Telangana

News August 28, 2024

HYD: 20 పార్కుల ఏర్పాటుకు HMDA ప్రణాళిక

image

HYD నగర శివారులో ప్రజలు ఆహ్లాదకరంగా గడిపేందుకు 20 పార్కులకు హెచ్ఎండీఏ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఇప్పటికే కొత్వాల్ గూడలో 105 ఎకరాల్లో పురోగతిలో ఉండగా, ఇక శంషాబాద్, తెల్లాపూర్, గాజులరామారం లోనూ ఏర్పాటు చేయనున్నారు. ఆయా పార్కులలో సకల వసతులు కల్పించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. పిల్లలకు ఆట సామాగ్రితో పాటు, ఇతరత్ర అందుబాటులో ఉంచనున్నారు.

News August 28, 2024

యూపీ వ్యవసాయ శాఖ మంత్రిని కలిసిన మంత్రి తుమ్మల

image

రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఉత్తరప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సూర్యప్రతాప్ షాహిని బుధవారం ITC కోహినూర్ లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రస్తుత వ్యవసాయ పరిస్థితులపై ఇరురాష్ట్రాల మంత్రులు చర్చించారు. తెలంగాణలో రైతుల సంక్షేమం కోసం తీసుకొంటున్న చర్యలను మంత్రి తుమ్మల యూపీ మంత్రికి వివరించారు.

News August 28, 2024

HYD: కరెంట్ షాక్ తగిలి చనిపోతే..?

image

గ్రేటర్ HYD పరిధిలో వర్షాకాలం వేళ కరెంట్ స్తంభాలు, తీగల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఒకవేళ దురదృష్టవశాత్తు..
✓విద్యుదాఘాతంతో మృతిచెందిన కుటుంబానికి పరిహారాన్ని రూ.2 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచారు ✓శాశ్వత అంగవైకల్యానికి గురైతే రూ.5 లక్షలు
✓తీవ్రంగా గాయ పడితే రూ.లక్ష, స్వల్పంగా గాయపడితే రూ. 25 వేలు చెల్లిస్తారు
✓ప్రమాద బాధితులకు వైద్య ఖర్చులు కూడా అందిస్తారు. ✓ఆస్తినష్టం జరిగినా పరిహారం చెల్లిస్తారు.

News August 28, 2024

NZB: పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదు: కలెక్టర్

image

18 ఏళ్లు దాటని పిల్లలకు బైకులు ఇవ్వకూడదని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. ద్విచక్ర వాహనదారులు ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నారని కావున తప్పనిసరిగా ద్విచక్ర వాహన చోదకులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని కలెక్టర్ సూచించారు. పోలీసులు కూడా హెల్మెట్‌పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.

News August 28, 2024

వనపర్తి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

image

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును బైక్ ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. స్థానికుల వివరాలు.. పామిరెడ్డిపల్లికి చెందిన బోయ అశోక్, బోయ చందు బైక్‌పై వనపర్తికి వెళ్తుండగా.. పామిరెడ్డిపల్లి స్టేజ్ వద్ద వనపర్తి డిపోకు చెందిన బస్సును ఢీ కొన్నారు. ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.

News August 28, 2024

సీజనల్ వ్యాధుల నివారణకు ప్రత్యేక దృష్టి: కమిషనర్

image

ప్రజల ఆరోగ్య రక్షణే ధ్యేయంగా నగరంలో ప్రత్యేక పారిశుద్ధ్య(స్పెషల్ డ్రైవ్) పనులకు శ్రీకారం చుట్టామని కమిషనర్ చాహాత్ బాజ్ పాయ్ అన్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని పలు డివిజన్లలో ఆమె పర్యటించారు. పారిశుద్ధ్య కార్మికులు, సిబ్బంది చేస్తున్న స్పెషల్ డ్రైవ్ పనులను తనిఖీ చేసి పరిశీలించారు. చెత్తాచెదారం నగరంలో కనిపించకుండా చేయాలని సిబ్బందికి పలు సలహాలు, సూచనలతో ఆదేశాలు జారీ చేశారు.

News August 28, 2024

ఇచ్చోడ: మహిళా శక్తి క్యాంటీన్ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

image

ఇచ్చోడ మండల కేంద్రంలోని పాత బస్టాండ్ ఎదురుగా ఇందిరా మహిళ శక్తి పథకం కింద ఏర్పాటు చేస్తున్న నూతన మహిళ శక్తి క్యాంటీన్‌ను బుధవారం జిల్లా కలెక్టర్ రాజర్షిషా పరిశీలించారు. క్యాంటీన్ ఏర్పాటుకు సంబంధించిన పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మహిళా శక్తి పథకంతో మహిళల ఆర్థిక అభివృద్ధికి సహాయపడుతుందన్నారు.

News August 28, 2024

దెగులవాడిలో భారీ కొండచిలువ

image

కంగ్టి మండలం దెగులవాడి గ్రామంలోని పాడుబడిన ఇంటి గోడల్లో భారీ కొండచిలువ ప్రత్యక్షమైంది. దీంతో స్థానికులు భయాందోళనకు గురైయ్యారు. ఆ విష సర్పాన్ని ప్రత్యక్షంగా చూశామని స్థానికులు రఘునందన్ కులకర్ణి, నాగనాథ్ రెడ్డి, నాగిరెడ్డి తెలిపారు. దాదాపు 15 ఫీట్ల పొడవు ఉందని చెప్పారు.

News August 28, 2024

ప్రభుత్వ ఉద్యోగి మృతి.. 4 రోజుల తర్వాత గుర్తింపు

image

NLG వైద్యఆరోగ్యశాఖ పరిధిలో పనిచేస్తున్న హెల్త్ అసిస్టెంట్ పురుషోత్తం రాజు(48) అనారోగ్యంతో 4 రోజుల క్రితం మృతి చెందారు. ఇటీవల పురుషోత్తమ రాజు సడెన్‌గా విధులకు హాజరు కాకపోవడం, అందుబాటులో లేకపోవడంతో మంగళవారం తోటి ఉద్యోగులు పానగల్ అలివేలుమంగాపురం కాలనీలో ఉన్న అతడి ఇంటికి వెళ్లి చూసి పోలీసులు సమాచారం ఇచ్చారు. తలుపులు పగలగొట్టి చూడడంతో అతడి మృతదేహం కుళ్ళిపోయి కనిపించింది.

News August 28, 2024

పూర్తిగా నిండిన శ్రీశైలం జలాశయం

image

కృష్ణమ్మ పరవళ్లతో శ్రీశైలం డ్యాం నిండుకుండలా మారింది. వరద నీటితో డ్యాం పూర్తిస్థాయిలో నిండింది. ప్రస్తుతం జలాశయానికి ఇన్ ఫ్లో 2,55,215 క్యూసెక్కులు ఉండగా.. ఔట్ ఫ్లో 1,53,149 క్యూసెక్కులు ఉంది. జూరాల నుంచి వరద వస్తుండటంతో జలాశయం 3 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు