Telangana

News April 4, 2024

ఎవిస్ హాస్పిట‌ల్స్ కొత్త శాఖ‌ల‌తో సేవ‌ల విస్త‌ర‌ణ

image

వాస్క్యుల‌ర్ రంగంలో దేశంలో నం.1 ఎవిస్ హాస్పిట‌ల్స్ త‌మ సేవ‌ల‌ను మ‌రింత విస్త‌రిస్తోంది. గురువారం కూక‌ట్‌ప‌ల్లిలో ఎవిస్ హాస్పిట‌ల్స్ నూత‌న శాఖ ప్రారంభించారు. MD, ప్ర‌ముఖ ఇంట‌ర్వెన్ష‌న‌ల్ రేడియోల‌జిస్ట్ డా.రాజా వి కొప్పాల పూజాదికాల‌తో కొత్త ఆసుప‌త్రికి అంకురార్ప‌ణ చేశారు. కార్యక్రమంలో డైరెక్ట‌ర్లు శ్రీ‌నివాస్, భ‌ర‌త్‌, వైభ‌వ్, డాక్ట‌ర్లు సంప‌త్, మ‌ల్లీశ్వ‌రి, బిందు, అధికారులు పాల్గొన్నారు.

News April 4, 2024

SA-2 పరీక్షలు ఈనెల 15కు వాయిదా

image

SA-2 పరీక్షలు ఈనెల 15 కు వాయిదా వేస్తూ విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. తొలుత ఈ పరీక్షలు ఏప్రిల్ 8 నుంచి ఏప్రిల్ 18 వరకు ఉన్నాయి. కాగా హై స్కూల్ ఉపాధ్యాయులు స్పాట్ డ్యూటీలో ఉండటం మూలంగా ఒకటి నుంచి 9వ తరగతి వరకు పరీక్షల నిర్వహణకు ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందని భావించిన విద్యాశాఖ అధికారులు ఈ పరీక్షలు ఏప్రిల్ 15 నుంచి 22 వరకు నిర్ణయిస్తూ షెడ్యూల్ జారీ చేశారు.

News April 4, 2024

మూసీ నదిపై GHMC కీలక నిర్ణయం

image

HYDలోని మూసీ నదికి ఇరువైపులా 50 మీటర్ల పరిధిలో నిర్మాణం, లే అవుట్ అనుమతులను నిలిపివేయాలని GHMC నిర్ణయించింది. ఈ మేరకు జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ ఉత్తర్వులు జారీ చేశారు. వేర్వేరు సంస్థల ఆధ్వర్యంలో చేపట్టే అభివృద్ధి పనులను అనుమతించొద్దని ఉప కమిషనర్లు, ప్రణాళిక అధికారులకు తెలుపుతూ వెంటనే ఆదేశాలను అమలు చేయాలని తెలియజేశారు. మూసీ మాస్టర్ ప్లాన్ డెవలప్మెంట్‌లో భాగంగా చర్యలకు ఉపక్రమించారు.

News April 4, 2024

మూసీ నదిపై GHMC కీలక నిర్ణయం

image

HYDలోని మూసీ నదికి ఇరువైపులా 50 మీటర్ల పరిధిలో నిర్మాణం, లే అవుట్ అనుమతులను నిలిపివేయాలని GHMC నిర్ణయించింది. ఈ మేరకు జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ ఉత్తర్వులు జారీ చేశారు. వేర్వేరు సంస్థల ఆధ్వర్యంలో చేపట్టే అభివృద్ధి పనులను అనుమతించొద్దని ఉప కమిషనర్లు, ప్రణాళిక అధికారులకు తెలుపుతూ వెంటనే ఆదేశాలను అమలు చేయాలని తెలియజేశారు. మూసీ మాస్టర్ ప్లాన్ డెవలప్మెంట్‌లో భాగంగా చర్యలకు ఉపక్రమించారు.

News April 4, 2024

MBNR: ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత బదిలీలు చేపట్టాలి

image

తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, పెండింగ్లో ఉన్న మూడు డీఏలను ఎన్నికల కమిషన్ అనుమతితో మంజూరు చేయాలని, ఆర్థిక శాఖలో పెండింగ్లో ఉన్న బిల్లులను మంజూరు చేయాలని కోరారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత సాధారణ బదిలీలను చేపట్టాలని అన్నారు. కార్యక్రమంలో కార్యదర్శి సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

News April 4, 2024

మానవత్వం చాటుకున్న మంత్రి సీతక్క కుమారుడు

image

మంత్రి సీతక్క కుమారుడు, కాంగ్రెస్ యూత్ నాయకుడు దనసరి సూర్య మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. మంగపేట మండలంలో తన పర్యటన ముగించుకొని వస్తున్న నేపథ్యంలో బోరు నరసాపురం గ్రామానికి చెందిన అజ్జు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. దీంతో స్వయంగా తన వాహనంలో మంగపేట ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం వైద్యులతో సూర్య మాట్లాడి మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.

News April 4, 2024

KMR: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

image

అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన కామారెడ్డి జిల్లా మహమ్మద్ నగర్ మండలంలో గురువారం జరిగింది. ఎస్సై సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని బుర్గుల్ గ్రామానికి చెందిన చాకలి పోశయ్య గ్రామ శివారు మీదుగా వెళ్లే నిజాంసాగర్ కెనాల్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

News April 4, 2024

పాలమూరు.. బెంగళూరు కానుందా..?

image

ఉమ్మడి జిల్లాలో భూగర్భజలాలు అడుగంటి పోతున్నాయి. రోజురోజుకూ నీటి ఎద్దడి తీవ్రం అవుతోంది. అయితే జలసంరక్షణ చర్యలు లేకపోవడంతోపాటు తాగునీటిని విచ్చలవిడిగా వాడటం, పచ్చదనాన్ని దెబ్బతీయడం, వాల్టా చట్టం అమలు చేయకపోవడం ఇందుకు కారణమని నిపుణులు అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల నుంచి పాలమూరు ప్రజలు చాలా నేర్చుకోవాలని.. నీటి సంరక్షణకు చర్యలు చేపట్టకపోతే బెంగళూరు మాదిరిగా నీటి కటకట రానుందని హెచ్చరించిస్తున్నారు.

News April 4, 2024

సంగారెడ్డి: ఎన్నికల శిక్షణకు హాజరుకాని 101 మందికి నోటీసులు

image

పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఈనెల 1 నుంచి 3వ తేదీ వరకు జరిగిన ఎన్నికల శిక్షణకు హాజరుకాని 101 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు కలెక్టర్ వల్లూరి క్రాంతి గురువారం తెలిపారు. శిక్షణకు ఎందుకు హాజరు కాలేదో వివరణ ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వివరణ సంతృప్తికరంగా లేకుంటే కఠిన తీసుకుంటామని హెచ్చరించారు.

News April 4, 2024

బిజినేపల్లి: బైక్ పైనుంచి పడి వ్యక్తి మృతి

image

బైక్ అదుపుతప్పడంతో కిందపడి ఒకరు మృతిచెందారు. ఈ ఘటన బిజినేపల్లి మండల కేంద్రంలోని వెంకటాపూర్ గ్రామ సమీపంలో ఇవాళ మధ్యాహ్నం జరిగింది. ఎస్సై నాగశేఖర్ రెడ్డి వివరాల ప్రకారం.. నాగనులు గ్రామానికి చెందిన కృష్ణయ్య(65) పని నిమిత్తం ద్విచక్రవాహనంపై పాలెం నుంచి గ్రామానికి వెళ్తున్నాడు. ఈక్రమంలో మార్గ మధ్యలో అదుపుతప్పి కిందపడటంతో తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేశారు.

error: Content is protected !!