India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
HYD నగరంలో వాటర్‌కు డిమాండ్ పెరగడంతో ఉస్మాన్‌సాగర్ లైన్ నుంచి వచ్చే నీటిని శుద్ధి చేయడం కోసం 2 మాడ్యులర్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లను పునః ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. 2 MLD, 3 MLD సామర్థ్యంతో ఈ ట్రీట్మెంట్ ప్లాంట్లను రూపొందించారు. వీటిని పునః ప్రారంభించడం ద్వారా డిమాండ్‌కు తగ్గట్లుగా నీటిని అందించే అవకాశం అందని అధికారుల అంచనా.
HYD నగరంలో వాటర్‌కు డిమాండ్ పెరగడంతో ఉస్మాన్‌సాగర్ లైన్ నుంచి వచ్చే నీటిని శుద్ధి చేయడం కోసం 2 మాడ్యులర్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లను పునః ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. 2 MLD, 3 MLD సామర్థ్యంతో ఈ ట్రీట్మెంట్ ప్లాంట్లను రూపొందించారు. వీటిని పునః ప్రారంభించడం ద్వారా డిమాండ్‌కు తగ్గట్లుగా నీటిని అందించే అవకాశం అందని అధికారుల అంచనా.
RR, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్ జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లకై అధికారులు కసరత్తు ప్రారంభించారు. రంగారెడ్డిలో 41,660, మేడ్చల్ జిల్లాలో 26,037, వికారాబాద్ జిల్లాలో 1,24,303 టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని పౌరసరఫరాల సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. వరి ధాన్యాన్ని ఎప్పటిలాగే ఏ గ్రేడ్ రకానికి రూ.2,203 పెట్టి ప్రభుత్వం కొనుగోలు చేయనుంది.
హై-టెక్ సిటీలోని అన్నమయ్య సమేత స్వరసిద్ధి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన శిఖర ప్రతిష్ట, కుంభాభిషేకం కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్ర ప్రజలు కలకాలం సుఖసంతోషాలతో, సిరిసంపదలతో ఉండాలని మంత్రి ఆకాంక్షించారు.
హుజుర్నగర్ నియోజకవర్గంలోని లింగగిరి గ్రామానికి చెందిన మధిర శ్రీనివాస్ రెడ్డి, షేక్ లతీఫు ఇద్దరు ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన పోలీస్ ఉద్యోగాలలో ఫైర్ డిపార్ట్మెంట్లో ఆపరేటర్గా జిల్లా టాప్ ర్యాంకులు సాధించారు. అయితే వీరిద్దరూ లారీ డ్రైవర్గా పని చేసుకుంటూ చదువుకుంటూ ఈ ఉద్యోగం సాధించినట్లు పేర్కొన్నారు. దీంతో కుటుంబసభ్యులు మిత్రులు బంధువులు అభినందించారు.
వేసవి నేపథ్యంలో తాగునీటికి గ్రామాల్లో ప్రజలు ఇబ్బందులు పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ ఆర్వీ కర్ణన్ ఆదేశించారు. గురువారం కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాల్లో తాగునీటి సరఫరాపై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, ఆర్డబ్ల్యూఎస్, మిషన్ భగీరథ, ఇరిగేషన్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, పలువురు అధికారులతో సమీక్ష నిర్వహించారు.
పార్లమెంట్ ఎన్నికల్లో తన గెలుపు కోసం BRS నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని ఎంపి నామా నాగేశ్వరరావు కోరారు. గురువారం జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఎంపీ నామా మాట్లాడారు. 100 రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో వైఫల్యం చెందిందని, ఆటో డ్రైవర్లు, రైతులు, ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారని చెప్పారు. తెలంగాణ ప్రజల పక్షాన పోరాడేది BRS పార్టీ ఒక్కటే అని చెప్పారు.
పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ యోగేష్ గౌతమ్ హెచ్చరించారు. ఇతరుల మనోభావాలు కించపరిచేలా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఇన్స్టాగ్రామ్, ఫేస్ బుక్, వాట్స్ అప్, ట్విట్టర్ ఇతర సామాజిక మద్యమాల్లో పోస్టులు పొట్టొద్దని, సోషల్ మీడియాపై ఐటీ, పోలీసులు నిరంతర నిఘా పెట్టారని అన్నారు.
నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎన్నికలను పారదర్శకంగా, సజావుగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ అధికారులకు ఆదేశించారు. నేడు కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో భాగంగా మాక్ పోలింగ్ లో 50 ఓట్లకు తక్కువ కాకుండా వేయాలని, రిజల్ట్ చూసిన తర్వాత ఈవీఎం యంత్రాన్ని క్లియర్ చేసిన అనంతరం అసలైన పోలింగ్ కు సన్నద్ధం కావాలని సూచించారు. పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ జరపాలని సూచించారు.
హత్నూర మండలంలో ఎస్బీ ఆర్గానిక్స్ పరిశ్రమలో రియాక్టర్ పేలుడు ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని మల్టీజోన్ ఐజీ సుధీర్ బాబు అన్నారు. నేడు సంగారెడ్డిలో ఎస్పీ రూపేశ్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ అధికారిగా పటాన్‌చెరు డీఎస్పీని నియమించామని, నివేదిక వచ్చాక దాని ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. అటు పరిశ్రమలో బుధవారం జరిగిన ఘటనలో మృతుల సంఖ్య ఆరుకి చేరింది.
Sorry, no posts matched your criteria.