India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కోదాడకు చెందిన గుండు రవి పని నిమిత్తం ఖమ్మం వెళ్లి తిరిగి ద్విచక్ర వాహనంపై కోదాడ వస్తుండగా వెంకటాపురం వద్ద ఎదురుగా వస్తున్న గుర్తుతెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. రవి కోదాడలో ఫోటో గ్రాఫర్‌గా పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. రవి మృతి పట్ల ఫోటో గ్రాఫర్ అసోసియేషన్ నాయకులు, మిత్రులు బంధువులు సంతాపం వ్యక్తం చేశారు.
ఓ వ్యక్తి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన HYD శివారు శంకర్‌పల్లి PS పరిధిలో జరిగింది. CI తెలిపిన వివరాలు.. మండల పరిధి మాసానిగూడ వాసి రాములు(35) వ్యవసాయం చేస్తుండేవాడు. కొన్ని రోజుల క్రితం అతడికి చికెన్ పాక్స్ (అమ్మోరు) వ్యాధి సోకడంతో పిచ్చిపిచ్చిగా ప్రవర్తించే వాడు. ఇవాళ మధ్యాహ్నం తనపై బల్లి పడిందని, స్నానం చేసి వస్తానని చెప్పి తన పొలం వద్ద ఉన్న బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదైంది.

నాగర్ కర్నూల్ జిల్లాకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో వార్నింగ్ జారీ చేసింది. రాబోయే రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు రెండు డిగ్రీలు అధికంగా నమోదు అవుతాయని, తీవ్రమైన వడగాలు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఈ హెచ్చరికల నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు వైద్యులు సూచిస్తున్నారు. మధ్యాహ్నం వేళలో అత్యవసరమైతే బయటకు వెళ్లాలని, పిల్లలు, వృద్ధుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు.
ఆదిలాబాద్ రూరల్ మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధునికి తీవ్ర గాయాలయ్యాయి. చాందా (టి) గ్రామ సమీపంలో శుక్రవారం రహదారిపై నడుచుకుంటూ వెళుతున్న 70 ఏళ్ల వృద్ధుడు రాందాస్‌ను ద్విచక్ర వాహనంపై వస్తున్న యువకుడు ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో రాందాస్ రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 వాహన ఈఎంటీ కిషన్, పైలెట్ ముజఫర్ లు క్షతగాత్రుణ్ని ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.
ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ వీక్షించేందుకు వచ్చిన 18 ఏళ్లు నిండిన యువతీయువకులకు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అధికారులు ఓటు హక్కుపై అవగాహన కల్పించారు. ఓటు ప్రాధాన్యతను తెలియజేసేలా అవగాహన నిర్వహించి చైతన్యం తేవాలనే ఉద్దేశంతో కార్యక్రమాలు చేపట్టామన్నారు. పోలింగ్ శాతం పెంచడానికి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు స్వీప్ నోడల్ అధికారి తెలిపారు.

HYD రాజేంద్రనగర్‌లో డ్రగ్స్ కలకలం రేగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. బండ్లగూడ సన్ సిటీకి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ జయచంద్ వద్ద 15 గ్రాముల డ్రగ్స్‌ను మాదాపూర్ SOT టీమ్ సీజ్ చేసింది. కారులో డ్రగ్స్ తరలిస్తుండగా మాటు వేసి SOT సిబ్బంది పట్టుకున్నారు. నిందితుడి ఇంట్లో సోదాలు నిర్వహించారు. NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి అతడిని అరెస్ట్ చేశారు. జయచంద్ పాత నేరస్థుడిగా పోలీసులు గుర్తించారు.
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో ఆరేళ్ల బాలుడు అదృశ్యమయ్యాడు. పోలీసుల వివరాల ప్రకారం.. గోసం బస్తీకి చెందిన రేణుక తన కొడుకు నాని(6)ని తీసుకుని రాకాసిపేటలో కూలీ పనికి వెళ్లింది. అక్కడ నాని ఆడుకుంటూ కనిపించకుండా పోయాడు. చుట్టుపక్కల ఎంత వెతికినా ప్రయోజనం లేకపోవటంతో రేణుక బోధన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు రెండు బృందాలుగా విడిపోయి గాలింపు చర్యలు చేపట్టారు.
కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం జాగిరిపల్లిలో నమ్మదగిన సమాచారం మేరకు శుక్రవారం హుజూరాబాద్ ఏసీపీ శ్రీనివాస్ జీ, రూరల్ సీఐ పులి వెంకట్ గౌడ్, స్థానిక ఎస్సై జన్ను ఆరోగ్యం పోలీస్ సిబ్బందితో కలిసి తనిఖీ చేశారు. ఎలాంటి అనుమతి లేకుండా హుజూరాబాద్ గ్రామానికి చెందిన కన్నబోయిన మహేందర్ ఒక రూమంలో అక్రమంగా 21.30 క్వింటాళ్ల గన్ పౌడర్ దాచి పెట్టినట్లు ఎస్సై చెప్పారు. అతడిపై కేసు నమోదు చేశామన్నారు.
Sorry, no posts matched your criteria.