Telangana

News April 6, 2024

నల్గొండ: ఫోన్ ట్యాపింగ్ మూలాలు ఇక్కడే!

image

రాష్ట్రంలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన పోలీసుల పాత్ర ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తోంది. జిల్లాకు చెందిన ఓ సీఐని విచారించగా, నల్గొండలో వార్ రూం ఏర్పాటు చేసినట్లు నిర్ధారించారు. అక్కడ తనిఖీలు నిర్వహించారు. ఇప్పటికే ఇద్దరు కానిస్టేబుళ్లను అదుపులో తీసుకున్నారు. విచారణ కొనసాగుతున్న కొద్దీ ఇంకా ఎవరెవరు బయటకొస్తారోనన్న ఉత్కంఠ ఉంది.

News April 6, 2024

కామారెడ్డి: ఆస్తి పన్ను చెల్లించే వారికి గుడ్ న్యూస్

image

కామారెడ్డి జిల్లాలోని పురపాలికల్లో 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఆస్తి పన్ను చెల్లించే వారికి 5 శాతం పన్ను రాయితీ కల్పిస్తూ సర్కారు తాజాగా ఉత్తర్వులిచ్చింది. ఈ నెలాఖరులోపు చెల్లించేవారికి అవకాశం వర్తించనుంది. గత ఆర్థిక సంవత్సరంలో బకాయిలు లేనివారికి ప్రస్తుతం రాయితీ ఇచ్చారు. బకాయిలు 85 శాతం దాటి వసూలు కావడంతో ఈ సారి నూతనంగా ప్రకటించిన పథకానికి స్పందన వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

News April 6, 2024

WGL: మూడు నెలల్లో వంతెన పూర్తి: MLA

image

HNK-KNR ప్రదాన రహదారిలోని నయీంనగర్ నాలాపై పాత వంతెన కూల్చే పనులకు శుక్రవారం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా MLA నాయిని రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. 3 నెలల్లో కొత్త వంతెన పనులను పూర్తి చేస్తామని అన్నారు. గత ఐదేళ్లుగా నాలాను ఆనుకొని ఉన్న కాలనీలు వర్షాకాలంలో ముంపునకు గురవుతూ ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారని తెలిపారు. దీనికి శాశ్వత పరిష్కారంగా కొత్త వంతెన నిర్మిస్తున్నామని పేర్కొన్నారు.

News April 6, 2024

సిద్దిపేట: విద్యార్థినితో అసభ్య ప్రవర్తన.. టీచర్ సస్పెన్షన్

image

సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ పదవ తరగతి పరీక్షా కేంద్రంలో విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యా శాఖ అధికారి ఇ.శ్రీనివాస్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపిన అనంతరం విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన విషయం నిజమేనని తేలడంతో సస్పెండ్ చేసినట్లు కొండపాక ఎంఈవో పేర్కొన్నారు.

News April 6, 2024

ఖమ్మం: ముగిసిన ఇంటర్ వాల్యుయేషన్

image

ఖమ్మం: ఇంటర్మీడియట్‌ జవాబు పత్రాల మూల్యాంకనం శుక్రవారంతో ముగిసింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 2,75,139 జవాబు పత్రాలను జిల్లాకు పంపించగా  నెల 4వ తేదీ నుంచి మూల్యాంకనం ప్రారంభించారు. ప్రతీ అధ్యాపకుడు రోజుకు 30 చొప్పున జవాబు పత్రాలను దిద్దగా , శుక్రవారంతో వాల్యూయేషన్‌ పూర్తయిందని డీఐఈఓ కె.రవిబాబు తెలిపారు.

News April 6, 2024

కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే కోడూరు సత్యనారాయణ గౌడ్

image

మాజీ ఎమ్మెల్యే కోడూరు సత్యనారాయణ గౌడ్ కాంగ్రెస్‌లో చేరారు. ఏఐసీసీ సెక్రటరీ రోహిత్ చౌదరి సమక్షంలో, రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జి దీపా దాస్ మున్షీ సత్యనారాయణగౌడ్‌కి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ సెక్రటరీ విష్ణునాథ్, చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి తదితరులున్నారు.

News April 6, 2024

ఉమ్మడి జిల్లాలో నేడు బీఆర్ఎస్ నిరసనలు

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా శనివారం ఉదయం 10 నుంచి బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులకు మద్దతుగా నిరసన కార్యక్రమానికి అధిష్ఠానం పిలుపునిచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, ఉమ్మడి జిల్లాలోని అయా నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు.

News April 6, 2024

ఖమ్మం: ఒకే ఇంట్లో ముగ్గురికి పోలీసు కొలువులు

image

బూర్గంపాడు: ఇటీవల ప్రకటించిన పోలీసు నియామకాల్లో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములకు పోలీసులు ఉద్యోగాలు వరించాయి. అంబేద్కర్ కాలనీకి చెందిన కేసుపాక నాగేశ్వరరావు రాజ్యలక్ష్మి దంపతులకు ముగ్గురు కుమారులు ఉన్నారు. వారిలో భాస్కరరావుకు గతంలో పోలీసు ఉద్యోగం రాగా, ప్రసాద్ రావు, రఘురామ్‌లకు ఇటీవల ప్రకటించిన ఫలితాల్లో పోలీసు శాఖలో ఉద్యోగాలు లభించడం పట్ల గ్రామస్తులు వారిని ఘనంగా సన్మానించారు.

News April 6, 2024

తెర వెనుక ఏమి జరుగుతుందో నేటి యువత తెలుసుకోవాలి: చంద్ర కుమార్

image

కేయూ సెనెట్ హాల్‌లో మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ 117వ జయంతిని శుక్రవారం విశ్వవిద్యాలయ SC/ST సెల్ సంచాలకులు డాక్టర్ టి.రాజమణి అధ్యక్షతన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా “కాంటెంపరరీ ఇష్యూస్ ఆఫ్ ఇండియన్ సొసైటీ” అనే అంశంపై కీలక ఉపన్యాసం చేసి మాట్లాడారు. అనంతరం రిటైర్డ్ హైకోర్ట్ జడ్జి జస్టిస్ చంద్ర కుమార్ మాట్లాడుతూ.. తెర వెనుక ఏమి జరుగుతుందో నేటి యువత తెలుసుకోవాలన్నారు.

News April 6, 2024

NGKL: ‘వలస వాది మల్లురవిని తరిమి కొడుదాం’

image

వలస వాది మల్లురవిని తరిమి కొడుదామని నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. శుక్రవారం అచ్చంపేటలో నిర్వహించిన పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో మాట్లాడారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి నేటికీ వంద రోజులు పూర్తి అయిన రుణమాఫీ చేయలేదని, ఇది పేదల కాంగ్రెస్ పార్టీ కాదని, రైతులను మోసం చేసే కాంగ్రెస్ అని విమర్శించారు.

error: Content is protected !!