India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పలు నియోజకవర్గాల్లో అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. MBNR, NGKL అభ్యర్థులు సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రజలతో మమేకం అవుతున్నారు. ప్రజా ఆశీర్వాదం అంటూ బీజేపీ, ప్రజాపాలన అంటూ కాంగ్రెస్, కేంద్రంలో తెలంగాణ గళం పేరిట బీఆర్ఎస్ నేతలు ఓటర్లను ఆకర్షించే పనిలో నిమగ్నమయ్యారు. మూడు ప్రధాన పార్టీల్లో అభ్యర్థులు బలంగా ఉండడంతో తీవ్ర పోటీ నెలకొంది.
ఖమ్మం లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక విషయం తేలడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. పార్టీలో చేరే సమయంలో పొంగులేటికి ఇచ్చిన హామీ మేరకు ఆయన సోదరుడికి టికెట్ ఇవ్వాలని కొందరు, వేరొకరికి అవకాశమివ్వాలని మరికొందరు ప్రతిపాదిస్తున్న నేపథ్యంలో ఈ సీటుపై నిర్ణయం తీసుకోవడానికి మరో వారం రోజులు సమయం పట్టొచ్చని తెలుస్తొంది.
తమ సోదరి పాలమూరు పార్లమెంటు బిజెపి అభ్యర్థి డీకే అరుణ గెలుపు కోసం ఆమె చెల్లెళ్లు పద్మావతి, సువర్ణ, సురేఖలు ప్రచారంలో భాగంగా తమ వంతు సహాయం చేస్తున్నారు. వివిధ మండలాల్లో నిర్వహిస్తున్న విస్తృత స్థాయి సమావేశాలకు డీకే అరుణతో పాటు హాజరవుతున్నారు. స్థానికురాలైన తమ సోదరి గెలిపిస్తే కేంద్ర స్థాయిలో ఆమెకు ప్రభుత్వం మంచి ప్రాధాన్యం ఇస్తుందని, తద్వారా ఈ ప్రాంత అభివృద్ధికి కృషి జరుగుతుందని వివరిస్తున్నారు.
దేవాలయం రాతి గోపురంలో వజ్రాలు ఉంటాయని దానిని ధ్వంసం చేసిన ఘటన అనుముల మండలంలోని చోటుచేసుకుంది. పేరూరులో సోమేశ్వరస్వామి దేవాలయం కాకతీయుల కాలంలో నిర్మించారు. గతేడాది రూ.40 లక్షల నిధులతో దేవాలయం పునర్నిర్మాణం చేపట్టారు. గోపురం తొలగించి దేవాలయ ఆవరణలో పెట్టారు. దుండగులు ఆ రాతి గోపురాన్ని వాగులోకి తీసుకెళ్లి పగలగొట్టారు. అటుగా వెళ్లిన గ్రామస్థులు గమనించి దేవాలయం కమిటీకి, పోలీసులకు సమాచారం అందించారు.
పాలమూరు యూనివర్సిటీలో విజయశ్రీ బయో ఫెర్టిలైజర్స్ ఆధ్వర్యంలో మంగళవారం క్యాంపస్ సెలక్షన్లు నిర్వహించారు. ఈ మేరకు సెలక్షన్స్ మొత్తం 32 మంది విద్యార్థులు హాజరవగా 25 మంది మౌఖిక పరీక్షకు హాజరైనట్లు ప్లేస్‌మెంట్ అధికారి అర్జున్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రంజిత్ రెడ్డి, పరుశురాం, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
జగిత్యాల జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మధ్యాహ్నం వేళ బయటకు రావాలంటే ప్రజలు జంకుతున్నారు. మంగళవారం ధర్మపురి మండలంలోని జైన గ్రామంలో 43.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో జైన.. రాష్ట్రంలోనే నాల్గవ స్థానంలో నిలిచింది. ఉదయం తొమ్మిది దాటితే భానుడు భగ్గుమంటున్నాడు. మధ్యాహ్నం వేళ తీవ్రరూపం దాల్చుతున్నాడు. రోజు రోజుకూ ప్రతాపం చూపిస్తున్నాడు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ నేత సస్పెండ్ అయ్యారు. జిల్లాకు చెందిన సీనియర్ నేత బక్క జడ్సన్‌ను పార్టీ నుంచి 6 సంవత్సరాలు సస్పెండ్ చేసింది. ఈ మేరకు టీ-కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ చిన్నారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. బహిరంగ వేదికలపై పార్టీ లైన్ క్రాస్ చేసి మాట్లాడటం, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటంతో జడ్సన్‌ను సస్పెండ్ చేసినట్లు తెలిపారు.
వరంగల్ ఎంపీ స్థానంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీ ప్రకటించిన అభ్యర్థులు ఇద్దరు బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చినవారే కావడం ఆసక్తికర అంశం. అటు మహబూబాబాద్‌లోనూ బీజేపీ అభ్యర్థి సీతారాంనాయక్ కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీలో చేరగానే టికెట్ లభించింది. ఎంపీ ఎన్నికల నేపథ్యంలో నేతల పార్టీ మార్పుతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాజకీయ వేడి అలముకుంది.
ధరూర్ మండలం గార్లపాడు గ్రామంలో మంగళవారం ఈతకు వెళ్లి బాలిక మృతి చెందిన విషయం తెలిసిందే. కుర్వ నాగేంద్ర కూతురు మమత(10) వ్యవసాయ బావిలో స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లింది. ప్రమాద వశాత్తు నీట మునగటంతో ఊపిరాడక మృతి చెందింది. గ్రామస్థులు బాలిక మృతదేహాన్ని బావిలో నుంచి బయటకు తీశారు. బుధవారం పెద్ద కూతురు వివాహం ఉండగా, చిన్న కూతురు మృతితో పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట్లో విషాదం చోటుచేసుకుంది.
ఓ వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వివరాలిలా.. మిరుదొడ్డికి చెందిన సోహెల్, హుస్సేన్ దగ్గర ప్రతి నెలా రూ.40 వేలు వాయిదా పద్ధతిలో కారు కొన్నాడు. ఈక్రమంలో 3నెలల నుంచి వాయిదా చెల్లించకపోవడంతో కారును తీసుకున్నాడు. గతంలో కట్టిన డబ్బులు తిరిగివ్వాలని కోరాగా, హుస్సేన్ నిరాకరించాడు. దీంతో తన ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.