India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తాటిచెట్టు పైనుంచి పడి గీత కార్మికుడు మృతి చెందాడు. చివ్వెంల మండలం కుడకుడ శివారులో ఈ ప్రమాదం జరిగింది. మోకు జారి కింద పడడంతో గీత కార్మికుడి బిక్షంకు గాయాలయ్యాయి. చికిత్స కోసం హైదారాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడి కుమారుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్ల ఎస్ఐ వెంకటరెడ్డి తెలిపారు.
వెల్దుర్తి పోలీస్ స్టేషన్ పరిధి శెట్టిపల్లి కలాన్ శివారులో కొబ్బరి తోటలో పనిచేసేందుకు వచ్చిన వెంకటరమణ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఏపీలోని వడ్లమూరుకు చెందిన వెంకటరమణ, భాగ్యలక్ష్మి దంపతులు 3 నెలల క్రితం తోటలో పని చేసేందుకు వచ్చారు. రాత్రి మద్యం సేవించి రాగా భార్య గొడవ చేయడంతో బయటకు వెళ్లి విషం తాగాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేశారు.
లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించాలనే వ్యూహంతో ప్రధాన పార్టీల నేతలు మాటల యుద్ధానికి తెరతీశారు. ఒకరిపై మరొకరు చేసే విమర్శలు, ప్రతి విమర్శలతో పాలమూరులో ఉన్న 2 లోక్‌సభ నియోజకవర్గాలు రాజకీయంగా వేడెక్కుతున్నాయి. ఎలాగైనా విజయం సాధించాలనే వ్యూహ రచనతో ఉన్న అభ్యర్థులు మాటల యుద్ధం చేస్తూ రాజకీయ వర్గాల్లో సెగలు పుట్టిస్తున్నారు. ఈ ప్రభావం ఎన్నికలపై చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
కొమురవెల్లి శ్రీమల్లికార్జున స్వామి బ్రహోత్సవాల్లో భాగంగా ఈ నెల 7న అగ్నిగుండాల కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో బాలాజీ శర్మ, ఆలయ ఛైర్మన్ లక్ష్మారెడ్డి బుధవారం ప్రకటనలో తెలిపారు. 7న రాత్రి 12 గంటలకు అగ్నిప్రజ్వలన , 8న ఉదయం 6 గంటలకు అగ్నిగుండ ప్రవేశం ఉంటుందని పేర్కొన్నారు. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.
వరకట్న వేధింపులతో కొడుక్కి విషమిచ్చి <<12973114>>తల్లి ఆత్మహత్య<<>> చేసుకున్న విషయం తెలిసిందే. పోలీసుల ప్రకారం.. ఈ ఘటనలో తల్లి శ్రీజ(27), కొడుకు రేయాన్ష్(11నెలలు) మృతిచెందగా.. కూతురి మృతి తట్టుకోలేక శ్రీజ తల్లి జయప్రద విషగుళికలు తిని మరణించింది. WGLకు చెందిన నరేశ్‌తో 2021లో శ్రీజ పెళ్లయింది. గొడవలతో తల్లి ఇంటికి వెళ్లిన శ్రీజ.. కొడుకు ఫస్ట్ బర్త్ డేకు పిలవగా రానని దూషించాడు. మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది.
HYDలో మరో దారుణ ఘటన జరిగింది. బహదూర్‌పుర PS పరిధి నందిముస్లాయిగూడలో మహమ్మద్ రషీద్ హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షకీల్ అహ్మద్ సోదరిని రషీద్ వివాహం చేసుకున్నాడు. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. బుధవారం మరోసారి వివాదం తలెత్తింది. ఈ విషయం తెలుసుకొన్న షకీల్ హుటాహుటిన సోదరి ఇంటికి వచ్చాడు. మాటామాటాపెరగడంతో రషీద్‌ను కత్తితో పొడిచి చంపేశాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి బీఆర్ఎస్ మాజీ మంత్రి లీగల్ యాక్షన్‌లోకి దిగారు. తనపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డిపై కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. మరి మాజీ మంత్రి కేటీఆర్ పరువు నష్టం దావా వేయడంతో మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి.
HYDలో మరో దారుణ ఘటన జరిగింది. బహదూర్‌పుర PS పరిధి నందిముస్లాయిగూడలో మహమ్మద్ రషీద్ హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షకీల్ అహ్మద్ సోదరిని రషీద్ వివాహం చేసుకున్నాడు. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. బుధవారం మరోసారి వివాదం తలెత్తింది. ఈ విషయం తెలుసుకొన్న షకీల్ హుటాహుటిన సోదరి ఇంటికి వచ్చాడు. మాటామాటాపెరగడంతో రషీద్‌ను కత్తితో పొడిచి చంపేశాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
తల్లి మందలించిందని కొడుకు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కామేపల్లి మండలం గోవింద్రాలలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. గోవింద్రాల గ్రామానికి చెందిన భూక్య మధు(17) ఇంట్లో ఏం పని చేయకుండా ఉండడంతో తల్లి మందలించింది. దీంతో మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. గమనించిన స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు
ఆదిలాబాద్ లోక్‌సభ నియోజకవర్గం 1952వ సంవత్సరంలో ఏర్పడింది. 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఈ స్థానాన్ని ఎస్టీ రిజర్వ్‌డ్‌గా మార్చారు. ఇప్పటి వరకు 17 సార్లు ఎన్నికలు జరగగా.. మొదటి సారి సోషలిస్ట్ పార్టి, తరువాత కాంగ్రెస్ 9, టీడీపీ 5, బీఆర్ఎస్2, ప్రస్తుతం బీజేపీ నుంచి సోయం బాపురావు ఎంపీగా గెలుపొందారు.
Sorry, no posts matched your criteria.