Telangana

News August 29, 2024

అనుముల: ముత్యాలమ్మకు బోనాలు

image

నల్గొండ జిల్లా అనుముల మండల పరిధిలోని మారేపల్లి గ్రామంలో ఘనంగా ముత్యాలమ్మకు బోనాలు సమర్పించారు. డప్పు వాయిద్యాల నడుమ, మహిళలు, యువతులు ర్యాలీగా బోనాలు ఎత్తుకొని దేవాలయానికి వెళ్లారు. అమ్మవారికి చీర సారెలు పెట్టి, మేకలను కోసి మొక్కులు చెల్లించుకున్నారు.

News August 29, 2024

ములకలపల్లి: 30న గురుకుల కళాశాలలో స్పాట్ అడ్మిషన్స్

image

ములకలపల్లి గురుకుల బాలికల కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ సునీత బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియట్ ఎంపీసీ, బైపీసీలో ప్రథమ సంవత్సరంలో మిగిలిన సీట్ల భర్తీకి ఈనెల 30వ తేదీన స్పాట్ అడ్మిషన్లు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. అసక్తి గల విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికేట్లతో పాటు, ఆధార్‌కార్డు, కుల ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావాలని తెలిపారు.

News August 29, 2024

మీర్‌పేట్ చెరువులను పరిశీలించిన హైడ్రా కమిషనర్

image

మీర్‌పేట్ కార్పొరేషన్ పరిధిలోని చందనం చెరువు, మంత్రాల చెరువు, పెద్ద చెరువు మూడు చెరువులు కబ్జాకు గురయ్యాయని స్థానికులు ఇచ్చిన పిర్యాదు మేరకు బుధవారం స్థానిక అధికారులతో కలిసి హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెరువులను పరిశీలించారు. ఈ సందర్భంగా చెరువులను ఆక్రమించి ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో నిర్మించిన అక్రమ నిర్మాణాలు ఫంక్షన్ హాల్, షాపింగ్ కాంప్లెక్స్‌లను ఆయన పరిశీలించారు.

News August 29, 2024

మీర్‌పేట్ చెరువులను పరిశీలించిన హైడ్రా కమిషనర్

image

మీర్‌పేట్ కార్పొరేషన్ పరిధిలోని చందనం చెరువు, మంత్రాల చెరువు, పెద్ద చెరువు మూడు చెరువులు కబ్జాకు గురయ్యాయని స్థానికులు ఇచ్చిన పిర్యాదు మేరకు బుధవారం స్థానిక అధికారులతో కలిసి హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెరువులను పరిశీలించారు. ఈ సందర్భంగా చెరువులను ఆక్రమించి ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో నిర్మించిన అక్రమ నిర్మాణాలు ఫంక్షన్ హాల్, షాపింగ్ కాంప్లెక్స్‌లను ఆయన పరిశీలించారు.

News August 29, 2024

సిద్దిపేట: నాణ్యమైన విద్యను అందిద్దాం: డిఐఈఓ

image

ఇంటర్మీడియట్‌లో విద్యా ప్రమాణాలు పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా ఇంటర్ విద్యాధికారి రవీందర్ రెడ్డి సూచించారు. సిద్దిపేట కార్యాలయంలో జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్స్ తో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు నిబద్ధతతో పనిచేసి పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలన్నారు.

News August 29, 2024

వైద్యులు విధులను సక్రమంగా నిర్వర్తించాలి: పెద్దపల్లి కలెక్టర్

image

ప్రభుత్వ వైద్యులు విధులను సక్రమంగా నిర్వర్తించాలని, ప్రభుత్వ విధుల్లో ఉన్న సమయంలో ప్రైవేట్ ఆస్పత్రుల్లో పనిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష పేర్కొన్నారు. పెద్దపల్లి పట్టణంలోని మాతా శిశు సంరక్షణ కేంద్రంను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో రికార్డులను పరిశీలించారు. వైద్యులు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు.

News August 29, 2024

NRPT: ‘సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి’

image

సీజనల్ వ్యాధులపై వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. బుధవారం నారాయణపేట కలెక్టరేట్లో వైద్య సిబ్బందితో సమావేశం నిర్వహించారు. సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. జ్వర పీడితుల రక్త నమూనాలు, పూర్తిస్థాయి సమాచారాన్ని జిల్లా ఆరోగ్యశాఖ కార్యాలయానికి అందించాలని సూచించారు. వైద్య అధికారులు ప్రైవేట్ ఆసుపత్రులను ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలని అన్నారు.

News August 29, 2024

రాష్ట్రంలోనే HYD జిల్లాలో అత్యధిక MSME యూనిట్లు

image

రాష్ట్రంలోనే అత్యధికంగా HYD జిల్లాలో MSME యూనిట్లు ఉన్నాయి. జిల్లాలో 1,68,077 MSMEలు ఉంటే.. ఇందులో 1,33,937 యూనిట్లు సర్వీస్ విభాగంలో ఉన్నాయి. మిగతా 34,140 యూనిట్లు ఉత్పత్తి రంగంలో ఉన్నాయి. ఇందులో సూక్ష్మ సంస్థలు అత్యధికంగా 1,56,642 యూనిట్లు పనిచేస్తున్నాయి. చిన్న తరహావి 9,813, మధ్య తరహావి 1,622 దాకా ఉన్నాయని అధికారులు తెలిపారు.

News August 29, 2024

ఆదిలాబాద్: ఫీవర్ సర్వే పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

image

ఆదిలాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో కలెక్టర్ రాజర్షిషా బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో సౌకర్యాలు, అమ్మా ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారా చేపడుతున్న నిర్మాణ పనులతీరు, పదవతరగతికి సంబంధించి రూపొందించిన క్యాలెండర్ షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలన్నారు. డెంగ్యూ కేసులు నివారణకు ప్రత్యేక దృష్టి సారించాలని, మెప్మా ద్వారా ఫీవర్ సర్వే పకడ్బందీగా నిర్వహించాలన్నారు.

News August 29, 2024

కామారెడ్డి: వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి:కలెక్టర్

image

వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో వినాయక చవితి ఉత్సవాల నిర్వహణపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో గణేష్ ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా సంబంధిత శాఖలు ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్పీ సింధూశర్మ తదితరులు పాల్గొన్నారు.