Telangana

News April 3, 2024

MBNR: విమర్శలకు పదును పెట్టిన డీకే అరుణ

image

మహబూబ్ నగర్ బిజెపి అభ్యర్థి డీకే అరుణ కాంగ్రెస్ అభ్యర్థిపై విమర్శలకు పదును పెట్టారు. రాబోయే పార్లమెంటు ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్న అరుణ కాంగ్రెస్ అభ్యర్థి వంశీ చంద్ రెడ్డి పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. ప్రధాన పోటీ కాంగ్రెస్ బిజెపి పార్టీల మధ్య ఉండే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం సాగుతున్న నేపథ్యంలో అరుణ, వంశీని టార్గెట్ చేసి ముందుకు సాగుతున్నారు.

News April 3, 2024

వరంగల్: క్రమంగా పెరుగుతున్న పత్తి ధర 

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి ధరలు గత మూడు రోజులుగా స్వల్పంగా పెరుగుతూ వస్తున్నాయి. సోమవారం రూ.7,200 పలికిన క్వింటా పత్తి.. మంగళవారం రూ.7240కి చేరింది. ఈరోజు స్వల్పంగా పెరిగి, రూ.7260 అయింది. అయితే గతేడాదిలా.. కాకుండా ఈసారి పత్తి ధరలు భారీగా పడిపోయాయని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News April 3, 2024

NLG: నీటి అక్రమ వినియోగంపై నిఘా!

image

నాగార్జునసాగర్ ఎడమ కాలువ పరిధిలో నీటి అక్రమ వినియోగాన్ని అరికట్టేందుకు అధికారుల బృందం నిఘా పెట్టారు. ఆయకట్టు పరిధిలోని నల్గొండ, ఖమ్మం జిల్లాలోని పెద్దదేవులపల్లి, పాలేరు చెరువులను నింపి నీటి ఎద్దడి నివారణ చర్యల్లో భాగంగా 3టీఎంసీల నీటిని ఎడమ కాలువకు విడుదల చేసిన విషయం తెలిసిందే. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆయకట్టు పరిధిలోని ఆయా మండలాల్లో అధికారులు నిఘా ఏర్పాటు చేశారు.

News April 3, 2024

భద్రాద్రి జిల్లా పోలీసుల హైఅలర్ట్..

image

తెలంగాణ సరిహద్దు దండకారణ్యంలో మావోయిస్టులు పోలీసులకు మధ్య ఎన్‌కౌంటర్లు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో భద్రాద్రి జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. భద్రాచలం ఏజెన్సీలో పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. వరుస ఘటనలతో కసి మీద ఉన్న మావోయిస్టులు తమ వ్యూహాలకు పదును పెట్టి రెచ్చిపోతారని నిఘా వర్గాల సమాచారంతో బేస్ క్యాంపులకు పెద్ద ఎత్తున అదనపు బలగాలను రప్పిస్తున్నారు. తాజా పరిస్థితులను ఎస్పీ ఆరా తీస్తున్నారు.

News April 3, 2024

సంగారెడ్డి: నిన్న బీజేపీ.. నేడు బీఆర్ఎస్‌

image

సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలం బీబీపేట గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు నిన్న బీజేపీలో చేరి, బుధవారం తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. ఖేడ్ మాజీ MLA భూపాల్ రెడ్డి సమక్షంలో కిషన్ రెడ్డి, మల్ రెడ్డి, బాల్‌రెడ్డి, కిరణ్ రెడ్డి, తదితరులకు పార్టీ కండువా కప్పి ఆహ్వనించారు. వారు మాట్లాడుతూ.. బలవంతంగా నిన్న బీజేపీ కండువా కప్పారని పేర్కొన్నారు. బీఆర్ఎస్‌లోనే కొనసాగుతామన్నారు.

News April 3, 2024

WGL: కొడుక్కి విషమిచ్చి తల్లి ఆత్మహత్య

image

వరకట్న వేధింపులతో కొడుక్కి విషమిచ్చి ఓ తల్లి మంగళవారం KNRలో ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల ప్రకారం.. ఈ ఘటనలో తల్లి శ్రీజ(27), కొడుకు రేయాన్ష్(11) మృతి చెందగా.. కూతురి మృతి తట్టుకోలేక శ్రీజ తల్లి జయప్రద విషగుళికలు తిని మరణించింది. WGLకు చెందిన నరేశ్‌తో 2021లో శ్రీజ పెళ్లయింది. గొడవలతో తల్లి ఇంటికి వెళ్లిన శ్రీజ.. కొడుకు ఫస్ట్ బర్త్ డేకు పిలవగా రానని దూషించాడు. మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది.

News April 3, 2024

మహబూబ్ నగర్‌లో పెరుగుతున్న ఎండలు

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎండలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. GDWL, NRPT జిల్లాలో
గత 24 గంటల్లో ఏకంగా 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. NGKL, MBNR, WNPT జిల్లాలలోని పలు ప్రాంతాల్లో 40 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత రికార్డైంది. రాబోయే రోజుల్లో ఇంకా ఎండ తీవ్రత పెరుగుతుందని, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.

News April 3, 2024

మద్దూర్: పెళ్లైన మూడు రోజులకే సూసైడ్

image

పెళ్లైన మూడు రోజులకే వివాహిత పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మద్దూర్ మండల ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. నందిపాడు గ్రామానికి చెందిన మమత(20) అదే గ్రామానికి చెందిన మహేశ్ ప్రేమ వివాహం చేసుకున్నారు. గత నెల16న పురుగు మందు తాగగా, ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.

News April 3, 2024

ADB: కిడ్నీ సమస్యతో ఖాళీ అయిన ఊరు..!

image

ADB జిల్లా భీంపూర్ మండలం గోవింద్‌పూర్‌ గ్రామంలో 40 ఆదివాసీ గిరిజన కుటుంబాలు (200 మంది జనాభా) ఉన్నాయి. వారికి తాగునీటి వసతి సరిగ్గా లేదు. దీంతో గ్రామంలోని రెండు చేతి పంపులతో పాటు బావుల నీటినే వినియోగించేవారు. అయితే గడిచిన మూడేళ్లలో వరుసగా కిడ్నీ సంబంధిత సమస్యతో మరణాలు సంభవిస్తుండటంతో వారిలో ఆందోళన మొదలైంది. దీంతో గ్రామస్థులు ఊరిని వదిలి వెళ్లిపోయారు.

News April 3, 2024

MBNR: అంతర్రాష్ట్ర పోలీస్ అధికారుల సమన్వయ సమావేశం

image

రానున్న పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో అంతరాష్ట్ర (తెలంగాణ & కర్ణాటక) సరిహద్దు పోలీసు అధికారుల సమన్వయ సమావేశం మంగళవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో నిర్వహించారు. బళ్లారి రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ లోకేష్ కుమార్, జోన్-7 జోగులాంబ డిఐజి చౌహాన్, ఉమ్మడి జిల్లాల ఎస్పీలు పాల్గొన్నారు. ఎన్నికలు సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని చర్చించారు.

error: Content is protected !!