India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రతినెల మొదటి బుధవారం “సైబర్ జాగృక్తా దివాస్” కార్యక్రమం ద్వారా ప్రజలను చైతన్యం చేయాలని సీపీ కల్మేశ్వర్ సింగెనవార్ వెల్లడించారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో, హైదరాబాద్ ఆదేశానుసారంతో నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్‌స్టేషన్లలో ప్రజలకు ప్రతినెల మొదటి బుధవారం అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.
పార్లమెంటులో పాలమూరు వాయిస్ వినిపించాలంటే ఇక్కడ బీజేపీని గెలిపించాలని మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. ధన్వాడలోని రాఘవేంద్ర ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ధన్వాడ, మరికల్ మండలాల బీజేపీ ముఖ్య నాయకుల సమావేశంలో డీకే అరుణ పాల్గొన్నారు. నిరుపేదలకు రేషన్ బియ్యం, రైతులకు పెట్టుబడి సాయం, మహిళలకు ముద్ర లోన్స్, గ్రామీణ ప్రాంతం ప్రజలకు ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు బీజేపీ ఇస్తుందని గుర్తుచేశారు.
మంచిర్యాల జిల్లాలో తాగునీటి ఎద్దడి లేకుండా అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్లో అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ప్రజలకు నిరంతరం తాగునీటి సరఫరాకు అదనపు కలెక్టర్ నోడల్ అధికారిగా వ్యవహరిస్తారని తెలిపారు. మండల, గ్రామ, వార్డుస్థాయిలో ప్రత్యేక అధికారులను నియమించి అవసరమైన కార్యాచరణ రూపొందించాలన్నారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో నేటి నుండి పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభంకానుంది. పట్టణంలో భగీరథ కాలనీలో ఉన్న మహబూబ్ నగర్ గ్రామర్ స్కూల్లో MBNR, GDWL, NRPT జిల్లాలకు సంబంధించిన సిబ్బంది మూల్యాంకనంలో పాల్గొంటారు. NGKL జిల్లా కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో WNP, NGKL జిల్లాల సిబ్బంది మూల్యాంకనం ప్రక్రియలో పాల్గొనున్నారు. మూల్యాంకనం కోసం 1,800 ఉపాధ్యాయులకు ఉత్తర్వులు ఇచ్చారు.
NLG: ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులు ఎలాంటి సమస్యలు రాకుండా లోకసభ ఎన్నికలను పారదర్శకంగా, సజావుగా నిర్వహించాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన అన్నారు. మంగళవారం ఆమె నల్గొండలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో లోకసభ ఎన్నికల విధుల నిర్వహణకు నియమించబడిన ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు ఉద్దేశించి ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు.
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంసీఏ పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు. మూడేళ్ల ఎంసీఏ, రెండేళ్ల ఎంసీఏ బ్యాక్ లాగ్ పరీక్షలను ఏప్రిల్ 19వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్షా తేదీన పూర్తి వివరాలను ఓయూ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంసీఏ పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు. మూడేళ్ల ఎంసీఏ, రెండేళ్ల ఎంసీఏ బ్యాక్ లాగ్ పరీక్షలను ఏప్రిల్ 19వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్షా తేదీన పూర్తి వివరాలను ఓయూ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.
HYD శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికులు పోగొట్టుకున్న లగేజీ, మర్చిపోయిన వస్తువులను అధికారులు భద్రపరిచి, వాటి వివరాలను https://bit.ly/3k3sY1X ప్రత్యేక వెబ్‌సైట్ ద్వారా అందుబాటులో ఉంచారు. విమానాశ్రయంలో ఏవైనా మర్చిపోయినట్లయితే.. 040-66606064 నంబర్‌కు కాల్ చేయాలని తెలిపారు. ghiallost&found@gmrgroup.in మెయిల్ ద్వారా సైతం సందేహాలను తెలపవచ్చని పేర్కొన్నారు. SHARE IT
ఇది కాలం తెచ్చిన కరవు కాదని, ముమ్మాటికీ కాంగ్రెస్ తెచ్చిన కరవేనని, దమ్ముంటే కాంగ్రెస్ నేతలు చర్చకు రావాలని మాజీ మంత్రి హరీశ్‌రావు సవాల్ విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతాంగానికి అడుగడుగున అన్యాయమే జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం రైతాంగం ఎదురుకుంటున్న సమస్యల పట్ల కలెక్టర్‌కు వినతి పత్రం అందించారు.ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ నీటి నిర్వహణ, విద్యుత్ వైఫల్యమే పంట నష్టానికి కారణమన్నారు.
పార్లమెంట్ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలని అధికారులకు కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. మంగళవారం నారాయణపేట సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పిఓ, ఏపిఓ లకు పార్లమెంట్ ఎన్నికల నిర్వహణపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఎన్నికల సంఘం నియమావళి ప్రకారం ఎన్నికలను సజావుగా, ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించాలని అన్నారు. ఎన్నికల నిర్వహణపై పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.
Sorry, no posts matched your criteria.