Telangana

News August 29, 2024

ఖమ్మం: తొలి రోజు 1,475 కుటుంబాల నిర్ధారణ

image

రుణమాఫీ వర్తించని రైతు కుటుంబాల నిర్ధారణ ప్రక్రియ బుధవారం ప్రారంభం కాగా, జిల్లాలో తొలిరోజు 1,475 కుటుంబాల వారిని వ్యవసాయ శాఖ గుర్తించింది. రేషన్ కార్డులు లేకుండా రుణమాఫీకి అర్హులైన రైతుల జాబితాలను నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ మండలాల వారిగా నేరుగా వ్యవసాయ శాఖ అధికారులకు పంపించింది. ఈ జాబితాల ఆధారంగా కుటుంబ సభ్యుల నిర్ధారణ ప్రక్రియ వ్యవసాయ శాఖ చేపట్టింది.

News August 29, 2024

HYD: ఓయూలో రూ.23 లక్షల ప్యాకేజీతో ప్లేస్‌మెంట్‌

image

ఓయూలో ఇటీవల జరిగిన క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో ఎంబీఏ, టెక్నాలజీ మేనేజ్‌మెంట్ విద్యార్థులు 17 మందికి HDFC బ్యాంక్ కొలువులు ఇచ్చింది. రూ.8 లక్షల నుంచి రూ.23 లక్షల మధ్య వార్షిక వేతనంతో ఈ నియామకాలు జరిగాయి. MBA కళాశాలలో నాలుగో సెమిస్టర్ చదువుతున్న 120 మంది విద్యార్థుల్లో 109 మందికి వేర్వేరు కంపెనీలు నియామక పత్రాలు అందించనున్నాయి.

మునుగోడు: పలివెల మీదుగా వెళ్లే బస్సు సర్వీస్ రద్దు

image

రోడ్డు బాలేదన్న వంకతో కొన్నేళ్లుగా మునుగోడు మండలం పలివెల గ్రామం మీదుగా ప్రతి రోజు HYDకు వెళ్లే బస్సు సర్వీసును బుధవారం ఆర్టీసీ అధికారులు రద్దు చేశారు. నిత్యం ఉదయం 8:30 గంటలకు NLG డిపో నుంచి బయలుదేరే ఆ బస్సు మునుగోడు మీదుగా కచలాపురం , పలివెల, కోతులారం, మల్లారెడ్డిగూడెం, సర్వేల్ నుంచి HYDకు వెళ్లేది. తిరిగి మధ్యాహ్న సమయంలో అదే గ్రామాల మీదుగా NLGకు చేరుకునేది.

News August 29, 2024

మణుగూరు: తండ్రిని చంపిన కుమారుడు అరెస్టు

image

కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం పగిడేరులోని బుచ్చి రాములును ఆయన కుమారుడు సూర్యం మంగళవారం కర్రలతో కొట్టి చంపాడు. నిందితుడిని బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. సీఐ సతీశ్ వివరాల ప్రకారం.. కొన్ని కారణాల వల్ల సూర్యం భార్య 8 ఏళ్ల కిందట పుట్టింటికి వెళ్లింది. అప్పటి నుంచి మద్యానికి బానిసైన నిందితుడు ఆస్తి కోసం తల్లిదండ్రులతో తరచూ గొడవ పడేవాడు. ఈక్రమంలో కర్రలతో తండ్రిపై దాడి చేయగా అతడు మృతి చెందాడు.

News August 29, 2024

సంగారెడ్డి: ALERT.. కాన్ఫరెన్స్‌లో పెట్టి కాజేశారు

image

ఎల్‌ఐసీ పాలసీ పూర్తయినందున డబ్బులు అకౌంట్‌లో వేస్తామని న్యాల్కల్(M) బసంతపూర్‌‌కి చెందిన వెంకట్‌రెడ్డికి ఫోన్‌ వచ్చింది. బ్యాంకు ఖాతా నంబర్‌ చెప్పాలని కోరగా వెంటనే ఇచ్చాడు. అందులో డబ్బు లేదని, కనీసం రూ.3 వేలు ఉండాలని సైబర్‌ నేరగాడు చెప్పాడు. డబ్బులు వేస్తామని, వేరే వారి నంబర్ ఇవ్వాలని అడగ్గా అతడు సుదర్శన్‌రెడ్డికి కాన్ఫరెన్స్‌ కలిపాడు. అతడిని మాటల్లో పెట్టి ఖాతా నుంచి రూ.99 వేలు కొట్టేశాడు.

News August 29, 2024

HYD: జీహెచ్ఎంసీలో భారీగా బదిలీలు

image

జీహెచ్ఎంసీలో అంతర్గత బదిలీల ప్రక్రియలో భాగంగా జూనియర్ అసిస్టెంట్ల నుంచి అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ల వరకు భారీ సంఖ్యలో బదిలీలు చేశారు. బదిలీ అయిన వారిలో జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, సూపరింటెండెంట్లు, అడిషనల్ మున్సిపల్ కమిషనర్లు ఉన్నారు. వీరిని ఒక విభాగం నుంచి మరో విభాగానికి, ఒక కార్యాలయం నుంచి మరో కార్యాలయానికి బదిలీ చేశారు.

News August 29, 2024

ఓయూ పీజీ పరీక్షలు 19కి వాయిదా

image

ఓయూ పరిధిలో జరగనున్న పీజీ రెగ్యులర్ కోర్సుల పరీక్షలు వచ్చేనెల 19కి వాయిదా వేశారు. మొదట ప్రకటించిన సెప్టెంబర్ 4 నుంచి ప్రారంభం కావాల్సిన పీజీ కోర్సుల 2, 4వ సెమిస్టర్ పరీక్షలను యుజిసి నెట్, టిఎస్ సెట్ పరీక్షల కారణంగా వాయిదా వేసినట్లు అధికారులు పేర్కొన్నారు. పూర్తి వివరాలను ఉస్మానియా వెబ్ సైట్లో చూడవచ్చన్నారు.

HYD: డిగ్రీ, పీజీ ప్రవేశాలకు దగ్గర పడుతున్న గడువు!

image

HYDలోని అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీ, కాకతీయ వర్సిటీలో దూర విద్యలో ప్రవేశాల కోసం దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఆగస్టు 31న ఈ గడువు పూర్తి కానుంది. డిగ్రీలో బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సులు, పీజీలో ఎంఏ, ఎంకామ్‌, ఎంఎస్సీ, ఎంబీఏ కోర్సులతో పాటు పీజీ డిప్లొమాలో బీఎల్‌ఐఎస్సీ, ఎంఎల్‌ఐఎస్సీ, కోర్సులు ఉన్నట్లు ప్రొఫెసర్ కోటేశ్వరరావులు, డా.వీరన్న తెలిపారు.