India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఢిల్లీ రాజేంద్రనగర్‌లోని ఓ సివిల్స్ కోచింగ్ సెంటర్‌లో వరదల కారణంగా మంచిర్యాల జిల్లాకు చెందిన తానియాసోని (25) మృతిచెందింది. ఆమె తండ్రి శ్రీరాంపూర్-1 భూగర్భ గని డీజీఎంగా పని చేస్తున్నారు. ఈ ఘటనపై కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తానియాసోని తండ్రి విజయ్ కుమార్‌ను కిషన్ రెడ్డి ఫోన్లో పరామర్శించారు. భౌతికకాయం వీలైనంత త్వరగా అప్పగించేందుకు సంపూర్ణంగా సహకరిస్తామని హామీ ఇచ్చారు.

కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం పెద్దతడ్గూర్‌కి చెందిన వివాహిత ఆత్మహత్య చేసుకున్నట్లు ఇన్‌ఛార్జ్ ఎస్ఐ సాయిలు తెలిపారు. గ్రామానికి చెందిన చంద్రకళ(25) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు చెప్పారు. తండ్రి విఠల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

జవహర్ నవోదయ విద్యాలయంలో ప్రవేశం లభిస్తే విద్యార్థులకు మంచి భవిష్యత్ ఉంటుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తానికి మాముమూరులో ఉన్న ఈ ఏకైక పాఠశాలలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. 6వ తరగతిలో ప్రవేశాలకు 80 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో గ్రామీణ ప్రాంత విద్యార్థులకు 75 శాతం, పట్టణ ప్రాంత విద్యార్థులకు 25 శాతం కేటాయిస్తారు. 6వ తరగతిలో ప్రవేశం లభిస్తే.. 12వ తరగతి వరకు వారి చదువు ఇక్కడ కొనసాగనుంది.

పాలమూరుకు చెందిన యువకుడు అమెరికాలో ఈతకు వెళ్లి మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే, MBNR జిల్లా అడ్డాకులకు చెందిన అక్షిత్‌రెడ్డి చికాగోలోని లేక్‌మిశిగన్‌లో స్నేహితుడితో కలిసి ఈతకు వెళ్లాడు. ఓరాయి వద్దకు వెళ్లాలని నిర్ణయించుకునే క్రమంలో మధ్యలోనే ఆగి తిరిగి వస్తుండగా మునిగిపోయాడు. పోలీసులు గాలించి మృతదేహాన్ని వెలికి తీశారు. ఆదివారం అడ్డాకులలో అంత్యక్రియలు పూర్తిచేశారు.

నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం 53,774 క్యూసెక్కులు వస్తోంది. పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం నీటి నిల్వ 510.2 అడుగులుగా ఉంది. 312.05 టీఎంసీలకు గాను 131.01 టీఎంసీల నీరు నిల్వ ఉంది. శ్రీశైలం నిండుకుండను తలపిస్తోండగా రేపు గేట్లు అవకాశముంది. అదే జరిగితే సాగర్ త్వరలోనే నిండనుంది.

RR జిల్లా మహేశ్వరం అసెంబ్లీ ప్రాంతాన్ని మరో మహానగరంగా చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇక్కడ దాదాపు 12 వేల ఎకరాల్లో ప్రభుత్వ భూములు ఉండగా వారి కంపెనీలను ఏర్పాటు చేయాలని భావిస్తుంది. ఇందులో భాగంగానే స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయనుండగా.. ఆగస్టు 1న సీఎం శంకుస్థాపన చేయనున్నారు. కందుకూరు మండలం మీరాఖాన్ పేట్ ప్రాంతంలో 57 ఎకరాలు కేటాయించగా.. సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు.

కాంగ్రెస్ పార్టీని గెలిపించి ప్రజలు ఇబ్బందుల్లో పడ్డారని ఇటీవల KCR, KTR, హరీశ్‌రావు అనడం హాస్యాస్పదమని సీఎం రేవంత్ అన్నారు. ఇబ్బందుల్లో పడ్డది తెలంగాణ ప్రజలు కాదని.. KCR కుటుంబం ఇబ్బందుల్లో పడిందన్నారు. KTR సెల్ఫీలు దిగుతూ.. సెల్ఫ్ డబ్బాలు కొట్టుకుంటున్నారని తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేసిన నాయకులను, కార్యకర్తలను పార్టీ గుర్తిస్తుందన్నారు.

కామారెడ్డి ఇందిర గాంధీ స్టేడియంలో AUG 2న జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు KMR జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జైపాల్ రెడ్డి, అనీల్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జావెలిన్ 100, 400 mtrs, అంశాల్లో..అండర్ 14, 16, 18, 20 విభాగాల్లో బాల, బాలికలకు ఎంపికలు ఉంటాయన్నారు. వయస్సు దృవీకరణ పత్రంతో ఉదయం 8 గంటల లోపు స్టేడియం నందు హాజరు కావాలని కోరారు.

ఉమ్మడి జిల్లాలో జాతీయ రహదారుల(NH)పై ఆశలు నెలకొంటున్నాయి. ఇటీవల 4 కొత్త NHలు కావాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. జగిత్యాల-పెద్దపల్లి-మంథని-కాటారం వరకు 130 KM రాష్ట్ర రహదారిని NHగా మార్చాలని ప్రతిపాదించారు. ఈ రహదారి నిర్మాణంతో NH 565, 563, 353 అనుసంధానించడమే కాకుండా TG, మహారాష్ట్ర, ఛత్తీస్‌గడ్ ప్రజలకు అనువుగా ఉంటుందని, కాళేశ్వరం క్షేత్రానికి ప్రాధాన్యం లభిస్తుందని భావిస్తున్నారు.

HYD నగరంలో ఇప్పటికే ఎలక్ట్రిక్ బస్సులను నడుపుతున్న ఆర్టీసీ.. రూ.17 కోట్లతో ఐదు డిపోల్లో EV బస్సుల ఛార్జింగ్ స్టేషన్ల నిర్మాణం చేపట్టింది. ఇప్పటికే కంటోన్మెంట్‌లో రూ.కోటీ 24 లక్షలు, మియాపూర్లో రూ.34 లక్షల వ్యయంతో ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు పూర్తయింది. బీహెచ్ఈఎల్‌లో రూ.3.9 కోట్లు, HCUలో రూ.2.49 కోట్లు, జేబీఎస్ రూ.9 కోట్లతో ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల పనులు జరుగుతున్నాయి.
Sorry, no posts matched your criteria.