India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సత్తుపల్లి అమ్మాయి స్పెయిన్ అబ్బాయి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వివరాలిలా.. సత్తుపల్లికి చెందిన లావణ్య నాలుగేళ్లుగా స్పెయిన్ బార్సిలోనాలో ఓ కంపెనీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ రంగంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తోంది. ఆమెకు అదే కంపెనీ ఉద్యోగి అయిన స్పెయిన్‌కి చెందిన మార్క్ మన్సిల్లాతో మూడేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారి బుధవారం పెళ్లి చేసుకున్నారు.
పెళ్ళైన మూడు రోజులకే <<12979867>>వివాహిత ఆత్మహత్య<<>> చేసుకున్న విషయం తెలిసిందే. ఘటనపై ఎస్ఐ రామ్ లాల్ వివరాలు.. యువతి(20)కి తల్లిదండ్రులు మార్చి నెలలో ఇష్టం లేని పెళ్లి చేశారు. పెళ్లైన మూడో రోజున తన ప్రియుడు ఆమెను కలిశాడు. మార్చి 16న ఆమె పురుగు మందు తాగి చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆమె ఆత్మహత్యకు ప్రియుడే కారణమని మృతురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చెయ్యగా నిందితుడిని మంగళవారం రిమాండుకు తరలించారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన యువతిపై అత్యాచారం చేసిన ఘటనపై బుధవారం సుబేదారి పోలీసులు కేసు నమోదు చేశారు. KNRకు చెందిన నర్సింగ్ విద్యార్థిని WGL ప్రభుత్వ సంస్థలో శిక్షణ పొందుతోంది. ఇటీవల కామారెడ్డికి చెందిన సతీశ్‌తో ఇన్‌స్టాలో పరిచయం ఏర్పడింది. ఈక్రమంలో సతీశ్ ఆమెను కామారెడ్డికి రావాలని కోరగా.. రెండ్రోజుల కిందట వెళ్లింది. ఆమెకు మాయమాటలు చెప్పి అత్యాచారం చేశాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
జిల్లాలో నిన్న ఓ వ్యక్తిపై ఏనుగు దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటన మరవకముందే జిల్లాలోని పెంచికల్పేట్ మండలం కొండపల్లి గ్రామానికి చెందిన ఓ రైతుపై ఏనుగు దాడి జరిగింది. కారు పోచన్న అనే రైతు ఈరోజు ఉదయం పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్లాడు. ఈ క్రమంలో పంట పొలం వద్ద ఏనుగు ఒక్కసారిగా దాడి చేయడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.
కేతేపల్లి మండలం ఇనుపాముల స్టేజి వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందగా, నలుగురికి గాయాలయ్యాయి. ఎస్సై శివతేజ తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట నుంచి హైదరాబాద్‌కు వెళుతున్న ట్రాలీ ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (ఎస్) మండలం ఇస్తాలపురం గ్రామానికి చెందిన అమనగంటి ఎల్లమ్మ మృతిచెందగా, ఆనంతమ్మ , భారతమ్మ, పూలమ్మ, ఎల్లయ్య గాయపడ్డారు.
ఖమ్మం ఆర్టీసీ రీజియన్‌లోని ఖమ్మం, మధిర, సత్తుపల్లి, కొత్తగూడెం, భద్రాచలం, మణుగూరు, ఇల్లెందు డిపోల పరిధిలో 20వేల భద్రాద్రి ముత్యాల తలంబ్రాల ప్యాకెట్ల బుకింగ్ లక్ష్యంగా ఆర్టీసీ కార్గో అధికారులు కసరత్తు చేపట్టారు. రీజియన్‌లో గత ఏడాది 5,757 ప్యాకెట్లు బుక్ చేయగా.. రూ.6.67 లక్షలు ఆదాయం సంస్థకు లభించింది. ఈ ఏడాది అంతకు నాలుగు రెట్ల లక్ష్యాన్ని అధికంగా నిర్ణయించుకున్న అధికారులు ఏర్పాట్లు చేసుకున్నారు.
✓ పలు శాఖలపై ఉమ్మడి ఖమ్మం జిల్లా కలెక్టర్లు సమీక్షా సమావేశం
✓అశ్వరావుపేటలో బిఆర్ఎస్ కార్యకర్తల సమావేశం
✓పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు
✓దుమ్ముగూడెం మండలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
✓ఖమ్మం జిల్లాలో పొంగులేటి ప్రసాద్ రెడ్డి పర్యటన
✓సత్తుపల్లి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పర్యటన
ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన యువతిపై అత్యాచారం చేసిన ఘటనపై బుధవారం సుబేదారి పోలీసులు కేసు నమోదు చేశారు. KNRకు చెందిన నర్సింగ్ విద్యార్థిని WGL ప్రభుత్వ సంస్థలో శిక్షణ పొందుతోంది. ఇటీవల కామారెడ్డికి చెందిన సతీశ్‌తో ఇన్‌స్టాలో పరిచయం ఏర్పడింది. ఈక్రమంలో సతీశ్ ఆమెను కామారెడ్డికి రావాలని కోరగా.. రెండ్రోజుల కిందట వెళ్లింది. ఆమెకు మాయమాటలు చెప్పి అత్యాచారం చేశాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
టెన్త్ జవాబు పత్రాల స్పాట్ వాల్యుయేషన్ బుధవారం నుంచి జిల్లా కేంద్రంలోని సెయింట్ జోసఫ్ ఉన్నత పాఠశాలలో బుధవారం ప్రారంభమైంది. కాగా డ్యూటీ ఆర్డర్లు తీసుకున్న వారిలో తొలిరోజు సమాచారం ఇవ్వకుండానే 185 మందికి పైగా విధులకు గైర్హాజరయ్యారు. డీఈవో సోమశేఖర శర్మ వారికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి మినహాయింపు ఇచ్చారు.
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం పందికుంట పల్లెకు చెందిన కటకం సురేందర్, శ్రీలంకకు చెందిన జానుశిఖ బుధవారం కరీంనగర్‌లో ప్రేమ వివాహం చేసుకున్నారు. సురేందర్ 2018లో ఇంగ్లండులోని లండన్ వెళ్లి ఉద్యోగం చేస్తున్నాడు. అక్కడ శ్రీలంకకు చెందిన సహ ఉద్యోగిని జానుశిఖతో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. దీంతో వారి ఇరు కుటుంబాలు ఒప్పుకోవడంతో బుధవారం KNRలో వివాహం జరిపించారు.
Sorry, no posts matched your criteria.