India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మధిర-మోటమర్రి రైల్వే స్టేషన్ల మధ్య ఆర్సీఎం చర్చి సమీపంలో చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మధిర ప్రభుత్వాసుపత్రికి మృత దేహాన్ని తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 8712658589, 8712658607 నంబర్లు సంప్రదించాలన్నారు.
దుబాయ్‌లో సిరిసిల్ల జిల్లా వాసి మృతి చెందాడు. స్థానికుల ప్రకారం.. బోయిన్పల్లి మండలం విలాసాగర్ గ్రామానికి చెందిన చల్ల శ్రీనివాస్ దుబాయ్‌లో రెండు రోజుల క్రితం మృతి చెందాడు. శ్రీనివాస్ 12 ఏళ్ల క్రితం బతుకుతెరువు కోసం దుబాయ్ వెళ్లాడు. వీసా సమస్యల వల్ల ఇంటికి రాలేకపోయాడు. ఈ క్రమంలో రెండ్రోజుల క్రితం గుండెపోటుతో మృతి చెందాడు. మృతదేహాన్ని స్వగ్రామం రప్పించేందుకు గల్ఫ్ సంఘాలు చర్యలు తీసుకుంటున్నాయి.
జనగామ జిల్లా దేవరుప్పుల మండలం సింగరాజు పల్లి టోల్ గేట్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కార్లు ఎదురెదురుగా వస్తూ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కార్లలో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.
కొందరికి తీవ్ర గాయాలు కాగా.. అంబులెన్స్‌లో జిల్లా ఆసుపత్రికి స్థానికులు తరలించారు.
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
లోక్ సభ ఎన్నికల సందర్బంగా కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించిన అత్యవసర సేవలు అందించే శాఖల ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్, ఎన్నికల అధికారి హరిచందన అన్నారు. గురువారం ఆమె జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం ఉన్న FCI, BSNL, రైల్వే, వైద్య ఆరోగ్య, ట్రాన్స్పోర్ట్, TSSPDCL, తదితర శాఖల నోడల్ అధికారులతో పోస్టల్ బ్యాలెట్ పై సమీక్షించారు.
సూర్యాపేటలో ఆగి ఉన్న లారీని ఆటో ఢీ కొట్టిన విషయం విదితమే. ఈ ప్రమాదంలో 14 మంది గాయపడగా సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. గాయపడ్డ వారిలో ఇద్దరు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదానికి అతివేగమే కారణమని స్థానికులు తెలిపారు.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని శాంతిఖని గనిలో ప్రమాదం చోటుచేసుకుంది. కార్మికుల వివరాల ప్రకారం.. గని మెయిన్ రైడింగ్ ఛైర్ లిఫ్ట్ 47L కరువు స్టేషన్ వద్ద నుంచి లెవెల్ ఛైర్ లిఫ్ట్ స్టేషన్ కు వచ్చే చైర్ జామ్ అయింది. ఉదయం షిఫ్ట్‌లో విధులు నిర్వహిస్తున్న జనరల్ మజ్దూర్ శివకుమార్ ఆ ఛైర్ తీసే క్రమంలో కుడిచేతి రెండు వేళ్లు ప్రమాదవశాత్తు చివరి భాగాలు కట్ అయినట్లు కార్మికులు తెలిపారు.
రాష్ట్ర సంగీత నాటక అకాడమీ మాజీ ఛైర్మన్, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా బీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు బాద్మీ శివకుమార్, తదితర నేతలు గురువారం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. గత కొంతకాలంగా బీఆర్ఎస్‌కు దూరంగా ఉంటున్న శివకుమార్ నేడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతోపాటు పాటు మరికొంత మంది బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరారు.
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ గడ్డపై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎంపీ అభ్యర్థి కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరితో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. అనంతరం వరంగల్ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం తీసుకోవాల్సిన చర్యలపై నేతలతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు.
నాగిరెడ్డిపేట మండలంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు గురువారం వైస్ ఎంపీపీ పై అవిశ్వాసం నెగ్గడంతో సంబరాలు జరుపుకున్నారు. గత నాలుగు సంవత్సరాలుగా ఇన్‌ఛార్జ్ ఎంపీపీగా కొనసాగిన వైస్ఎంపీపీ దివిటి రాజ్ దాస్ పై బీఆర్ఎస్ ఎంపీటీసీలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఆర్డీవో ప్రభాకర్ సమక్షంలో అవిశ్వాసం నెగ్గడంతో బీఆర్ఎస్ నాయకులు ఆనందంతో మిఠాయిలు పంచుకొని టపాకాయలు పేల్చి సంబరాలు జరుపుకున్నారు.
నారాయణపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జీ శివకుమార్ రెడ్డి తండ్రి, ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణిక రెడ్డి తాత పుల్లారెడ్డి దశదిన కర్మ కార్యక్రమం గురువారం హైదరాబాద్లో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఉమ్మడి పాలమూరు ఎమ్మెల్యేలు హాజరై పుల్లారెడ్డి చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
Sorry, no posts matched your criteria.