India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
HYD నగరం తార్నాకలోని IICT లో వివిధ ప్రాజెక్టులకు రీసర్చ్ అసోసియేట్, సీనియర్ ప్రాజెక్టు అసోసియేట్, ప్రాజెక్ట్ అసోసియేట్-1, ప్రొజెక్టర్ అసోసియేట్-2 పోస్టుల భర్తీకి ఏప్రిల్ 5, 8వ తేదీలలో ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయనున్నట్లు అధికారులు తెలిపారు. పీహెచ్డీ సైన్సెస్, ఎమ్మెస్సీ సైన్స్, బీటెక్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ చేసినవారు అర్హులని,ఈ లింక్ https://iict.res.in/CAREERS అన్ని మిగతా వివరాలు పొందండి.
HYD నగరానికి చెందిన అఖిలేశ్వర్ 2018 సంవత్సరంలో కాచిగూడలో ఓ బాలికను అత్యాచారం చేసిన కేసులో 20 ఏళ్ల జైలు శిక్షను ఖరారు చేస్తూ పోక్సో కోర్టు తీర్పును వెలువరించింది. తీర్పు వెంటనే అమలులోకి వస్తుందని తెలియజేసింది. ఈ కేసులో HYD పోలీసులు సమగ్రంగా విచారణ జరిపి, పూర్తి సమాచారంతో కోర్టులో ప్రవేశపెట్టడంతో ఈ తీర్పును వెలువరించింది.
HYD నగరంలో తయారు చేసే లక్క గాజులకు GI ట్యాగ్ లభించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు గురువారం రాష్ట్ర ఐటీ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేష్ రంజన్ చేతుల మీదుగా క్రీసెంట్ హ్యాండీక్రాఫ్ట్స్ ఆర్టీషియన్ అసోసియేషన్ సభ్యులకు సర్టిఫికెట్ అందజేశారు. అనంతరం అసోసియేషన్ సభ్యులు లక్క గాజులను అధికారికి బహుమతిగా అందజేశారు. ఈ సందర్భంగా జయేష్ రంజన్ సంతోషం వ్యక్తం చేశారు.
NRPT: ట్రాక్టర్, సిమెంట్ ట్యాంకర్ ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన యాలాల్ మండలం లక్ష్మీనారాయణపూర్ సమీపంలో జరిగింది. నారాయణపేట జిల్లాకి చెందిన డప్పు బాలప్ప ట్రాక్టరులో తాండూర్ వెళ్తుండగా యాలాల్ శివారులో సిమెంట్ ట్యాంకర్ ఢీకొంది. తీవ్ర గాయాలైన బాలప్పను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
కరీంనగర్ జిల్లా స్పెషల్ ఆఫీసర్‌గా ఆర్.వి.కర్ణన్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ఐఏఎస్ ఆఫీసర్లను స్పెషల్ అబ్జర్వర్స్(ప్రత్యేక పరిశీలకులు)గా నియమిస్తూ ఈమేరకు ప్రభుత్వం ఉత్తర్వు 566 జారీ చేసింది. వేసవి దృష్ట్యా అన్ని ప్రాంతాలలో తాగు నీరు అందుబాటులో ఉండే విధంగా చూడాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
నారాయణపేట జిల్లా వైద్య కళాశాలలో ఔట్సోర్సింగ్ ఉద్యోగాల నియామకానికి నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరు కావాలని కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. 22 సీనియర్ రెసిడెంట్, 3 ఎకనామీ, 2 ఫిజియాలజీ, 2 బయో కెమిస్ట్రీ ట్యూటర్ పోస్టులు ఉన్నాయని తెలిపారు. అభ్యర్థులు ధ్రువపత్రాలతో ఏప్రిల్ 6 న ఉదయం 9 గంటలకు వైద్య కళాశాలలో వాక్ ఇన్ ఇంటర్వ్యూలో పాల్గొనాలని, వివరాలకు https://narayanpet.telagana.gov.in లో చూడాలన్నారు.
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి నవాబ్ పేట మండల కేంద్రానికి మార్గ మధ్యంలో 9 కిలోమీటర్ల దూరంలో అడవి మధ్యలో వెలసిన పర్వతాపూర్ మైసమ్మ దేవాలయం ఉమ్మడి జిల్లాలో ప్రసిద్ధిగాంచినది. కొత్త వాహనం తెచ్చినా, ఎన్నికల ప్రచారాలు ఈ ఆలయం నుండి పూజలు చేసి ప్రారంభించడం ఆనవాయితీ. ఆది, మంగళవారాలు వేల సంఖ్యలో భక్తులు దేవాలయాన్ని దర్శించుకుని బోనాలు సమర్పిస్తారు.
జిల్లాలోని అన్ని గ్రామాల చెరువులను సాగర్ నీటి ద్వారా నింపాలని, నీరు వదలక పోతే నేరుగా రైతులతో వచ్చి గేట్లు బద్దలు కొడతామని నల్లగొండ పార్లమెంట్ BJP ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరించారు. గురువారం సాగర్ కెనాల్ హెడ్ రెగ్యులేటర్ వద్ద నీటిని పరిశీలించి మాట్లాడారు. నీరు లేక గ్రామాలలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, వెంటనే ప్రభుత్వం గ్రామాలలో చెరువులను నింపాలన్నారు.
ద్విచక్ర వాహనాలకు మోడిఫైడ్ సైలెన్సర్లు అమర్చిన వారిపై ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు తెలిపారు. నగరంలో నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్ ద్వారా 79 మంది యువత వాహనాల నుంచి భారీ శబ్దం చేసే సైలెన్సర్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అనంతరం ఒక్కో వాహనదారుడికి రూ. 1,000 జరిమానా విధించామన్నారు. ఇకపై అలా చేస్తే చట్టపరంగా వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు.
వాస్క్యులర్ రంగంలో దేశంలో నం.1 ఎవిస్ హాస్పిటల్స్ తమ సేవలను మరింత విస్తరిస్తోంది. గురువారం కూకట్‌పల్లిలో ఎవిస్ హాస్పిటల్స్ నూతన శాఖ ప్రారంభించారు. MD, ప్రముఖ ఇంటర్వెన్షనల్ రేడియోలజిస్ట్ డా.రాజా వి కొప్పాల పూజాదికాలతో కొత్త ఆసుపత్రికి అంకురార్పణ చేశారు. కార్యక్రమంలో డైరెక్టర్లు శ్రీనివాస్, భరత్, వైభవ్, డాక్టర్లు సంపత్, మల్లీశ్వరి, బిందు, అధికారులు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.