Telangana

News April 4, 2024

వరంగల్ మార్కెట్‌కు మళ్లీ వరుస సెలవులు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు మళ్లీ 3రోజులు వరుస సెలవులు రానున్నాయి. శుక్రవారం బాబు జగ్జీవన్ రావు జయంతి, శని, ఆదివారాలు వారాంతపు సెలవుల నేపథ్యంలో మార్కెట్ బంద్ ఉండనుంది. కావున రైతులు విషయాన్ని గమనించి ఈ మూడు రోజులు మార్కెట్‌కు సరుకులు తీసుకొని రావద్దని, సహకరించాలని అధికారులు కోరారు.

News April 4, 2024

జనగామ: ఉచిత శిక్షణకు దరఖాస్తులు

image

తెలంగాణ రాష్ట్ర స్టడీ సర్కిల్ మైనార్టీల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మైనార్టీ
అభ్యర్ధులకు ‘యూపీఎస్సి సీ-శ్యాటు’ ఉచిత శిక్షణకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి బి.రవీందర్ తెలిపారు. ఈ శిక్షణకు డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈనెల 12గా www.tmreistelangana.cgg.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని అన్నారు.

News April 4, 2024

బీఆర్‌ఎస్‌, బీజేపీపై మంత్రి జూపల్లి తీవ్ర వ్యాఖ్యలు

image

పార్లమెంట్‌ ఎన్నికల తరువాత బీఆర్‌ఎస్‌ భూస్థాపితం అవుతుందని మంత్రి జూపల్లి కృష్ణారావు వ్యాఖ్యానించారు. నేడు నాగర్ కర్నూల్ పార్లమెంట్‌ నియోజకవర్గ ముఖ్యకార్యకర్తల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మల్లు రవి పదవుల కోసం ఏనాడూ పార్టీ మారలేదన్నారు. బీజేపీ తరఫున పోటీ చేస్తున్న భరత్‌ పదవుల కోసం పార్టీ మారారని, బీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేస్తున్న ప్రవీణ్‌కుమార్‌ గత 10ఏళ్లు నాటకం ఆడారని జూపల్లి పేర్కొన్నారు.

News April 4, 2024

MBNR: మెరుగుపడనున్న తాగునీటి సమస్య !

image

అమృత్ -2 పథకంలో భాగంగా MBNR జిల్లా పరిధిలోని 3 మున్సిపాలిటీలకు రూ.341,25కోట్లు, గద్వాల జిల్లాలో 3 మున్సిపాలిటీలకు రూ.89,46కోట్లు మంజూరయ్యాయి. వనపర్తి జిల్లాలోని 5 మున్సిపాలిటీలకు గాను రూ.128.29 కోట్లు, NRPT జిల్లాలోని 3 మున్సిపాలిటీలకు రూ.55.57 కోట్లు, NGKL జిల్లాలోని 2 మున్సిపాలిటీలకు రూ.59.73 కోట్ల నిదులు విడుదలయ్యాయి. ఈ నిధులతో 15 మున్సిపాలిటీల్లో పనులు ప్రారంభం కానున్నాయి.

News April 4, 2024

ASF: ఆ మండలంలో 144 సెక్షన్.. కారణమిదే..!

image

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలంలో జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే ఆదేశాల మేరకు 144 సెక్షన్ అమలు చేస్తూ తహశీల్దార్N. భూమేశ్వర్ ఉత్తర్వులు జారీ చేశారు. అధికారులు మాట్లాడుతూ.. మండలంలో ఏనుగు దాడిలో ఇద్దరు రైతులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా 144 సెక్షన్ అమలుకు నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

News April 4, 2024

నాగిరెడ్డిపేట్ వైస్ ఎంపీపీపై నెగ్గిన అవిశ్వాసం

image

నాగిరెడ్డిపేట్ ఇన్‌ఛార్జ్ MPP, వైస్ ఎంపీపీ దివిటి రాజ్ దాస్‌పై BRS పార్టీకి చెందిన ఆరుగురు ఎంపీటీసీలు పెట్టిన అవిశ్వాసం నెగ్గింది. MPP ఆఫీస్‌లో RDO ప్రభాకర్ సమక్షంలో గురువారం అవిశ్వాస తీర్మానంపై బలనిరూపణ జరిగింది. 9 మంది ఎంపీటీసీ సభ్యుల్లో ఆరుగురు ఆయనకు వ్యతిరేఖంగా ఓటు వేశారు.

News April 4, 2024

మెదక్ జిల్లాలో ముదురుతున్న ఎండలు

image

మెదక్ జిల్లాలో రెండు మూడు రోజులుగా భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గురువారం గరిష్టంగా 40° డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవ్వడంతో జిల్లా కేంద్రంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా పగటి పూట రహదారులు అన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు ఎవరు కూడా పగటి పూట బయటకు రాకూడదు అని ఏదైనా పని ఉంటే ఉదయం సాయంత్రం చూసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

News April 4, 2024

మెదక్: రైతు కేంద్రంగా రాజకీయం..!

image

ఎన్నికల్లో రైతులను ఆకర్షించే పనిలో అన్ని పార్టీలు నిమగ్నమయ్యాయి. రైతులను ప్రసన్నం చేసుకుంటేనే సీటు గెలుస్తామని ప్రధాన పార్టీలు భావిస్తున్నాయి. మెదక్‌లో రైతు కేంద్రంగా విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటూ ప్రచారం సాగిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కీలకమైన రైతులు, వ్యవసాయ కూలీలను పార్టీలు టార్గెట్‌గా చేసుకొని ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం కరువుకు కారణం మీరంటే మీరేనని దుమ్మెత్తి పోసుకుంటున్నారు.

News April 4, 2024

నల్గొండ: నెరవేరనున్న రైలు మార్గం కల 

image

దేవరకొండ నియోజకవర్గం మీదుగా డోర్నకల్, గద్వాల రైలు మార్గం కోసం అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఇప్పటికే ఈ మార్గంలో సర్వే నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించడంతో అధికారులు సర్వే చేస్తున్నారు. ఈ క్రమంలో చింతపల్లి మండల సమీపంలో ల్యాండ్ మార్క్ వేశారు. కాగా ఎన్నో ఏళ్లుగా రైలు కూత కోసం ఎదురు చూస్తున్న ఈ ప్రాంత ప్రజల కల నెరవేరనుంది.

News April 4, 2024

NLG: గుండెపోటుతో వ్యాయామ అధ్యాపకుడి మృతి

image

నల్గొండ ప్రభుత్వ డైట్ కళాశాల వ్యాయామ అధ్యాపకుడు గాదే శౌర్య రెడ్డి ఈరోజు వారి నివాసంలో గుండెపోటుతో మరణించారు. ఎంతోమందిని వ్యాయామ ఉపాధ్యాయులుగా తీర్చిదిద్ది, సమాజానికి కృషి చేసిన వ్యక్తి మరణించడం బాధాకరమని డైట్ కళాశాల ప్రిన్సిపల్ నరసింహ తెలిపారు. వారి అంత్యక్రియలు మఠంపల్లిలో నేడు జరగనున్నాయి.

error: Content is protected !!