Telangana

News August 29, 2024

KNR: పనిచేయని సీబీపీ యంత్రాలు.. రోగులకు ఇబ్బందులు

image

రోగి వ్యాధి నిర్ధారణలో రక్తపరీక్షలనేవి చాలా కీలకం. వీటి కోసం రాష్ట్ర ప్రభుత్వం పీహెచ్‌సీల్లో రూ.2 లక్షలు వెచ్చించి ‘కంప్లీట్ బ్లడ్ పిక్చర్’ (సీబీపీ) యంత్రాలను ఏర్పాటుచేసింది. అయితే ఉమ్మడి జిల్లాలో వాటి నిర్వహణ సరిగాలేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. యంత్రాలకు వినియోగించే రసాయనాలను సరఫరా చేయకపోవడం అవి మూలకు చేరాయి. దీంతో డెంగీ బారిన పడిన రోగులు ఇబ్బందులు పడుతున్నారు.

News August 29, 2024

వరంగల్ MGMలో కనీస వసతులు కరవు

image

వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో కనీస సౌకర్యాలు, వసతులు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. హాస్పిటల్‌లోని క్యాజువాలిటిలో ఫ్లూయిడ్ స్టాండ్లు, స్ట్రెచ్చర్లు లేకపోవడంతో ఆసుపత్రికి వచ్చిన రోగులు ఈరోజు ఇబ్బంది పడ్డారు. రోగులను కుర్చీలో కూర్చోబెట్టి అటెండెంట్ చేతికి సెలైన్ బాటిల్ ఇచ్చి వైద్యం అందిస్తున్నారు. దీనిపై రోగులు, వారి బంధువులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

News August 29, 2024

ఒక్క రోజే నలుగురు సస్పెండ్

image

విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న డాక్టర్లు, తహశీల్దార్‌ను కలెక్టర్ క్రాంతి సస్పెండ్ చేశారు. ఈనెల 27న ఆందోల్, జోగిపేటలో డ్రైడే కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు చేసిన విషయం విధితమే. ఆ సమయంలో ఆందోల్ తహశీల్దార్ నజిమ్ ఖాన్, జోగిపేట ప్రాంతీయ వందపడకల ఆస్పత్రి డాక్టర్లు నాగరాజు, దివాకర్‌, స్టాఫ్ నర్స్ రాథోడ్ రేణుక అందుబాటులో లేకపోవడం, విధులపై నిర్లక్ష్యంగా ఉండటంతో కలెక్టర్ చర్యలు తీసుకున్నారు.

News August 29, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

✓భద్రాద్రి జిల్లాలో ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి పర్యటన
✓వివిధ శాఖల అధికారులతో ఖమ్మం, భద్రాద్రి జిల్లా కలెక్టర్లు సమీక్ష
✓పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు
✓తల్లాడ లో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన
✓బోనకల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం
✓నేలకొండపల్లిలో బీజేపీ కార్యకర్తలు సమావేశం
✓ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సీజనల్ వ్యాధిపై అవగాహన కార్యక్రమం

News August 29, 2024

ADB రిమ్స్‌లో వైద్యుల నియామకానికి ఇంటర్వ్యూలు

image

ఆదిలాబాద్ రిమ్స్‌లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, CAS, RMO, CMO పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు డైరెక్టర్ జైసింగ్ తెలిపారు. అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్‌లతో సెప్టెంబర్ 4న వాక్-ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావాలన్నారు. వివరాల కోసం adilabad.telangana.gov.in, rimsadilabad.org వెబ్‌సైట్‌ను సందర్శించాలన్నారు.

News August 29, 2024

అనుముల: ముత్యాలమ్మకు బోనాలు

image

నల్గొండ జిల్లా అనుముల మండల పరిధిలోని మారేపల్లి గ్రామంలో ఘనంగా ముత్యాలమ్మకు బోనాలు సమర్పించారు. డప్పు వాయిద్యాల నడుమ, మహిళలు, యువతులు ర్యాలీగా బోనాలు ఎత్తుకొని దేవాలయానికి వెళ్లారు. అమ్మవారికి చీర సారెలు పెట్టి, మేకలను కోసి మొక్కులు చెల్లించుకున్నారు.

News August 29, 2024

ములకలపల్లి: 30న గురుకుల కళాశాలలో స్పాట్ అడ్మిషన్స్

image

ములకలపల్లి గురుకుల బాలికల కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ సునీత బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియట్ ఎంపీసీ, బైపీసీలో ప్రథమ సంవత్సరంలో మిగిలిన సీట్ల భర్తీకి ఈనెల 30వ తేదీన స్పాట్ అడ్మిషన్లు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. అసక్తి గల విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికేట్లతో పాటు, ఆధార్‌కార్డు, కుల ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావాలని తెలిపారు.

News August 29, 2024

మీర్‌పేట్ చెరువులను పరిశీలించిన హైడ్రా కమిషనర్

image

మీర్‌పేట్ కార్పొరేషన్ పరిధిలోని చందనం చెరువు, మంత్రాల చెరువు, పెద్ద చెరువు మూడు చెరువులు కబ్జాకు గురయ్యాయని స్థానికులు ఇచ్చిన పిర్యాదు మేరకు బుధవారం స్థానిక అధికారులతో కలిసి హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెరువులను పరిశీలించారు. ఈ సందర్భంగా చెరువులను ఆక్రమించి ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో నిర్మించిన అక్రమ నిర్మాణాలు ఫంక్షన్ హాల్, షాపింగ్ కాంప్లెక్స్‌లను ఆయన పరిశీలించారు.

News August 29, 2024

మీర్‌పేట్ చెరువులను పరిశీలించిన హైడ్రా కమిషనర్

image

మీర్‌పేట్ కార్పొరేషన్ పరిధిలోని చందనం చెరువు, మంత్రాల చెరువు, పెద్ద చెరువు మూడు చెరువులు కబ్జాకు గురయ్యాయని స్థానికులు ఇచ్చిన పిర్యాదు మేరకు బుధవారం స్థానిక అధికారులతో కలిసి హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెరువులను పరిశీలించారు. ఈ సందర్భంగా చెరువులను ఆక్రమించి ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో నిర్మించిన అక్రమ నిర్మాణాలు ఫంక్షన్ హాల్, షాపింగ్ కాంప్లెక్స్‌లను ఆయన పరిశీలించారు.

News August 29, 2024

సిద్దిపేట: నాణ్యమైన విద్యను అందిద్దాం: డిఐఈఓ

image

ఇంటర్మీడియట్‌లో విద్యా ప్రమాణాలు పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా ఇంటర్ విద్యాధికారి రవీందర్ రెడ్డి సూచించారు. సిద్దిపేట కార్యాలయంలో జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్స్ తో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు నిబద్ధతతో పనిచేసి పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలన్నారు.