Telangana

News April 5, 2024

నిర్మల్: 62 మందికి షోకాజ్ నోటీసులు

image

నిర్మల్‌లోని సెయింట్ థామస్ పాఠశాలలో నిర్వహిస్తున్న పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం కోసం విధులకు రావాల్సిన స్పెషల్ అసిస్టెంట్లు 62 మంది గైర్హాజరయ్యారు. దీంతో వారికి షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు జిల్లా విద్యాధికారి రవీందర్ రెడ్డి తెలిపారు. మూల్యాంకనానికి విధులు కేటాయించబడ్డ ఉపాధ్యాయులు రేపటిలోగా (శనివారం) హాజరుకావాలని లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.

News April 5, 2024

KMM: డయల్ 100కు 4,205 ఫోన్ కాల్స్: సీపీ

image

శాంతిభద్రతల సమస్యలకు సంబంధించి ప్రజలు నేరుగా ఫిర్యాదు చేసేలా ప్రవేశపెట్టిన డయల్ 100కు మార్చి నెలలో 4,205 మంది ఫోన్ చేశారని సీపీ సునీల్ దత్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో 75 ఫోన్లకు సంబంధించి FIRలు నమోదు చేశామని వెల్లడించారు. వీటిలో మహిళలపై వేధింపులు, చోరీలు, ప్రమాదాలు, అనుమానాస్పద మరణాలు వంటివి ఉన్నాయని తెలిపారు.

News April 5, 2024

HYD పోలీసుల అదుపులో నల్గొండ కానిస్టేబుల్స్!

image

ఫోన్ ట్యాపింగ్ కేసులో నల్గొండకు చెందిన ఇద్దరు కానిస్టేబుల్స్‌ను హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో నాయకుల ఫోన్ ట్యాప్ చేశారని వారిపై అభియోగం. అప్పట్లో మాజీ ఓ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్యే ఈ వ్యవహారాన్ని ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసినట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరి కొంతమంది పోలీసులు సహకరించినట్లు తెలుస్తోంది.

News April 5, 2024

వరంగల్ ఎంపీ అభ్యర్థి కోసం BRS కసరత్తు

image

వరంగల్ MP అభ్యర్థి కోసం BRS కసరత్తు చేస్తుంది. మొదట్లో కడియం కావ్యకు టికెట్ ఇవ్వగా నిరాకరించి హస్తం గూటికి చేరారు. దీంతో మరో అభ్యర్థిని వెతుక్కోవాల్సిన పరిస్థితి BRSలో ఏర్పడింది. మాజీ MLA తాటికొండ రాజయ్యని మళ్లీ పార్టీలోకి ఆహ్వానించి వరంగల్ నుంచి పోటీకి దింపాలని BRS నేతలు మంతనాలు జరుపుతున్నారు. అలాగే మాజీ MLA పెద్ది సుదర్శన్ సతీమణి స్వప్న, జోరిక రమేశ్ టికెట్ పట్ల ఆసక్తిగా ఉన్నారు.

News April 5, 2024

జగిత్యాల: ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు ప్రత్యర్థులు

image

నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో ప్రత్యర్థులుగా పోటీపడుతున్న కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ గురువారం ఓ వేడుకలో సరదాగా మాట్లాడుకున్నారు. కోరుట్లలో గురువారం జరిగిన ఓ వివాహ వేడుకకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, కోరుట్ల కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ నర్సింగరావు హాజరయ్యారు. అదే సమయంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, బాజిరెడ్డి గోవర్ధన్ అక్కడికి రావడంతో అందరూ కలుసుకున్నారు.

News April 5, 2024

MBNR: మారిన పరీక్ష తేదీలు

image

ఉమ్మడి జిల్లాలో 1నుంచి 9తరగతి విద్యార్థులకు నిర్వహించే ఎస్ఏ-2 (వార్షిక) పరీక్ష తేదీలు మళ్లీ మారాయి. రెండో సారి విడుదల చేసిన ప్రకటన ప్రకారం ఈనెల 8వ తేదీ నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ పేర్కొంది. గురువారం దీన్ని మారుస్తూ.. కొత్త తేదీలను ప్రకటించింది. 15వ తేదీ నుంచి 22వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించాల్సి ఉంది.

News April 5, 2024

మనూర్: రూ. 6లక్షల నగదు స్వాధీనం

image

ఎలాంటి పత్రాలు లేకుండా తరలిస్తున్న రూ.6 లక్షల నగదును పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. జహీరాబాద్ నుంచి బాదల్ గావ్ చౌరస్తా వద్ద ఎస్ఐ తనిఖీలు చేస్తుండగా ఓ వాహనంలో ఈ నగదు లభ్యమైంది. సంగారెడ్డి‌లోని గ్రీవెన్స్‌లో డిపాజిట్ చేస్తామని ఎస్ఐ తెలిపారు. సరైన పత్రాలు లేకుండా నగదు తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News April 5, 2024

మల్లాపూర్: ప్రేమ జంటపై అమ్మాయి కుటుంబ సభ్యుల దాడి

image

మల్లాపూర్ మండలం సాతారం గ్రామంలో ప్రేమ జంటపై అమ్మాయి కుటుంబ సభ్యులు దాడి చేసినట్లు ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు. సాతారానికి చెందిన అనిల్ అదే గ్రామానికి చెందిన రమ్యను ఇటీవల ప్రేమ వివాహం చేసుకొని వేరే గ్రామంలో నివసిస్తున్నాడు. గురువారం గ్రామానికి తిరిగి రావడంతో అమ్మాయి కుటుంబ సభ్యులు అబ్బాయి ఇంట్లోకి చొరబడి దాడి చేసి అమ్మాయిని తీసుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.

News April 5, 2024

NGKL: గంజాయి మత్తులో.. తండ్రిని హత్య చేసిన కుమారుడు

image

గంజాయి తాగొద్దన్నందుకు తండ్రిపై కుమారుడు పెట్రోల్ పోసి హత్య చేసిన ఘటన RR జిల్లా తుర్కయంజాల్‌లో గురువారం చోటుచేసుకుంది. పోలీసులకు వివరాల ప్రకారం.. కొల్లాపూర్‌కు చెందిన రవీందర్(60)కు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు అనురాగ్ గంజాయికి బానిసయ్యాడు. గంజాయి తాగొద్దని మందలించడంతో, పెట్రోల్ పోసి, బండరాయితో మోది తండ్రిని హత్య చేశాడు. పోలీసులు నిందితుడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. కేసు నమోదు చేశారు.

News April 5, 2024

నాగార్జునసాగర్ నీటి మట్టం వివరాలు..

image

 నాగార్జునసాగర్ జలాశయంలో నీటి నిల్వలు అడుగంటుతున్నాయి. శుక్రవారం ఉదయం వరకు పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులకు గాను ప్రస్తుతం 511.90 అడుగులు, నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలకు గాను ప్రస్తుతం 134.9183 టీఎంసీల నీటి నిల్వ ఉంది. మెయిన్ పవర్ హౌస్‌కు నిల్, ఎస్సేల్బీసీ, ఎడమ కాల్వకు 7,675 క్యూసెక్కుల నీరు విడుదల అవుతుండగా ఇన్ ఫ్లో లేదు.

error: Content is protected !!