Telangana

News April 3, 2024

KNR కాంగ్రెస్ MP టికెట్‌పై ఉత్కంఠ!

image

KNR MPఅభ్యర్థి విషయంలో కాంగ్రెస్ ఆచితూచీ అడుగులేస్తోంది. ఇప్పటికే మెజారిటీ సీట్లను ఖరారు చేసిన కాంగ్రెస్ KNR విషయంలో జాప్యం చేస్తోంది. ప్రజలతో సత్సంబంధాలతో పాటు.. సామాజిక సమీకరణాల ఆధారంగా ఎవరికి ఓట్లు ఎక్కువొస్తాయనే విషయమై కూడా పార్టీ పెద్దలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రవీణ్ రెడ్డి, వెలిచాల రాజేందర్ రావులు తమకే టికెట్ వస్తుందనే ధీమాతో ఉండగా.. మరో కొత్త అభ్యర్థిని సైతం వెతుకుతున్నట్లు సమాచారం.

News April 3, 2024

మహబూబాబాద్: నలుగురి పై గృహ హింస కేసు నమోదు

image

అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని ఓ వివాహిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు నలుగురిపై కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై వి.దీపికరెడ్డి తెలిపారు. ఎస్సై వివరాల ప్రకారం.. మండలంలోని పర్వతగిరి గ్రామానికి చెందిన మహేశ్వరికి కృష్ణా జిల్లా అవనిగడ్డకు చెందిన నాదెళ్ల నవజీవన్‌తో రెండేళ్ల క్రితం వివాహం అయింది. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. అదనపు కట్నం కోసం వేధిస్తుండటంతో నవజీవన్ కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు.

News April 3, 2024

MBNR: SSC రాశారా.. ఇది మీ కోసమే!

image

ఇటీవల పదో తరగతి వార్షిక పరీక్షలు ముగియడంతో విద్యాశాఖ అధికారులు బుధవారం నుంచి పేపర్ మూల్యాంకనం చేపట్టనున్నారు. ఈ మేరకు MBNR, గద్వాల, నారాయణపేట జిల్లాలకు సంబంధించిన పేపర్లను పాలమూరులోని గ్రామర్ స్కూల్లో వాల్యుయేషన్ చేయనున్నారు. మొత్తం 2.30 లక్షల పేపర్ల వాల్యుయేషన్ కోసం 800 మంది అసిస్టెంట్ ఎగ్జామినర్లు, 150 చీఫ్ ఎగ్జామినర్లు, 260 మంది స్పెషల్ అసిస్టెంట్లను నియమించారు. SHARE IT

News April 3, 2024

HYD: లాలాగూడ‌ CI సస్పెన్షన్

image

పోలీస్ వ్యవస్థలో హైదరాబాద్‌ CP కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి తన మార్క్ చూపిస్తున్నారు. పోలీస్ అధికారులు విధుల్లో నిర్లక్ష్యం చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా లాలాగూడ CI పద్మను సస్పెండ్ చేశారు. రోడ్డు ప్రమాదంలో యాచకురాలు మృతి చెందితే నిర్లక్ష్యం చేసినట్లు ఆరోపణలు వచ్చాయట. విచారణ చేపట్టిన కమిషనర్ తప్పుడు కేసుగా గుర్తించి.. ఆమెను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

News April 3, 2024

ఈనెల 6న కాంగ్రెస్‌లోకి భద్రాచలం ఎమ్మెల్యే..?

image

భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు బీఆర్‌ఎస్‌ని వీడి కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం.
భద్రాచలం ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి సొంత పార్టీతో తెల్లం వెంకట్రావు అంటీముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు. కాగా తుక్కుగూడ వేదికగా కాంగ్రెస్‌ బహిరంగ సభ శనివారం జరగనుంది. ఈ సభలోనే తెల్లం వెంకట్రావు తన అనుచరులతో పాటు హస్తం గూటికి చేరనున్నట్లు సమాచారం.

News April 3, 2024

HYD: లాలాగూడ‌ CI సస్పెన్షన్

image

పోలీస్ వ్యవస్థలో హైదరాబాద్‌ CP కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి తన మార్క్ చూపిస్తున్నారు. పోలీస్ అధికారులు విధుల్లో నిర్లక్ష్యం చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా లాలాగూడ CI పద్మను సస్పెండ్ చేశారు. రోడ్డు ప్రమాదంలో యాచకురాలు మృతి చెందితే నిర్లక్ష్యం చేసినట్లు ఆరోపణలు వచ్చాయట. విచారణ చేపట్టిన కమిషనర్ తప్పుడు కేసుగా గుర్తించి.. ఆమెను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

News April 3, 2024

ADB: అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లిన ఉపాధ్యాయుడిపై వేటు

image

అనుమతి లేకుండానే విదేశీ పర్యటనకు వెళ్లిన ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని బరంపూర్ జిల్లా పరిషత్ పాఠశాల ఉపాద్యాయుడు మహేందర్ యాదవ్‌ను సస్పెండ్ చేస్తూ డీఈవో ప్రణీత మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. మార్చి నెల 9 నుంచి 14 వరకు స్కూల్ అసిస్టెంట్ మహేందర్ యాదవ్ విదేశాలకు వెళ్లారని ఆయనపై పీఆర్టీయూ తెలంగాణ యూనియన్ సభ్యులు ఫిర్యాదు చేశారు. అతడిపై విచారణ జరిపించి వేటువేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.

News April 3, 2024

కామారెడ్డి: ముగ్గురు MPDOలకు షోకాజ్ నోటీసులు

image

ఉపాధిహామీ కూలీలకు అవగాహన కల్పించకుండా పనులు చేయించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ముగ్గురు MPDOలకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు కలెక్టర్ జితేష్ వి.పాటిల్ తెలిపారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయం నుంచి మంగళవారం మండలస్థాయి అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గాంధారి, నస్రుల్లాబాద్, బిచ్కుంద MPDOలు రాజేశ్వర్, గోపాల్, నీలావతికి షోకాజ్ నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు.

News April 3, 2024

పెద్ది స్వప్నకు ఎంపీ టికెట్ దక్కేనా?

image

వరంగల్ పార్లమెంట్ BRS తరఫున టికెట్ కోసం పలువురు ఆశావాహులు ప్రయత్నాలు చేస్తున్నారు. Ex.MLA పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణి, నల్లబెల్లి ZPTC పెద్ది స్వప్నకు టికెట్ వస్తుందని నర్సంపేట నియోజకవర్గంలో ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. తెలంగాణ ఉద్యమకారురాలైన స్వప్నకు టికెట్ ఇస్తే ఉద్యమ సెంటిమెంట్ కలిసొస్తుందని అధిష్ఠానం ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. టికెట్ కోసమే ఇటీవల కేసీఆర్‌ను కలిశారనే చర్చ సాగుతోంది.

News April 3, 2024

ఈనెల4న నల్గొండలో స్పాట్ అడ్మిషన్లు

image

గ్రూప్ ఎగ్జామ్స్, బ్యాంకింగ్, RRB, SSC, రాష్ట్రస్థాయి, కేంద్ర స్థాయి ఉద్యోగాల కొరకు ఫౌండేషన్ కోర్సు ద్వారా మూడు నెలల పాటు ఉచిత వసతి, శిక్షణ అందచేస్తున్నట్టు జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి శాఖ అధికారి శ్రీనివాస్ తెలిపారు. ఇందుకోసం ఈనెల 4న నల్గొండలోని విశ్వదీప్ విద్యాపీట్ హైస్కూల్‌లో స్పాట్ అడ్మిషన్లు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎస్సీ అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలన్నారు.

error: Content is protected !!