India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
HYD బేగంపేట్ భగవంతపూర్‌లోని ఊర్వశి బార్ & రెస్టారెంట్‌పై టాస్క్‌ఫోర్స్ అధికారులు, పోలీసులు కలిసి దాడులు నిర్వహించారు. బేగంపేట్ పోలీసులు తెలిపిన వివరాలు.. ఊర్వశి బార్‌లో అశ్లీల నృత్యాలు చేస్తున్న 33మంది అమ్మాయిలు, 75 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. బార్ మేనేజర్ శ్రీనివాస్‌ను అరెస్టు చేశారు. 297 సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువతులను బేగంపేట్ మహిళా పీఎస్‌కు తరలించారు.

పద్మశ్రీ పురస్కార గ్రహీత, కిన్నెర కళాకారుడు దర్శనం మొగులయ్య బుధవారం HYDలో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను కలిశారు. తాను ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితులను మంత్రికి వివరించి చేయూతనివ్వాలని విన్నవించారు. ఆరోగ్యం సహకరించక, ఆర్థికంగా ఆదుకునేవారు లేక తాను అనుభవిస్తున్న కష్టాలను మొగులయ్య మంత్రికి వివరించారు. మొగులయ్య దుస్థితిని విన్న మంత్రి ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

ధాన్యం కొనుగోలుకు సంబంధించి ప్రత్యేకంగా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్ ఎస్.వెంకట్రావు తెలిపారు. ఏమైనా సందేహాలు ఉన్నా, ఇబ్బందులు ఉన్నా నేరుగా రైతులు కంట్రోల్ రూం నంబర్ కు 6281492368 నేరుగా ఫోన్ చేయవచ్చన్నారు. జిల్లాలో దాన్యం కొనుగోలు కేంద్రాలు పూర్తిస్థాయిలో ప్రారంభించడం జరిగిందని రైతులు ఆరబెట్టిన ధాన్యాన్ని తీసుకువచ్చి మద్దతు ధర పొందానని సూచించారు.
ఏనుగు దాడిలో రైతు మృతిచెందిన ఘటన కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో జరిగింది. చింతలమానేపల్లి మండలం బూరెపల్లికి చెందిన అన్నూరి శంకర్ బుధవారం తన మిరపతోటలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఏనుగు ఒక్కసారిగా మిరప చేనులో దిగింది. అతడిపై దాడి చేసి చంపేసింది. ఈ ఘటనతో స్థానికులు భయాందోళన గురై పరుగులు తీశారు.
సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం ఒగ్లాపూర్ గ్రామానికి చెందిన బైరి వెంకటేశం బతుకుదెరువు కోసం ఇరాక్ వెళ్లారు. ఆయన అక్కడ డిసెంబర్ 29, 2023న రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. మూడు నెలలుగా మృతదేహం కోసం ఎదురుచూస్తున్నామని, బుధవారం వెంకటేశం మృతదేహం ఒగ్లాపూర్‌కు చేరుకుందని చెప్పారు.
ఉమ్మడి మెదక్ జిల్లాకు ప్రత్యేక అధికారిగా భారతి హొళికేరిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. రాష్ట్రవ్యాప్తంగా తాగునీటి సమస్య పరిష్కారం కోసం ఐఏఎస్ అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాలకు భారతి హొళికేరిని నియమిస్తూ జీవో జారీ చేశారు. వీరు వేసవిలో నీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు, సమస్య ఏర్పడితే పరిష్కారంపై దృష్టి సారించనున్నారు.
కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ 2, 4, 6వ సెమిస్టర్ పరీక్షల ఫీజు చెల్లింపు తేదీని పొడిగించినట్లు KU అధికారులు పేర్కొన్నారు. ఫీజు గడువును ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఏప్రిల్ 4 వరకు పొడిగించారు. రూ.50 అపరాధ రుసుంతో ఏప్రిల్ 16 వరకు చెల్లించవచ్చన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో డిగ్రీ చదువుతున్న విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
రాష్ట్రంలో CAA ఎందుకు అమలు చేయరో మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి చెప్పాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ప్రశ్నించారు. బుధవారం ఆయన నిజామాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. మంత్రి ఉత్తమ్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ స్పందించాలన్నారు. పార్లమెంటులో ఆమోదం పొందిన చట్టం దేశం మొత్తం అమలు చేయాలి కానీ ఇలా ‘ మేము అమలు చేయం ’ అని అనడానికి ఉత్తమ్ ఎవరని నిలదీశారు. ఏ అధికారంతో ఈవ్యాఖ్యలు చేశారో చెప్పాలని MP ప్రశ్నించారు.
Sorry, no posts matched your criteria.