India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
HYD శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికులు పోగొట్టుకున్న లగేజీ, మర్చిపోయిన వస్తువులను అధికారులు భద్రపరిచి, వాటి వివరాలను https://bit.ly/3k3sY1X ప్రత్యేక వెబ్‌సైట్ ద్వారా అందుబాటులో ఉంచారు. విమానాశ్రయంలో ఏవైనా మర్చిపోయినట్లయితే.. 040-66606064 నంబర్‌కు కాల్ చేయాలని తెలిపారు. ghiallost&found@gmrgroup.in మెయిల్ ద్వారా సైతం సందేహాలను తెలపవచ్చని పేర్కొన్నారు. SHARE IT
నల్గొండ జిల్లాలో గాంజయి, డ్రగ్స్ రవాణా, వినియోగం మీద ఉక్కుపాదం మోపుతున్నట్లు జిల్లా ఎస్పీ చందనా దీప్తి తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో యాంటీ నార్కోటిక్ బ్యూరో విడుదల చేసిన గంజాయి, కల్తీ కల్లుని నిర్మూలిద్దాం.. సమాజాన్ని కాపాడుదాం అనే పోస్టర్ అవిష్కరించారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ.. నిషేధిత మత్తు పదార్థాల వాడకం అనేది సమాజానికి పట్టిన చీడపీడ అన్నారు.
ఖమ్మం జిల్లాలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఆర్థిక సంవత్సరం తొలినాళ్లలోనే సాధ్యమైనంత మేర ఆస్తిపన్ను రాబట్టేలా అధికారులు ఏటా మాదిరిగా ఎర్లీ బర్డ్ పథకాన్ని తీసుకొచ్చారు. ఈ పథకం ద్వారా ఆస్తిపన్ను చెల్లిస్తే ఐదుశాతం రాయితీ లభించనుంది. అధికారులు ఈ పథకాన్ని ప్రారంభించగా, ఆర్థిక సంవత్సరం ప్రారంభం మొదటి రోజు నుండే పన్నుల వసూళ్లపై దృష్టి సారించారు. ఎర్లీ బర్డ్ ద్వారా ఈనెల 30 వరకు అవకాశం ఉందన్నారు.
జిల్లాలోని 1013 పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాల అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. మహిళా సంఘాలలోని సభ్యులతో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఆకమిటీ ఆద్వర్యంలో స్కూల్లో తాగునీరు, తరగతిగదుల్లో చిన్నచిన్న మరమ్మతులు, టాయిలెట్లు, విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు సమస్యలను గుర్తించాలన్నారు. ఆ కమిటీల ఆధ్వర్యంలో అన్ని మరమ్మతు పనులు చేయించాలని ఆదేశించారు.
HYDలో ఓ పోలీసు ఇన్‌స్పెక్టర్, ఓ ఎస్సై సస్పెండ్‌కు గురయ్యారు. రోడ్డు ప్రమాదం కేసులో విచారణ సరిగ్గా చేయలేదని లాలాగూడ ఇన్‌స్పెక్టర్ పద్మను సీపీ సస్పెండ్ చేశారు. కేసు విచారణలో ఉన్నతాధికారులను కూడా ఇన్‌స్పెక్టర్ తప్పుదోవ పట్టించారన్నారు. అలాగే అంబర్‌పేట్ ఎస్సై అశోక్‌ను సీపీ శ్రీనివాస్ రెడ్డి సస్పెండ్ చేశారు. చైన్ స్నాచింగ్ బాధితులను వేధించారని సీపీ తెలిపారు.

✓ఏప్రిల్ 6న తుక్కుగూడలో కాంగ్రెస్ బహిరంగ సభ
✓ఏప్రిల్ 13న చేవెళ్లలో BRS బహిరంగ సభ
✓చర్లపల్లి జైలుకు కల్వకుంట్ల కన్నారావు
✓మేడ్చల్, సికింద్రాబాద్ గాంధీ మెట్రో వద్ద మృతదేహాల కలకలం
✓OU:డిగ్రీ కోర్స్ రివాల్యూయేషన్ ఫలితాలు
✓BRS వాళ్లం కసి మీద ఉన్నాం: మల్లారెడ్డి
✓HYD: రూ.151లకే.. రాములవారి తలంబ్రాలు..!
✓మియాపూర్: మెట్రో డిపోలో ఫైర్ యాక్సిడెంట్
✓VKB: ఎన్నికల అధికారులకు ట్రైనింగ్
HYD బాగ్‌లింగంపల్లిలోని బస్ భవన్‌లో ASRTU ఆధ్వర్యంలో ప్రైజ్ రివిజన్ సబ్ కమిటీ మీటింగ్ జరిగింది. 18 రాష్ట్రాల ఆర్టీసీలకు చెందిన ఎక్స్‌పర్ట్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. బస్సుల విడిభాగాల ధరల నిర్ణయం, కొనుగోలు పాలసీ, కొత్త వెండర్ల నియామకం, తదితర అంశాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. బస్సుల విడిభాగాలకు చెందిన 15 గ్రూపులకు సంబంధించిన ధరలను నిర్ధారించారని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు.

ఫేక్ రూ.500 కరెన్సీ నోట్లు పట్టుబడ్డ ఘటన HYD ఈస్ట్ జోన్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. మొత్తం ఆరుగురు సభ్యుల గ్యాంగ్ కలిసి ఫేక్ కరెన్సీ నోట్లను ప్రింట్ చేసి, సర్కులేట్ చేస్తున్న విషయాన్ని తెలుసుకుని పక్కా ప్లాన్ ప్రకారం అరెస్టు చేశారు. వారి నుంచి రూ.36.35 లక్షల విలువ చేసే ఫేక్ నోట్స్ సీజ్ చేశారు. రూ.28,000 నగదు, ప్రింటింగ్ మెటీరియల్ సైతం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
Sorry, no posts matched your criteria.