India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ప్రజా సేవలో విశేష ప్రతిభ కనబరుస్తున్న ఖమ్మం కలెక్టర్ అనుదీప్ ప్రతిష్ఠాత్మక ‘బిట్స్ పిలాని యంగ్ అలుమ్ని అచీవర్’ అవార్డు లభించింది. ప్రజా జీవిత రంగంలో ఆయన అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారాన్ని అందజేశారు. గతంలో సివిల్స్ టాపర్‌గా నిలిచిన అనుదీప్, ప్రస్తుతం పాలనలో తనదైన ముద్ర వేస్తూ యువతకు స్ఫూర్తినిస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు, పలువురు కలెక్టర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

బాలల సంరక్షణ బాధ్యతగా తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. శనివారం మెదక్ జిల్లా కేంద్రంలోని బాలల సదనం సందర్శించారు. అక్కడి పిల్లల సౌకర్యాలు, విద్య, పోషకాహారం వంటి విషయాలు అడిగి తెలుసుకున్నారు. వారికి అందిస్తున్న మెనూ, నిత్యావసర వస్తువులను పరిశీలించారు. బాలల వారి సంక్షేమం, ఉన్నత భవిష్యత్‌కు ఆసక్తిని, గమనించి వారి అభివృద్ధికి చేదోడుగా ఉండాలన్నారు.

ఆదిలాబాద్ జిల్లా ప్రజలు ఉద్యోగాల పేరుతో మోసం చేసే మూఠా సభ్యులను, డబ్బులు అడిగే ముఠాలను నమ్మవద్దని, అలాంటి వారి పట్ల అప్రమత్తతో వ్యవహరించాలని SP అఖిల్ మహాజన్ సూచించారు. డబ్బులతో ప్రభుత్వ ఉద్యోగాలు రావని.. కష్టపడి పరీక్షల ద్వారా ఉద్యోగాలను సాధించాలన్నారు. నకిలీ ఉద్యోగాల పేరుతో మోసం చేసే వారిపై జిల్లా పోలీసు యంత్రాంగం కఠినమైన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు.

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వారం రోజుల్లో 232 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు CP సాయి చైతన్య తెలిపారు. వారిని కోర్టులో హాజరుపరచగా రూ.22.40 లక్షల జరిమానా విధించారన్నారు. ఇందులో ఆరుగురికి వారం రోజుల పాటు జైలు శిక్ష విధించడం జరిగిందని ఆయన వివరించారు. ప్రజలు మద్యం తాగి వాహనాలు నడపరాదని, వాహనదారులు ధ్రువపత్రాలు సక్రమంగా తమ వద్ద ఉంచుకోవాలని ఆయన సూచించారు.

రెప్పపాటులో ప్రయాణికుల ఆభరణాలను మాయం చేసే అంతరాష్ట్ర ‘థార్’ ముఠా దొంగతనం ఉదంతాన్ని జిల్లా పోలీసులు ఛేదించారు. సాంకేతిక పరిజ్ఞానంతో 15రోజుల పాటు మధ్యప్రదేశ్‌లోని థార్ జిల్లాను జల్లెడ పట్టినCCS బృందం, ముఠా సభ్యుడైన షా అల్లా రఖాను అరెస్టు చేసింది. నిందితుడి వద్ద నుంచి రూ.85 లక్షల విలువైన 60 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ శరత్ చంద్ర పవర్ తెలిపారు.

HYD నగర పాలనలో ఒక భారీ శకం ముగిసి, కొత్త అధ్యాయం మొదలైంది. GHMCని మూడు కార్పొరేషన్లుగా విభజించే ప్రక్రియ ఇప్పటికే 100 % పూర్తయింది. లోపల జరగాల్సిన ఫైల్ వర్క్, వార్డుల పునర్విభజన అంతా సైలెంట్‌గా క్లోజ్ చేసేశారు. వార్డుల సంఖ్యను 300కు పెంచుతూ పాలనాపరమైన కేటాయింపులు కూడా ముగిశాయి. ముగ్గురు సీనియర్ సిటీ ప్లానర్లకు బాధ్యతలు అప్పగిస్తూ GHMC ఉత్తర్వులు జారీ చేయడం విభజన పూర్తయిందనడానికి బలమైన సాక్ష్యం.

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, బోధన్ MLA పొద్దుటూరి సుదర్శన్ రెడ్డిని, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠిని NZB జిల్లా రెడ్ క్రాస్ కమిటీ సభ్యులు శనివారం మర్యాద పూర్వకంగా కలిశారు. కమిటీ జిల్లా ఛైర్మన్ ఆంజనేయులు జిల్లా రెడ్ క్రాస్ గురించి వివరించారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోట రాజశేఖర్, కోశాధికారి కరిపే రవీందర్, జూనియర్ రెడ్ క్రాస్ కోఆర్డినేటర్ డాక్టర్ అబ్బపూర్ రవీందర్, వరుణ్ బాబు తదితరులు పాల్గొన్నారు.

చిన్నపిల్లలకు ఇచ్చే ‘అల్మాంట్-కిడ్’ సిరప్ విషయంలో రాష్ట్ర డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (DCA) కీలక హెచ్చరిక జారీ చేసింది. బిహార్‌కు చెందిన ట్రైడస్ రెమెడీస్ ఉత్పత్తి చేసిన ఈ మందులో (బ్యాచ్: AL-24002) ప్రాణాంతకమైన ‘ఇథిలీన్ గ్లైకాల్’ రసాయనం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రజల వద్ద ఈ బ్యాచ్ సిరప్ ఉంటే వెంటనే 1800-599-6969 నంబర్‌కు ఫిర్యాదు చేయాలన్నారు. దీన్ని తక్షణమే వాడకం నిలిపివేయాలన్నారు.

సంక్రాంతి వేళ గాలిపటాలు ఎగురవేసేటప్పుడు విద్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఖమ్మం ఎస్ఈ శ్రీనివాసాచారి సూచించారు. లోహపు పూత ఉండే చైనా మాంజా వాడటం వల్ల విద్యుత్ షాక్ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. తీగలకు పతంగులు చిక్కుకుంటే కర్రలతో తీయడానికి ప్రయత్నించవద్దని, ఏదైనా అత్యవసరమైతే వెంటనే 1912 హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్ చేయాలని కోరారు.

సంక్రాంతి వేళ నిషేధిత చైనా మాంజా విక్రయించినా, వాడినా కఠిన చర్యలు తప్పవని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం హెచ్చరించారు. నైలాన్ దారాల వల్ల పక్షులు, వాహనదారులకు ప్రాణాపాయం ఉందని, వీటిపై నిఘాకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. ప్రజలు కేవలం కాటన్ దారాలనే వాడి, సురక్షితంగా పండుగ జరుపుకోవాలని ఆయన కోరారు.
Sorry, no posts matched your criteria.