Telangana

News April 4, 2024

MBNR: దంచి కొడుతున్న ఎండలు

image

పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఉమ్మడి జిల్లాలోనే MBNR, GDWL, జిల్లాల్లో 42.03 డిగ్రీలు అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న 45 రోజులలో 40 నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని సంబంధితశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఆయా జిల్లాల కలెక్టర్లు అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. 

News April 4, 2024

ఆదిలాబాద్: 3.55 లక్షల మందికి జీరో బిల్

image

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాల్లో గృహజ్యోతి పతకానికి సంబంధించిన అర్హులకు మొదటి నెల జీరో బిల్లులను జారీ చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మొత్తంలో 8.14 విద్యుత్ కనెక్షన్లు ఉండగా.. 3.55 లక్షల మంది 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించినట్లు గుర్తించారు. దీంతో మార్చి నెలలో 3.45 లక్షల మందికి రూ.9.38 కోట్ల రాయితీతో జీరో బిల్లులను అందించారు.

News April 4, 2024

చౌటుప్పల్: బైక్ స్కిడ్.. వ్యక్తి మృతి

image

బైక్ స్కిడ్ అయి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన చౌటుప్పల్ మండలం లక్కారం గ్రామంలో జరిగింది. తలకు బలమైన గాయాలు కావడంతో వద్ధుడు అక్కడికక్కడే మృతిచెందాదు.
ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News April 4, 2024

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు 5 రోజులు సెలవు

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు రేపటి నుంచి ఐదు రోజులు సెలవు ఉన్నట్లు మార్కెట్ శాఖ కార్యదర్శి గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. శుక్రవారం బాబు జగ్జీవన్ రావ్ జయంతి, శనివారం వారంతపు సెలవు, ఆదివారం సాధారణ సెలవు, 8న అమావాస్య, 9న ఉగాది పర్వదినం ఉన్న నేపథ్యంలో సెలవులు ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. తిరిగి బుధవారం పదో తారీఖున మార్కెట్ ప్రారంభం అవుతుందని చెప్పారు.

News April 4, 2024

సంగారెడ్డి: మరో కార్మికుడి మృతదేహం లభ్యం

image

ఎస్‌బీ ఆర్గానిక్ పరిశ్రమలో బుధవారం జరిగిన ప్రమాదంలో ఐదుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. గురువారం ఓ కార్మికుడి మృతదేహం ఘటన స్థలంలో లభ్యమైంది. మృతుడు కొన్యాలకి చెందిన వడ్డే రమేశ్‌గా పోలీసులు గుర్తించారు. చికిత్స పొందుతున్న కార్మికులను మాజీ మంత్రి హరీష్‌రావు, మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్లతో కలిసి పరామర్శించారు.

News April 4, 2024

జగిత్యాల: గుండెపోటుతో ఉపాధ్యాయుడి మృతి

image

జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం  ప్రాథమిక పాఠశాల SGT ఉపాధ్యాయుడు లింగంపల్లి చంద్రయ్య బుధవారం సాయంత్రం గుండెపోటుతో మరణించారు. ఈరోజు ఆయన స్వగ్రామం వెల్గటూర్ మండలం గుల్లకోటలో అంత్యక్రియలు జరుగుతాయని ఉపాధ్యాయ వర్గాలు తెలిపాయి. లింగయ్య DTF ఉపాధ్యాయ సంఘం మండల అధ్యక్షుడిగా సేవలందిస్తున్నారు. 

News April 4, 2024

NLG: ఫేక్ సర్టిఫికెట్స్‌తో ప్రభుత్వ ఉద్యోగాలు

image

దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలో నకిలీ ధ్రువపత్రాలు కలకలం రేపుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో పనిచేస్తున్న సుమారు 1,200 మంది ఆర్టిజన్ ఉద్యోగులలో కొంత మంది నకిలీ ధ్రువపత్రాలతో విధులు నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అందులో కొంతమంది విద్యార్హత లేకుండా నకిలీ ధ్రువపత్రాలతో ఏడేళ్లుగా విధులు నిర్వహిస్తూ బురిడీ కొట్టించారు. 11 మంది ఆర్టిజన్ ఉద్యోగుల ధ్రువీకరణ పత్రాలు నకిలీవిగా తేల్చారు.

News April 4, 2024

ఖమ్మంలో భారీగా పెరిగిన మిర్చి ధర

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పంటల ధరల వివరాలను మార్కెట్ శాఖ అధికారులు గురువారం ఉదయం వెల్లడించారు. మిర్చి జెండా పాట క్వింటా రూ.20,000 ధర పలకగా పత్తి జెండా పాట క్వింటా రూ.7300 పలికినట్లు వెల్లడించారు. పత్తి ధర నిన్నటి కంటే 100 రూపాయలు తగ్గగా మిర్చి ధర 1,300 పెరిగింది.

News April 4, 2024

ఎల్లారెడ్డిపేటలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు

image

ఎల్లారెడ్డిపేటలో SI రమాకాంత్ తన సిబ్బందితో బుధవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ నిర్వహించడం కలకలం రేపింది. అయితే సినిమా టాకీస్ ప్రాంతంలో గత కొంత కాలంగా కొందరు వ్యక్తులు వ్యభిచారం నిర్వహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. యువతులతో వ్యభిచారం చేయిస్తున్నట్లు సమాచారం మేరకు తనిఖీలు చేశారు. ఎస్ఐ మాట్లాడుతూ.. అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయనే సమాచారంతో సోదాలు చేసినట్లు తెలిపారు. ఎలాంటి ఆధారాలు లభ్యంకాలేదన్నారు.

News April 4, 2024

నల్గొండ: వాటర్ ట్యాంకులో కోతుల మృతి.. KTR ట్వీట్

image

నందికొండలో వాటర్ ట్యాంక్‌లో వానరాల కళేబరాల మృతి ఘటనపై కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇది మున్సిపల్ శాఖ సిగ్గుపడాల్సిన పరిస్థతి అన్నారు. తాగునీటి ట్యాంకుల శుభ్రత, నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తోందన్నారు. ఈ ప్రభుత్వం ప్రజారోగ్యం కంటే రాజకీయాలకే ఎక్కువ ప్రాధాన్యమిస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో ప్రజా పాలన అస్తవ్యస్తమైందని మండిపడ్డారు.

error: Content is protected !!