India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విద్యార్థినిపై లైంగిక వేధింపులకు దిగిన ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదైంది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం శెట్పల్లిలో జరిగింది. గ్రామానికి చెందిన 9తరగతి విద్యార్థినిని అదే పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు శ్రీనివాస్ శర్మ లైంగిక వేధించసాగాడు. సదరు బాలిక ఈ విషయం తల్లిదండ్రులకు వివరించింది. వారు షీ టీంను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన షీటీం విచారణ చేపట్టి ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు చేసింది.
HYDలో వివిధ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాల ద్వారా మంగళవారం ఉదయం 6 గంటల నుంచి బుధవారం ఉ.6 గంటల వరకు రూ.1,72,21,300 నగదు, రూ.49,90,477 విలువ గల వస్తువులు, 91.17 లీటర్ల లిక్కర్‌ను సీజ్ చేసినట్లు HYD ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ తెలిపారు. నగదు, ఇతర వస్తువులపై 20 ఫిర్యాదులు రాగా వాటిని పరిశీలించి పరిష్కరించినట్లు చెప్పారు. 4 కేసులు నమోదు కాగా ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు వివరించారు.
ఉమ్మడి జిల్లాలో 2022-23 సంవత్సరంలో 4,670 ఎకరాల్లో రైతులు వివిధ కూరగాయలను సాగు చేశారు. 2024 సంవత్సరంలో 2,577 ఎకరాలకు సాగు పడిపోయింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూరగాయల సాగు తగ్గిపోవడంతో ఇతర జిల్లాల నుంచి దిగుమతి చేసుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. నిత్యం వేల టన్నుల కూరగాయలు, ఆకుకూరలు ఇతర జిల్లాల నుంచి దిగుమతి అవుతున్నాయి.
పార్లమెంట్‌లో తెలంగాణ రాష్ట్ర ప్రజల గొంతును BRS పార్టీ నేతలు వినిపిస్తారని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. HYD చింతల్‌లోని ఎమ్మెల్యే కార్యాలయంలో పార్లమెంట్ ఎన్నికల సమావేశంలో భాగంగా రంగారెడ్డి నగర్ డివిజన్ నాయకులు, కార్యకర్తలతో సమావేశం జరిగింది. కార్యకర్తలు, ప్రజలందరూ తోడుగా ఉంటే న్యాయం కోసం ఎంతవరకైనా పోరాడుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ఉన్నారు.
పార్లమెంట్‌లో తెలంగాణ రాష్ట్ర ప్రజల గొంతును BRS పార్టీ నేతలు వినిపిస్తారని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. HYD చింతల్‌లోని ఎమ్మెల్యే కార్యాలయంలో పార్లమెంట్ ఎన్నికల సమావేశంలో భాగంగా రంగారెడ్డి నగర్ డివిజన్ నాయకులు, కార్యకర్తలతో సమావేశం జరిగింది. కార్యకర్తలు, ప్రజలందరూ తోడుగా ఉంటే న్యాయం కోసం ఎంతవరకైనా పోరాడుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ఉన్నారు.
శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రిలో జరిగే శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవ తలంబ్రాలను అక్కడికి వెళ్లలేని భక్తులకు ఆర్టీసీ ద్వారా అందజేయడం జరుగుతుందని ఆర్ఏం సులేమాన్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడారు. తలంబ్రాల కోసం ఉమ్మడి జిల్లాలోని కార్గోపార్సిల్ కేంద్రాల్లో భక్తులు ఒక ప్యాకెట్‌కు రూ.151 చెల్లించాలన్నారు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకుని తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు.
నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ విద్యుత్ భవన్, కార్పొరేట్ కార్యాలయంలో నేడు 16 జిల్లాల సర్కిల్ సూపెరింటెండింగ్ ఇంజినీర్లు, ఎస్ఏఓలు, డివిజినల్ ఇంజినీర్లతో సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో ముందుగా ట్రాన్స్ కో అధికారులతో మాట్లాడారు. 132 కేవీ సబ్ స్టేషన్ల పనులను పూర్తి చేయాలని ఆదేశించారు .
కనగల్, చండూరు, నాంపల్లి మండల వాసులకు రైలు కూత వినిపించనుంది. ఇప్పటికే ఆయా మండలాల మీదుగా సర్వే పుర్తైంది. డోర్నకల్ నుంచి కూసుమంచి, పాలేరు, మోతె, సూర్యాపేట, భీమారం, తిప్పర్తి, నల్గొండ, కనగల్, చండూరు, నాంపల్లి మీదుగా.. గద్వాల వరకు రైల్వే లైను ప్రాథమిక సర్వే పూర్తి అయింది. దీంతో ఖమ్మం, నల్గొండ జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రాబోయే పార్లమెంటు ఎన్నికలు వంద రోజుల అబద్దాల కాంగ్రెస్ ప్రభుత్వం, పదేళ్లు నిజమైన పాలన అందించిన బీఆర్ఎస్ మధ్య జరిగే ఎన్నికలని, ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం ఖాయమని నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. బుధవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పార్టీ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో మాట్లాడారు.
వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ముగ్గురు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తూ ఎస్పీ అఖిల్ మహాజన్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. అవినీతి ఆరోపణల నేపథ్యంలో తాజాగా ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌కు అటాచ్డ్ చేసిన పది మంది సిబ్బందిలో ముగ్గురు కానిస్టేబుళ్లు శంకర్, అరుణ్, సురేశ్‌ను సస్పెండ్ చేశారు. వీరి సస్పెన్షన్ జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
Sorry, no posts matched your criteria.