India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లోని కొన్ని గ్రామాల్లో తాగునీటి ఎద్దడి నెలకొంది. దానిని నివారించేందుకు ప్రభుత్వం ప్రత్యేక అధికారిని నియమించింది. స్పెషల్ ఆఫీసర్‌గా ఐఏఎస్ సురేంద్ర మోహన్‌ను నియమిస్తూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
జిల్లాలో తాగునీటి పర్యవేక్షణకు ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారిగా ఇంటర్ బోర్డు సెక్రటరీ ఐఏఎస్ శృతి ఓజాను ప్రభుత్వం నియమించింది. పాలమూరు జిల్లాలో వేసవిని దృష్టిలో ఉంచుకొని తాగునీటి సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వం ప్రత్యేక అధికారిని నియమించింది. వీరు జిల్లాలో జూలై నెల వరకు తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు, సమస్య ఏర్పడితే పరిష్కారంపై దృష్టి సారించనున్నారు.
HYD, RR, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల పరిధిలో మూసీ నది గర్భంలో 1,585, బఫర్ జోన్‌లో 6,890 అక్రమ నిర్మాణాలు ఉన్నట్లుగా రెండేళ్ల కిందట అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ప్రత్యేక మాస్టర్ ప్లాన్ ద్వారా మూసీ అభివృద్ధికి ప్రభుత్వం స్వీకారం చుడతోంది. సుందరీకరణ జరగక ముందే.. కబ్జా కోరులు మూసీ పరివాహక ప్రాంతంలో అక్రమాలకు తేరలేపుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో అధికారులు డేగ కన్నుతో నిఘా పెట్టారు.
HYD, RR, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల పరిధిలో మూసీ నది గర్భంలో 1,585, బఫర్ జోన్‌లో 6,890 అక్రమ నిర్మాణాలు ఉన్నట్లుగా రెండేళ్ల కిందట అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ప్రత్యేక మాస్టర్ ప్లాన్ ద్వారా మూసీ అభివృద్ధికి ప్రభుత్వం స్వీకారం చుడతోంది. సుందరీకరణ జరగక ముందే.. కబ్జా కోరులు మూసీ పరివాహక ప్రాంతంలో అక్రమాలకు తేరలేపుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో అధికారులు డేగ కన్నుతో నిఘా పెట్టారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో తాగునీటిని పర్యవేక్షించేందుకు ఐఏఎస్‌ను ప్రత్యేక అధికారిగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్, హన్మకొండ, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో తాగునీటిని పర్యవేక్షణకు బి.గోపిని ప్రత్యేక అధికారిగా నియమించారు.
హరీశ్‌రావు ఇలాకా సిద్దిపేటలో BRSకు షాక్ తగిలింది. స్థానిక మున్సిపాలిటీకి చెందిన ముగ్గురు BRS పార్టీ కౌన్సిలర్లు సాకి బాలక్ష్మి ఆనంద్, ముత్యాల శ్రీదేవి బుచ్చిరెడ్డి, మహమ్మద్ రియాజ్ బుధవారం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. BRS పార్టీకి కేంద్ర బిందువుగా ఉన్న సిద్దిపేటలో కౌన్సిలర్లు కాంగ్రెస్‌లో చేరడంపై స్థానికంగా చర్చనీయాంశమైంది. ఈ కార్యక్రమంలో నీలం మధు కూడా ఉన్నారు.
సిరిసిల్ల జిల్లాలో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికుల వివరాల ప్రకారం.. తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన ఎత్తరి శైలజ(19) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
నాగర్ కర్నూల్ పార్లమెంటు పరిదిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా, మహిళా ఓటర్లు అత్యధికంగా గద్వాల సెగ్మెంట్లోనే ఉన్నారు. గద్వాలలో 1,30,499 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 1,2,282 మంది మహిళా ఓటర్లతో వనపర్తి 2వ స్థానంలో ఉంది. అచ్చంపేట 1,24,382 ఓట్లతో 3వ స్థానంలో ఉండగా, అలంపూర్లో 1,21,074, కల్వకుర్తిలో 1,20,148, కొల్లాపూర్లో 1,17,942, నాగర్ కర్నూల్‌లో 1,19,366 మంది మహిళా ఓటర్లు ఉన్నారు.
కాంగ్రెస్ అసమర్ధత పాలన వల్లే రాష్ట్రంలో కరువు వచ్చిందని డీకే అరుణ అన్నారు. బుధవారం షాద్ నగర్‌లో మీడియాతో మాట్లాడారు. ఆర్భాటాలకు పోయి ఆరు గ్యారంటీలు అని చెప్పి అధికారంలోకి వచ్చిందన్నారు. ఒకప్పుడు సస్యశ్యామలంగా ఉన్న తెలంగాణ.. ఇప్పుడు కరువు కోరల్లోకి నెట్టివేయబడుతోందని అన్నారు. కాంగ్రెస్ మాయ మాటలను ప్రజలు గుర్తించాలన్నారు. ఓటుతో బుద్ది చెప్పాలి, లేకపోతే మరోసారి మోసపోతారని అన్నారు.
పాలమూరు విశ్వవిద్యాలయంలో ఈనెల 6న ‘ఎమర్జింగ్ ఇండియన్ ఎకానమీ గ్రోత్ అండ్ ప్రాస్పెక్ట్స్’ అనే అంశంపై జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు సదస్సు కన్వీనర్ డా.జి. జిమ్మికార్టన్, కో కన్వీనర్ డా. బి. వెంకట్ రాఘవేందర్ తెలిపారు. పీయూ ఎకనామిక్స్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించే సదస్సుకు ప్రధాన వక్తగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్ డైరెక్టర్ ప్రొ. టీఎల్ఎన్. స్వామి హాజరవుతున్నారని తెలిపారు.
Sorry, no posts matched your criteria.