Telangana

News April 4, 2024

పాలమూరు యూనివర్సిటీ డిగ్రీ పరీక్ష ఫీజు చెల్లించాలి

image

మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా పాలమూరు యూనివర్సిటీ పరిధిలో 2021-2022 విద్య సంవత్సరంలో డిగ్రీ బ్యాచ్ విద్యార్థులు 5వ సెమిస్టర్ బ్యాక్ లాగ్ సబ్జెక్ట్‌ల పరీక్షల ఫీజును చెల్లించాలని యూనివర్సిటీ అధికారులు కోరారు. ఏప్రిల్ 16 వరకు విద్యార్థులు సంబందించిన కళాశాలలో పరీక్ష ఫీజు చెల్లించాలని తెలిపారు. 200 రూపాయలు ఫైన్‌తో ఏప్రిల్ 20 వరకు ఫీజు చెల్లించవచ్చని తెలిపారు.

News April 4, 2024

మెదక్: పౌరుల చేతిలో బ్రహ్మాస్త్రంగా ‘సీ– విజిల్‌’

image

ఎన్నికల్లో జరిగే అక్రమాలు, ఉల్లంఘనలపై ఫిర్యాదు చేసేందుకు ఎన్నికల సంఘం రూపొందించిన సీ–విజిల్‌ యాప్‌ పౌరుల చేతిలో బ్రహ్మాస్త్రంగా ఉపయోగపడనుంది. లోక్‌సభ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చింది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారు కావడంతో ప్రచారాన్ని మొదలు పెట్టారు. ఉల్లంఘనలపై చర్యలు తీసుకునేందుకు మెదక్‌ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ కేంద్రంగా దీన్ని నిర్వహిస్తున్నారు.

News April 4, 2024

MBNR: అనధికారికంగా విద్యార్థులను చేర్చుకుంటే చర్యలు

image

ప్రైవేటు జూనియర్ కాలేజీలు అనధికారికంగా విద్యార్థులను చేర్చుకుంటే చర్యలు తీసుకుంటామని ఇంటర్ బోర్డు కార్యదర్శి శ్రుతి ఓజా తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం అకడమిక్ క్యాలెండర్‌ను ఇంటర్ బోర్డు విడుదల చేయలేదని, అనుబంధ గుర్తింపు ఇవ్వలేదని స్పష్టం చేశారు. అకడమిక్ క్యాలెండర్ ను అధికారిక వెబ్సైట్ (tsbie.cgg.gov.in)లో అందుబాటులో ఉంచుతామని తెలిపారు. గుర్తింపు ఉన్న కాలేజీల్లోనే విద్యార్థులు చేరాలని అన్నారు.

News April 4, 2024

NLG: టెన్త్ మూల్యాంకనం షురూ.. వారికి షోకాజ్ నోటీస్

image

పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం బుధవారం ప్రారంభమైంది. NLGలోని లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో ఈ ప్రక్రియ చేపట్టారు. మూల్యాంకనం కోసం 92 మంది చీఫ్ ఎగ్జామినర్లను నియమించగా.. 72 మంది రిపోర్టు చేశారు. 551 మంది అసిస్టెంట్ ఎగ్జామినర్లకు గాను 452 మంది, 184 మంది స్పెషల్ అసిస్టెంట్లకు గాను 142 మంది రిపోర్టు చేసి మూల్యాంకనంలో పాల్గొన్నారు. మూల్యాంకనానికి హాజరు కాని వారికి డీఈఓ షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

News April 4, 2024

KMM: ఏసీబీకి చిక్కిన వాణిజ్య అధికారి

image

కల్లూరులో తిరువూరు క్రాస్ రోడ్డు వద్ద ఉన్న బార్డర్ చెక్ పోస్ట్ వద్ద ఏసీబీ అధికారులు రైడ్స్ చేశారు. వాణిజ్యశాఖ అధికారి ఏసీటీవో -1 శ్రీరామ్‌తో పాటు మరికొంత మంది సిబ్బంది కలిసి వాహనదారుల నుంచి అక్రమంగా నగదు వసూలు చేస్తున్న సమయంలో రెడ్ హ్యాండెడ్‌‌గా పట్టుకున్నారు. వారి వద్ద అనధికారికంగా రూ.10వేల నగదు ఉందని, ప్రస్తుతం ఎంక్వయిరీ చేస్తున్నామని ఏసీబీ అధికారులు వెల్లడించారు.

News April 4, 2024

చౌటుప్పల్ వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం

image

చౌటుప్పల్‌లో జాతీయ రహదారిపై హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీని ఓ కారు వేగంగా వెనుక నుంచి ఢీ కొట్టింది. కారులో ప్రయాణిస్తున్న బొజ్జ సామ్రాజ్యం(60) అనే మహిళా అక్కడికక్కడే మృతి చెందారు. సురేష్ అనే వ్యక్తికి గాయాలయ్యాయి. మృతురాలిది ప్రకాశం జిల్లా కామినేని వారి పాలెంగా గుర్తించారు.

News April 4, 2024

MNCL: మైనర్ బాలికను పెళ్లి చేసుకున్న వ్యక్తి అరెస్ట్

image

మైనర్‌ బాలికను కిడ్నాప్ చేసిన నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు MNCL CI బన్సీలాల్ తెలిపారు. మార్చి 28న 10th పరీక్షలు రాస్తుండగా బాలిక కనిపించడం లేదని ఆమె తల్లి సంతారు ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టిన పోలీసులు శ్రీకాంత్(27)అనే వ్యక్తి ఆమెను బలవంతంగా వేములవాడకు తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నట్లు తెలిపారు. అక్కడ నుంచి తిరుపతికి తీసుకెళ్తుండగా ఆమె తప్పించుకొని వచ్చినట్లు వెల్లడించారు.

News April 4, 2024

ఖమ్మం: పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని యువకుడి మృతి

image

పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని ఓ యువకుడు మృతిచెందాడు. ఖమ్మం జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. బోనకల్‌కి చెందిన బండి సురేష్ అనే యువకుడు బుధవారం రాత్రి రైలు పట్టాలు దాటుతుండగా ట్రైన్ అతణ్ని ఢీకొట్టింది. దీంతో సురేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. సురేశ్ మృతితో బోనకల్‌లో విషాదం అలుముకుంది. 

News April 4, 2024

వరంగల్: వదినతో మరిది కాపురం

image

వదినును తల్లిని చేసి వదిలేసిన దుర్మార్గపు ఘటన ఇది. నల్లబెల్లి చిన్నతండాకు చెందిన రాజుకు చెన్నరావుపేట(M)కు చెందిన మమతతో 2017లో పెళ్లైంది. రాజుకు పిల్లలు పుట్టే అవకాశం లేకపోవడంతో మరిది శ్రీనుతో పిల్లలు కంటే ఆస్తి మనదేనని అత్తామామలు నమ్మబలికారు. ఈక్రమంలో శ్రీను, మమతకు ఇద్దరు పిల్లలు పుట్టారు. తర్వాత మమతతో గొడవపడి పుట్టింటికి పంపేశారు. శ్రీను వేరే పెళ్లికి రెడీ కావడంతో మమత పోలీసులను ఆశ్రయించింది.

News April 4, 2024

HYD: డ్రంక్‌ అండ్ డ్రైవ్, వితౌట్‌ హెల్‌మెట్.. నోజాబ్!

image

చిన్న చిన్న కేసులు ఉన్నాయని తమను పోలీసు ఉద్యోగాలకు దూరం చేయొద్దంటూ పలువురు కానిస్టేబుల్‌ అభ్యర్థులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 2022 కానిస్టేబుల్‌ రిక్రూట్‌మెంట్‌కు చెందిన పలువురు అభ్యర్థులు బుధవారం వనస్థలిపురం పనామా చౌరస్తా వద్ద నిరసన చేపట్టారు. 1500 మందిపై డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు, వితౌట్‌ హెల్‌మెట్, తదితర కేసులు ఉన్నాయని నియామకపత్రాలు ఇవ్వలేదని వాపోయారు.‌ న్యాయం చేయాలని వేడుకొన్నారు. 

error: Content is protected !!