India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మహబూబ్ నగర్ జిల్లాలోని ఆదర్శ పాఠశాలల్లో 6వ తరగతి నుంచి పదో తరగతి ప్రవేశాలకు ఈనెల 7వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్ తెలిపారు. కావున ప్రవేశాలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు వెబ్ సైట్ telanganams.cgg.gov.in లో హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని డీఈవో తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వనియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు.
గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన హసన్‌పర్తి మండలంలో చోటుచేసుకుంది. SI అశోక్ ప్రకారం.. ఆరెపల్లికి చెందిన యాద రాకేశ్(24).. ఎల్కతుర్తిలోని బంధువుల పెళ్లికి స్నేహితుడితో కలిసి వెళ్లాడు. ఇంటికి వచ్చి మళ్లీ పెళ్లికి వెళ్తుండగా.. అనంతసాగర్ శివారులో వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాకేశ్ అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.
మెండోరా(M) బుస్సాపూర్ NH 44 జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. SI శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్మూర్ మండలం సుర్బీర్యాల్ గ్రామానికి చెందిన భార్యాభర్తలు గోదావరి నదికి పూజలు చేసేందుకు వెళ్తున్నారు. రహదారి మధ్యలో ఉన్న పువ్వులు తెంపడానికి వచ్చింది. తిరిగి ఆటో వద్దకు వెళ్లే క్రమంలో ఆర్మూర్ నుంచి నిర్మల్ వైపు వెళ్తున్న గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో గర్భిణి మృతి చెందినట్లు తెలిపారు.
కుటుంబ కలహాలతో మనస్తాపం చెంది ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. రెబ్బెన ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. రెబ్బెన మండలం కొండపల్లి గ్రామానికి చెందిన గుర్లె పోశం తరుచూ భార్యతో గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలో ఈ నెల 2న పోశంకు భార్యతో గొడవ జరగాగ ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై పోశం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
పదో తరగతి వార్షిక పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం వేగవంతమైంది. ఈనెల 3న నల్లగొండలో మూల్యాంకనం ప్రారంభించగా విధులు కేటాయించిన ఉపాధ్యాయులు పూర్తి స్థాయిలో హాజరు కాలేదు. దీంతో విద్యాశాఖ నోటీసులు జారీ చేయడంతో శుక్రవారం అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు మూల్యాంకనానికి హాజరయ్యారు. సెలవు దినాల్లోనూ మూల్యాంకనం చేసి త్వరగా పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు
మామిడి కాయలను తింటున్న కోతుల మందను కొట్టేందుకు చెట్టు ఎక్కిన వ్యక్తి ప్రమాదవశాత్తు కిందపడి మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు.. పాల్వంచ మండలంలోని రంగాపురం వద్ద పెనుబల్లి మండలం రామసీతారాం గ్రామానికి చెందిన హనుమా మామిడి తోటను లీజుకు తీసుకున్నాడు. శుక్రవారం కోతులగుంపు చెట్ల మీదకు రావడంతో వాటిని తరిమేందుకు చెట్టు ఎక్కి ప్రమాదవశాత్తు కిందపడటంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు.
క్షుద్రపూజలు చేసి నయం చేస్తామని రూ.9.73లక్షలు తీసుకుని మోసం చేసిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. CI నాగభూషణరావు వివరాలు.. వనపర్తి జిల్లా గోపాల్‌వేటకు చెందిన సుద్దుల రాజు కొడుకు వెంకటేశ్(14)కు మతిస్తిమితం సరిగా లేదు. జ్యోతిష్యాలయం పేరుతో నయం చేస్తామని నమ్మించి మోసం చేసిన APలోని గుంటూరుకు చెందిన పరబ్రహ్మం, వెంకన్న, గోపిను అరెస్ట్ చేసి ఫోన్లు, రూ.7లక్షలు స్వాధీనం చేసుకున్నారు.
రోడ్డు ప్రమాదందో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన హుజూరాబాద్‌లో శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. సైదాపూర్ మండలం ఎలబోతారం నుంచి HZBDకు ఓ మట్టితో ట్రక్కు బయల్దేరింది. ఈ క్రమంలో బోర్నపల్లి శివారు వద్దకు రాగా.. ట్రక్కు అదుపు తప్పి బైకుపై వస్తున్న ముగ్గురు యువతీ యువకులపై మట్టి పడింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన విజయ్, సింధుజ, వర్ష మృతి చెందారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన యువతిపై ఓ యువకుడు లైంగిక దాడి చేశాడు. పోలీసుల కథనం ప్రకారం.. మల్కాజిగిరికి చెందిన రతన్‌కుమార్(22)కు తుకారాంగేట్‌కు చెందిన ఓ యువతి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమైంది. ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఓయో లాడ్జికి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆమె గర్భిణి కావడంతో పెళ్లి చేసుకునేందుకు నిరాకరించగా.. బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అరెస్ట్ అయ్యాడు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భానుడు భగభగమంటున్నాడు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గురువారం 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. దీంతో ఇండ్లలో నుంచి బయటికి రావాలంటే ప్రజలు జంకుతున్నారు. రోడ్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ప్రయాణికులు శీతల పానీయాలు తాగుతూ.. సేద తీరుతున్నారు. వృద్ధులు చిన్నారుల పరిస్థితి మరి దారుణంగా ఉంది. ఏప్రిల్ నెలలో ఇంత ఉష్ణోగ్రత ఉంటే మే నెలలో ఎలా ఉంటుందో అని ఆందోళన చెందుతున్నారు.
Sorry, no posts matched your criteria.