India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గత రెండు రోజులుగా మధ్యాహ్నం 11 నుంచి సాయంత్రం 3గంటల వరకు ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. గత రెండు రోజులుగా 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కాగా, అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.
బెల్లంపల్లి మండలం పాత బెల్లంపల్లి గ్రామానికి చెందిన యువకుడు రాజుకు లండన్‌కు చెందిన యువతి డయానకు గురువారం బెల్లంపల్లిలో వివాహమైంది. వ్యాపార రీత్యా రాజు మూడేళ్ల క్రితం లండన్ వెళ్ళాడు. అక్కడే డయానతో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. ఈ క్రమంలో వారిద్దరు ఒకటై హిందూ సంప్రదాయం ప్రకారం బెల్లంపల్లిలో జరిగింది.
పాల్వంచ మండలంలోని దంతేలబోర్ర గ్రామ మాజీ సర్పంచ్ గద్దల రమేష్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాదిగ జేఏసీ అధ్యక్షులుగా నియమితులయ్యారు. దీనికి సంబంధించిన నియామక పత్రాలను మాదిగ జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ పిడమర్తి రవి చేతుల మీదగా గద్దల రమేష్ అందుకున్నారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ.. మాదిగల పక్షాన ప్రశ్నించే ప్రజా గొంతుకనై మాదిగ జాతి కోసం పోరాడుతానని పేర్కొన్నారు.
భద్రాచలం రామాలయంలో ఈనెల 9నుంచి 23వరకు శ్రీరామనవమి కల్యాణ బ్రహ్మోత్సవాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టినట్లు ఈవో రమాదేవి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఉత్సవాలను పురస్కరించుకుని ఈనెల 9నుంచి నిత్య కల్యాణాలను నిలిపివేస్తున్నట్లు తెలిపారు. 24నుంచి తిరిగి నిత్య కళ్యాణాలు ఉంటాయన్నారు. 9న ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణ కార్యక్రమం ఉంటుందని వెల్లడించారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గురువారం ఈ క్రింది విధంగా నమోదయ్యాయి. అత్యధిక ఉష్ణోగ్రత ధరూర్‌లో 43.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. వనపర్తి జిల్లా పెబ్బేరులో 43.3, నాగర్ కర్నూలు జిల్లా సిరిసనగండ్ల 42.1, మహబూబ్నగర్ జిల్లా సల్కార్ పేటలో 41.7, నారాయణపేట జిల్లా ఉట్కూర్ లో 41.4 డిగ్రీలు గా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండల తీవ్రత పెరగడంతో అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు.
వీర్నపల్లి మండలం కంచర్ల గ్రామానికి చెందిన ఓ విద్యార్థి ఈతకు వెళ్లి మృత్యువాత పడ్డాడు. కుటుంబీకుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఆలకుంట హరికృష్ణ(16) వీర్నపల్లి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నాడు. గురువారం సరదాగా అల్మాస్‌పూర్ గ్రామ శివారులో ఉన్న రంగ చెరువులో ఈత కొడుతూ ప్రమాదవశాత్తు మునిగి మృతి చెందాడు.
ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్ మళ్లీ తెరపైకి వచ్చింది. ఫోన్ టాపింగ్ వ్యవహారంలో విచారణ జరుపుతున్న పోలీస్ అధికారులకు అనేక కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. అచ్చంపేట, కొల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన అప్పటి ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, హర్షవర్ధన్ రెడ్డిలతో BJP నాయకులు ఫోన్‌లో సంప్రదించి బేరసారాలకు పాల్పడిన అంశం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. గత ఏడాది MLAల కొనుగోలు కేసు సంచనం రేపిన విషయం తెలిసిందే.
తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TSSET) మెంబర్ సెక్రటరీగా ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ నరేశ్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ రవీందర్ నియామక పత్రం అందజేశారు. 2023లో టీఎస్ సెట్ ప్రవేశపరీక్ష నిర్వహించి పరీక్షా ఫలితాలు విడుదల చేశారు. అయితే 2024లో మళ్లీ టీఎస్ సెట్ ప్రవేశ పరీక్షకు ప్రకటన రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మెంబర్ సెక్రటరీని నియమించారు.
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు దాటాయి. ఈ క్రమంలో నల్గొండ జిల్లా అత్యధికంగా నిడమనూరులో 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 వరకు ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని, ఈ సమయాల్లో పిల్లలు, వృద్ధులు బయటకు రావొద్దని వాతావరణశాఖ అధికారులు సూచిస్తున్నారు.
తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TSSET) మెంబర్ సెక్రటరీగా ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ నరేశ్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ రవీందర్ నియామక పత్రం అందజేశారు. 2023లో టీఎస్ సెట్ ప్రవేశపరీక్ష నిర్వహించి పరీక్షా ఫలితాలు విడుదల చేశారు. అయితే 2024లో మళ్లీ టీఎస్ సెట్ ప్రవేశ పరీక్షకు ప్రకటన రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మెంబర్ సెక్రటరీని నియమించారు.
Sorry, no posts matched your criteria.