Telangana

News April 4, 2024

ఓయూను ప్రభుత్వం ఆదుకోవాలి: VC

image

HYD ఉస్మానియా యూనివర్సిటీ 2024-25 వార్షిక బడ్జెట్ రూ.718.86 కోట్లు కాగా అంచనా వ్యయం రూ.796.45 కోట్లు, లోటు బడ్జెట్ రూ.44.68 కోట్లుగా ఉందని వీసీ రవీందర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి బ్లాక్ గ్రాంట్స్ రూపంలో రూ.487.03 కోట్లు కేటాయించినప్పటికీ బడ్జెట్ లోటును పూడ్చడానికి, వర్సిటీలో కార్యకలాపాలు సజావుగా సాగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని అదనపు గ్రాంట్లు అందించి వర్సిటీని ఆదుకోవాలని కోరారు.

News April 4, 2024

ఖమ్మం: ఉన్నతాధికారుల కో-ఆర్డినేషన్ సమావేశం

image

అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లోని ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో రెండు తెలుగు రాష్ట్రాల ఉన్నతాధికారుల కో-ఆర్డినేషన్ సమావేశం గురువారం జరిగింది. ఈ సమావేశానికి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీ రావు, విజయవాడ సీపీ క్రాంతి రాణా టాటా, ఖమ్మం జిల్లా కలెక్టర్ వి.పి గౌతమ్, ఖమ్మం సీపీ సునీల్ దత్, అడిషనల్ కలెక్టర్ మధు సూధన్ నాయక్ రెండు సరిహద్దు రాష్ట్రాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

News April 4, 2024

ఓయూను ప్రభుత్వం ఆదుకోవాలి: VC

image

HYD ఉస్మానియా యూనివర్సిటీ 2024-25 వార్షిక బడ్జెట్ రూ.718.86 కోట్లు కాగా అంచనా వ్యయం రూ.796.45 కోట్లు, లోటు బడ్జెట్ రూ.44.68 కోట్లుగా ఉందని వీసీ రవీందర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి బ్లాక్ గ్రాంట్స్ రూపంలో రూ.487.03 కోట్లు కేటాయించినప్పటికీ బడ్జెట్ లోటును పూడ్చడానికి, వర్సిటీలో కార్యకలాపాలు సజావుగా సాగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని అదనపు గ్రాంట్లు అందించి వర్సిటీని ఆదుకోవాలని కోరారు.

News April 4, 2024

ఫోన్ ట్యాపింగ్ పై డిప్యూటీ సీఎం భట్టి కీలక వ్యాఖ్యలు

image

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం విపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ చేసి పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛను హరించిందని మండిపడ్డారు. మంత్రులు, జడ్జిల ఫోన్లు సైతం ట్యాపింగ్‌కు గురయ్యాయంటే బీఆర్ఎస్ పాలనలో పరిస్థితి ఎలా ఉండేదో అర్ధం చేసుకోవచ్చు అని అన్నారు.

News April 4, 2024

సిద్దిపేట: ఇంట్లోకి వెళ్లి కొట్టి కేసులో ఇద్దరికి జైలు

image

అక్రమంగా ఇంట్లోకి ప్రవేశించి కొట్టిన కేసులో నేరస్థులిద్దరికీ 6 నెలల జైలు శిక్ష, రూ. 2000 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పును వెలువరించారు. రాఘవాపూర్ కు చెందిన గ్యార చంద్రకళ(39)పై గ్యార వెంకటమ్మ, గ్యార శ్రీనివాస్ పాతకక్షలతో 2016, జనవరి 1న దాడి చేయగా దీనిపై చంద్రకళ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై విచారించిన న్యాయమూర్తి నిందితులకు 6 నెలల జైలుశిక్ష, రూ.2వేల జరిమానా విధించారు.

News April 4, 2024

సాలురాలో వాగులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం

image

సాలూరు మండలం ఖాజాపూర్ గ్రామ శివారులోని వాగులో గుర్తుతెలియని వ్యక్తి శవాన్ని గుర్తించినట్లు స్థానికులు తెలిపారు. వారి సమాచారం మేరకు బోధన్ రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. హత్యా లేకా ఆత్మహత్య అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 4, 2024

శంకరపట్నం: జాతీయ రహదారిపై యాక్సిడెంట్.. వ్యక్తి మృతి

image

శంకరపట్నం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మండల పరిధిలోని చింతకుంటకు చెందిన సిరిసిల్ల ఆంజనేయులు, మంద హరీష్ బైకు పై వెళ్తున్నారు. ఈక్రమంలో కేశవపట్నం బస్టాండ్ ఎదురుగా బైకు అదుపుతప్పి పడటంతో కరీంనగర్ నుంచి వరంగల్ వెళ్తున్న RTC బస్సు కిందపడి ఆంజనేయులు అక్కడికక్కడే మృతి చెందాడు. కేశవపట్నం ఎస్సై లక్ష్మారెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News April 4, 2024

చేనేత సహకార సంఘాల ఎన్నికలు ఎప్పుడు..?

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొత్తం 103 చేనేత, జౌళి సంఘాలు ఉన్నాయి. వీటిలో 13 వేల మందికి పైగా సభ్యులు ఉన్నారు. వేలాది కుటుంబాలు చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నాయి. చేనేత పారిశ్రామిక సహకార సంఘాల పాలకవర్గాలకు చివరిసారిగా 2013 ఫిబ్రవరి 11న ఎన్నికలు నిర్వహించారు. పాలకవర్గాల పదవీకాలం గడువు 2018 ఫిబ్రవరి 10 నాటికి ముగిసింది. అప్పటినుండి ఎన్నికలను వాయిదా వేస్తూ వస్తున్నారు.

News April 4, 2024

HYD‌లో నల్లాలకు మోటార్లు బిగిస్తే చర్యలు

image

GHMC పరిధి యూసఫ్‌గూడ, ఎర్రగడ్డ, మూసాపేట, మాదాపూర్, మల్కాజిగిరి, అంబర్‌పేట, రాంనగర్, మారేడుపల్లి, అడ్డగుట్ట, ఉప్పల్, లంగర్‌హౌస్, మెహిదీపట్నం ప్రాంతాలలో పెద్ద ఎత్తున మోటార్లు బిగించి నీటిని తోడేస్తున్నారు. ఈ కారణంగా లో ప్రెషర్ సమస్యలు ఏర్పడుతున్నాయని వాటర్ బోర్డుకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇలా చేసేవారిపై చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు.

error: Content is protected !!