India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఖమ్మం లోక్ సభ ఎన్నికకు BRS, BJP నుంచి ఇప్పటికే అభ్యర్థులు ఖరారయ్యారు. కానీ కాంగ్రెస్‌లో టికెట్ పంచాయతీ తెగకపోవడం పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. తన భార్యకు టికెట్ తెచ్చుకునే ప్రయత్నాల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉండగా.. తన తమ్ముడికి టికెట్ ఇప్పించుకునేందుకు మంత్రి పొంగులేటి ప్రయత్నిస్తున్నారు. తన కుమారుడికే టికెట్ ఇవ్వాలని మంత్రి తుమ్మల కోరుతున్నట్లు స్థానికుల్లో చర్చ నడుస్తోంది.
స్వాతంత్ర్య సమరయోధుడు, సంఘసంస్కర్త, రాజకీయవేత్త, భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 117వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నల్గొండ కలెక్టరేట్లో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి కలెక్టర్ దాసరి హరిచందన, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టీ. పూర్ణచందర్, స్పెషల్ కలెక్టర్ నటరాజ్, డిఆర్ఓ రాజ్యలక్ష్మి, జిల్లా అధికారులు పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ VS చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ దృష్ట్యా ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11:30 వరకు ఉప్పల్ పరిధి ట్రాఫిక్ మళ్లించనున్నామని పోలీసులు తెలిపారు. మ్యాచ్ జరిగే సమయంలో వాహనదారులు ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని ఉప్పల్ ట్రాఫిక్ పోలీసులు కోరారు. లారీ, డంపర్, ఎర్త్ మూవర్స్, వాటర్ ట్యాంకర్లు, RMC ట్రక్, అన్ని ఇతర రకాల ట్రక్కులు, భారీ వాహనాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.

ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లాలోని ప్రజలు తీవ్రమైన వేడిగాలుల వల్ల వడదెబ్బకు గురికాకుండా పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ హరిచందన అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో వేడిమి సంబంధ వ్యాధుల జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. గతంతో పోలిస్తే ఈ సంవత్సరం నల్గొండ జిల్లాలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నాయన్నారు.
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో ఏప్రిల్ 17న జరగనున్న సీతారాముల కల్యాణ మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు ఆలయ కార్య నిర్వహణ అధికారి ఎల్ రమాదేవి తెలిపారు. భక్తులు సీతారాముల కళ్యాణం వీక్షించడానికి 16 సెక్టార్లు ఏర్పాటు చేస్తామని, రెండున్నర లక్షల లడ్డూలు తయారు చేస్తున్నామన్నారు. అలాగే ఐదు లక్షల ముత్యాల తలంబ్రాలు ప్యాకెట్ లు సిద్ధం చేస్తున్నట్లు ఈవో తెలిపారు.
కేంద్రంలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈరోజు HYD కాచిగూడలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం, గుజ్జ కృష్ణ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. జూన్‌లో పార్లమెంట్ వద్ద భారీ ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పార్లమెంట్‌లో బీసీ బిల్లు పెట్టే పార్టీకే మద్దతు ఉంటుందన్నారు.

గద్వాల జిల్లా అయిజ మండలం ఉత్తనూర్ శివారులో ఉదయం <<12993576>>బొలెరో బోల్తా<<>> పడిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ప్రమాదంలో గట్టు మండలం చిన్నోనిపల్లికి చెందిన బాలుడు మనోజ్ అక్కడే మృతిచెందగా, ఉప్పరి నాగప్ప అనే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. రాయచూరు జిల్లా ఇనపనూరుకు చెందిన నాగప్ప చిన్నోనిపల్లికి చెందిన బంధువులతో కలిసి ఏపీలోని మద్దిలేటి లక్ష్మీనరసింహ స్వామి దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మంగల్ పర్తి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మంగలి భీమయ్య(46) తన వ్యవసాయ పొలం వద్ద చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తుంది. బంధువుల ఫిర్యాదులతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
Sorry, no posts matched your criteria.