Telangana

News April 5, 2024

MBNR: ‘పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి’

image

పెండింగ్ దరఖాస్తులు పరిష్కరించాలని
మహబూబ్ నగర్ కలెక్టర్ రవి నాయక్ ఆదేశించారు. గురువారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయ భవనంలోని కలెక్టర్ చాంబర్ నుంచి తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులతో వెబెక్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రెవెన్యూ అంశాలపై వచ్చిన దరఖాస్తులను పరిష్కరించి నివేదిక సమర్పించాలన్నారు. మీసేవ ద్వారా వచ్చిన దరఖాస్తులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు.

News April 5, 2024

HYD: గ్రేటర్‌లో RTA ఆదాయం ఫుల్!

image

2023-24 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా RTAకు రూ.6,999 కోట్ల ఆదాయం రాగా.. ఇందులో గ్రేటర్ HYD పరిధి HYD, RR, మేడ్చల్ జిల్లాల ఆర్టీఏ ద్వారా రూ.4,449 కోట్ల సమకూరినట్లు అధికారులు తెలిపారు. రంగారెడ్డిలో రూ.1688 కోట్లు, మేడ్చల్ జిల్లాలో రూ.1298 కోట్లు, HYD జిల్లాలో రూ.1462 కోట్లు వచ్చినట్లుగా పేర్కొన్నారు. గతంతో పోలిస్తే రాజధానిలో దాదాపుగా రూ.500 కోట్ల ఆదాయం అధికంగా వచ్చింది.

News April 5, 2024

‘ఎంపీ బీబీ పాటిల్ చేసిన అభివృద్ధి శూన్యం’

image

ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసినట్లు నాగిరెడ్డి పేట పార్టీ మండల అధ్యక్షుడు భూమ శ్రీధర్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ పది సంవత్సరాల ఎంపీ పదవీకాలంలో బీబీ పాటిల్ ఎల్లారెడ్డి నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్సు, పరికరాలను ఇస్తామని చెప్పి ఇప్పటి వరకూ అందించలేదన్నారు.

News April 5, 2024

కామారెడ్డి జిల్లాలో 10,328 ఎకరాల్లో పంట నష్టం

image

కామారెడ్డి జిల్లాలో ఇటీవల కురిసిన వడగళ్ల, అకాల వర్షాలకు జిల్లాలో పంటలకు తీవ్రంగా నష్టం వాటిల్లింది. ప్రభుత్వ ఆదేశాలతో వ్యవసాయ శాఖ యంత్రాంగం రైతు వారి సర్వే చేపట్టింది. జిల్లాలో10,328 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు జిల్లా వ్యవసాయ అధికారిని భాగ్యలక్ష్మి తెలిపారు. వరి, మొక్కజొన్న, మామిడి, కూరగాయ పంటలు నష్టపోయినట్లు వ్యవసాయ విస్తీర్ణ అధికారులు గుర్తించారు. నివేదికలను ఉన్నతాధికారులకు పంపారు.

News April 4, 2024

సూర్యాపేట ప్రమాదం మృతుల వివరాలు

image

సూర్యాపేట ప్రమాద ఘటనలో బాధితుల వివరాలు ఇలా ఉన్నాయి. చింతరెడ్డి సరిత టీచర్(44),
లునావత్ రుక్కమ్మ(63), గొలుసు వేదస్విని(17నెలలు) మృతిచెందారు. కలకొట్ల లావణ్య, కంపసాటి మహేష్(ఆటో డ్రైవర్), శివరాత్రి హైమావతి, రాములమ్మ, బొప్పాని పావని, మంగయ్య(టీచర్), చెరుకుపల్లి సైదమ్మ, చెరుకుపల్లి శైలజ, చెరుకుపల్లి విజయేందర్, జీడిమెట్ల సైదులు, కొమ్ము సువర్ణ, గొలుసు సంధ్య, గొలుసు మోక్షిత్, సైదులు గాయపడ్డారు.

News April 4, 2024

NZB: ఉరి వేసుకుని యువకుడి ఆత్మహత్య

image

నిజామాబాద్ నగరంలోని న్యాల్కల్ రోడ్డులో నివాసముండే రాథోడ్ రమేశ్ (32) గురువారం తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నిజాంసాగర్ మండలానికి చెందిన రమేష్.. రోటరీనగర్‌కి చెందిన భార్గవి పదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకోగా వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇటీవల వీరి మధ్య గొడవ జరగగా భార్గవి కుటుంబీకులు మందాలించారని, ఈ కారణంగానే తన సోదరుడు సూసైడ్ చేసుకున్నట్లు మృతుని అన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News April 4, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

*శంకరపట్నం మండలంలో ఆర్టీసీ బస్సు కింద పడి ఒకరి మృతి.
*వీర్నపల్లి మండలంలో ఈతకు వెళ్లి విద్యార్థి మృతి.
*పోలీస్ కస్టడికి కరీంనగర్ కార్పొరేటర్ భర్త.
*కథలాపూర్ మండలంలో చైన్ స్నాచింగ్.
*ఎన్టిపిసి స్టేషన్ పరిధిలో హత్యాయత్నానికి పాల్పడిన ముగ్గురి అరెస్ట్.
*గుండెపోటుతో మృతి చెందిన గొల్లపల్లి మండల ఉపాధ్యాయుడు.
*దుబాయ్‌లో సిరిసిల్ల జిల్లా వాసి గుండె పోటుతో మృతి.
*జగిత్యాల కలెక్టరేట్లో ఇఫ్తార్ విందు.

News April 4, 2024

మహాదేవ్ పూర్: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

భూపాలపల్లి జిల్లా మహాదేవ్‌పూర్ మండలం బొమ్మపూర్‌లోని పోచమ్మ గుడి సమీపంలో గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. డీసీఎం వ్యాన్, ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో సూరారం గ్రామానికి చెందిన లచ్చిరెడ్డి అక్కడికి మృతి చెందాడు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News April 4, 2024

సూర్యాపేట: కుళ్ళిన మృతదేహం లభ్యం

image

హుజూర్ నగర్ మండలం దొంగల దిబ్బ, అమరవరం గ్రామాల మధ్య ఉన్న డొంక రోడ్డులో కుళ్లిన మృతదేహం లభ్యమైంది. మృతుడు హనుమంతుల గూడెం గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణగా గుర్తించారు. ఈ మృతి పై పోలీసులు ఆరా తీస్తున్నారు. బైక్ మీద నుంచి కింద పడ్డాడా, ఎవరైనా చంపి ఇక్కడ పడేశారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చరమందరాజు తెలిపారు.

News April 4, 2024

ఖమ్మం: కుక్కల దాడిలో 38 మేకలు మృతి

image

తిరుమలయపాలెం మండలం కాకరవాయి గ్రామానికి చెందిన కొమ్ము వెంకన్న అనే కాపరి మేకల మందపై కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో 38 మేకలను మృత్యువాత పడ్డాయి. వాటి విలువ రూ. 3 లక్షలకు పైగా ఉంటాయని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. బతుకు తెరువు కోసం అప్పు చేసి మేకలను కొనుక్కొని జీవనం సాగిస్తున్నానని, ప్రభుత్వం ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలని కోరారు.

error: Content is protected !!