 312.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటినిల్వ 172.87 టీఎంసీలుగా ఉంది. ప్రవాహం పెరుగుతున్నందున శుక్రవారం సాయంత్రం 4 గంటలకు నాగార్జున సాగర్ నుంచి మంత్రులు పొంగులేటి, ఉత్తమ్, తుమ్మల, కోమటిరెడ్డి నీరు విడుదల చేయనున్నారు.

News August 1, 2024

ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు హర్షణీయం: ప్రొఫెసర్ కాసీం

image

ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామని ప్రొఫెసర్ కాసీం అన్నారు. భారత రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పొందుపర్చిన ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు, మాదిగ ఉప కులాలు అందుకోవడంలో నష్టపోయారని, సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణపై ఇచ్చిన చారిత్రాత్మకమైన తీర్పు అన్నారు. ఎంఎస్‌పీ రాష్ట్ర నాయకులు మైస రాములు మాదిగ, ఎం‌ఆర్‌పీ‌ఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు ముండ్రాతి కృష్ణ ఉన్నారు.

News August 1, 2024

మానవత్వం చాటుకున్న  బిగ్ బాస్ -7 విజేత పల్లవి ప్రశాంత్

image

చిన్న శంకరంపేటకి చెందిన కౌలు రైతు దడువాయి పరమేశ్వర్ కొద్ది రోజుల క్రితం అప్పులు తీర్చలేక భాదతో ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి ముగ్గురు పిల్లలు. పేదరికంతో ఇబ్బంది పడుతున్నారని తెలుసుకొని బిగ్ బాస్ -7 విజేత పల్లవి ప్రశాంత్ గురువారం పరమేశ్వర్ భార్య శంకరమ్మకు రూ.20 వేల ఆర్ధిక సాయం అందించి మానవత్వం చాటుకున్నారు.

News August 1, 2024

మాదకద్రవ్యాల కట్టడికి చర్యలు : నారాయణరెడ్డి

image

నల్గొండ జిల్లాలో మాదకద్రవ్యాలు ఏ రూపంలో ఉన్నా నియంత్రించాల్సిన అవసరం ఉందని కలెక్టర్ సి. నారాయణరెడ్డి అన్నారు. గురువారం తన చాంబర్లో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్‌‌తో కలిసి జిల్లా స్థాయి నార్కో కో- ఆర్డినేషన్ సెంటర్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇందులో భాగంగా మాదక ద్రవ్యాల నియంత్రణపై పెద్ద ఎత్తున ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.

News August 1, 2024

దుబాయ్‌లో సిరిసిల్ల వాసి మృతి

image

సిరిసిల్ల జిల్లాలో విషాదం నెలకొంది. కుటుంబీకుల ప్రకారం.. వేములవాడ మండలం నూకలమర్రికి చెందిన చంద్రకాంత్ అనే గల్ఫ్ కార్మికుడు అనారోగ్యంతో అబుదాబిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గతనెల 29న మృతి చెందాడు. అయితే 1992 నుంచి దుబాయ్ వెళ్తున్న చంద్రకాంత్.. మరణం చెందటం పట్ల కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మృతునికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. ఈనెల 2న మృతదేహం స్వగ్రామానికి చేరనున్నట్లు సమాచారం.

News August 1, 2024

నూతన గవర్నర్‌ను కలిసిన జితేందర్ రెడ్డి

image

రాష్ట్రానికి నూతన గవర్నర్‌గా వచ్చిన జిష్ణు దేవ్ శర్మను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఢిల్లీ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి గురువారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో తెలంగాణ భవన్ ప్రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్, తదితరులు ఉన్నారు.