India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తాగునీటిని పర్యవేక్షించేందుకు ఐఏఎస్‌లను ప్రత్యేక అధికారిగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతి కుమారి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలకు ప్రశాంత్ జీవన్‌పాటిల్ మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలకు కృష్ణ ఆదిత్యను తాగునీటిని పర్యవేక్షణ ప్రత్యేక అధికారులుగా నియమించారు.
సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహజన్ అన్నారు. సైబర్ నేరాల కట్టడికి జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో ప్రత్యేక శిక్షణ పొంది సైబర్ వారియర్స్‌గా నియమితులైన సిబ్బందికి బుధవారం ఆయన ఫోన్లు, సిమ్ కార్డులు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిరిసిల్ల జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్‌కు ఒక సైబర్ వారియర్‌ను నియమించినట్టు ఆయన పేర్కొన్నారు.
మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లో బాగంగా ప్రభుత్వ భవనాలు, స్థలాలలో రాజకీయ కార్యకలాపాలు నిర్వహించరాదని
జిల్లా ఎస్పి చందనా దీప్తి ఆదేశించారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం రాజకీయ పార్టీల నాయకులు ప్రభుత్వ అతిథి గృహాలు, విశ్రాంతి గృహాలు, ప్రభుత్వ రంగ సంస్థల అతిథి గృహాలలో ఉంటూ ఏటువంటి రాజకీయ కార్యకలాపాలు నిర్వహించకూడదని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్నారు.
బీజేపీ మిర్యాలగూడ అసెంబ్లీ కన్వీనర్ పదవికి బానోతు రతన్ సింగ్ బుధవారం రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి పంపించినట్లు తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా నియోజకవర్గం నుంచి పోటీ చేసిన అభ్యర్థి ప్రభారీ పని తీరు వల్ల నష్టపోయామని, పార్లమెంట్ ఎన్నికలలో నష్టం జరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.
KMM , SRPT జిల్లాలకు మిషన్ భగీరథ తాగునీటి సరఫరాకై నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఎడమకాల్వ ద్వారా తాగునీటిని విడుదల చేయగా జిల్లా కలెక్టర్ హరిచందన బుధవారం వేములపల్లి వద్ద నీటి సరఫరాను పరిశీలించారు. సాగర్ ప్రాజెక్టు పర్యవేక్షక ఇంజనీరు నాగేశ్వరరావును.. నీటి సరఫరా వివరాలను ఆమె అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పూర్ణచందర్ తదితరులు పాల్గొన్నారు.
HYD మెట్రో సూపర్ సేవర్ హాలిడే కార్డును తీసుకొచ్చి సెలవు దినాల్లో కేవలం రూ.59 రీఛార్జ్ ద్వారా అన్ లిమిటెడ్ ప్రయాణం చేయవచ్చని తెలిపింది. అయితే ఇటీవల కొందరు కార్డు కోసం వెళ్లగా ప్రయాణికులకు మెట్రో BIG షాక్ ఇచ్చింది. మెట్రో ప్రవేశపెట్టిన సూపర్ సేవర్ హాలిడే కార్డు, సూపర్ ఆఫ్ పీక్ హవర్ కార్డు సేవలు 2024 మార్చి 31 నాటికి ముగిశాయని తెలిపింది. ఆఫర్లు వర్తించవని తేల్చి చెప్పింది.

వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో BRS టికెట్ కోసం ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. పార్టీలోని ద్వితీయశ్రేణి నేతలు, ఉద్యమకారులు ఈ టికెట్ కోసం ప్రయత్నాలు షురూ చేశారు. ఇప్పటికే పలువురు నేతలు క్షేత్ర స్థాయిలో పార్టీ ముఖ్య నేతలను కలుస్తూ వారికి వినతి పత్రాలు ఇచ్చారు. టికెట్ కోసం మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం.
లాంగ్ డ్రైవ్‌లో అద్దెకు కార్లు తీసుకొని వాటిని అమ్ముతున్న ముఠాను HYD మాదాపూర్ పోలీసులు ఈరోజు అరెస్ట్ చేశారు. మాదాపూర్ ఏసీపీ మాట్లాడుతూ.. ఆదిలాబాద్‌లో ఉంటున్న హరీశ్ కుందారపు అనే వ్యక్తికి, సదరు వ్యక్తులు కార్లు ఇవ్వడంతో వీరికి కొంత కమిషన్ రూపంలో హరీశ్ అనే వ్యక్తి ఇస్తున్నట్లు తెలిపారు. వీరి వద్ద నుంచి రూ.కోటి విలువ చేసే 6 కార్లును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Sorry, no posts matched your criteria.