India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు 154 అగ్ని ప్రమాద కేసులు విచారణ ప్రారంభం కాగా.. 71 కేసుల్లో జరిమానాలు, 56 కేసుల్లో న్యాయస్థానం మార్పులు చేసి సమర్పించాలని సూచించింది. 18 కేసులు వేర్వేరు కోర్టుల్లో పెండింగ్‌లో ఉండగా..9 కేసులను ఉపసంహరించుకున్నారు. HYD పరిధిలో 36 మందికి ఉల్లంఘన నోటీసులు, 31 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేసినట్టు వెబ్ సైట్‌లో పేర్కొన్నారు.

మోపాల్ మండలం నర్సింగ్‌పల్లి SRS గార్డెన్లో BRS కార్యకర్తల సన్నాహక సమావేశం నిర్వహించారు. MP అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ… అరవింద్, జీవన్ రెడ్డి దొందూ దొందే అని విమర్శించారు. వారిద్దరు నిజామాబాద్ జిల్లాకు చేసింది శూన్యమన్నారు. కాంగ్రెస్ నుంచి MLCగా ఉన్న జీవన్‌రెడ్డి ఒక్కరోజైనా మోపాల్ మండల ప్రజల మంచి, చెడు అడిగారా అని ప్రశ్నించారు. తనకు ఓటు వేసి గెలిపిస్తే అందుబాటులో ఉంటానన్నారు.
ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు అదృశ్యమయ్యాడు. ఎస్ఐ బాలరాజు తెలిపిన వివరాలు.. మెదక్ జిల్లా మాసాయిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న నాగరాజు 3 రోజులుగా కనిపించడం లేదు. చేగుంటలో నివాసం ఉంటూ రోజూ పాఠశాలకు వెళ్లి వస్తుంటాడు. 3 రోజులుగా పాఠశాలకు రాకపోవడంతో విషయాన్ని పాఠశాల ఉపాధ్యాయులు అతడి కుమారుడు వంశీధర్ దృష్టికి తీసుకెళ్లారు. ఇంట్లోనే ఫోన్లు, బైక్ వదిలి వెళ్లాడు. కేసు నమోదైంది.
ఉమ్మడి జిల్లాలో రోజురోజుకు ఎండ తీవ్రత ఎక్కువ అవుతుంది. ఈ నేపథ్యంలో వడదెబ్బ తగలకుండా ప్రజల్లో అవగాహన కల్పించాలని వైద్యాధికారులను సూర్యాపేట జిల్లా కలెక్టర్ వెంకట్రావు ఆదేశించారు. నేడు ఆత్మకూర్ పీహెచ్సీని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎండ తీవ్రతతో వడదెబ్బకు అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలన్నారు. పిహెచ్సీ పరిధిలోని గ్రామ ప్రజలకు వడదెబ్బ తగలకుండా ముందస్తు జాగ్రత్తలపై అవగాహన కల్పించాలన్నారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో 3,205 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. దాదాపుగా 70 శాతం పాఠశాలల్లో వాచ్మెన్లు లేరు. గతంలో ఉన్న వారు పదవీ విరమణ పొందగా, వీరి స్థానంలో కొత్త వారిని గత ప్రభుత్వం నియమించలేదు. కొద్ది రోజుల్లో పాఠశాలలకు వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. దీంతో ప్రభుత్వ బడుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. వీటన్నింటి నేపథ్యంలో కొన్ని చోట్ల పాఠశాలల పరిసరాలు అసాంఘిక కార్యకలాపాలకు నిలయాలుగా మారాయి.
ఎన్నడూ లేనివిధంగా ఏప్రిల్‌లోనే ఎండలు మోత మోగిస్తున్నాయి. ఉ.8 అయిందంటే చాలు బయటకు వెళ్లలేని పరిస్థితి. కానీ ఇది ఎన్నికల సీజన్ కావడంతో పోటీ చేసిన అభ్యర్థులు పార్టీ శ్రేణులకు ఎండలో తిరిగి ప్రచారం చేయడం తప్పడం లేదు. మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో ఇప్పటికే 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండ వేడితో ప్రచారంలో పాల్గొన్న వారు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
HYDలోని హిమాయత్‌నగర్, నారాయణగూడ, కాచిగూడ, అమీర్‌పేట్, ఉప్పల్, బాటసింగారం, హయత్‌నగర్ తదితర ప్రాంతాల్లో బస్ షెల్టర్లు అందుబాటులో లేవు. దీంతో వృద్ధులు, మహిళలు, చిన్నారులు, విద్యార్థులు 43 డిగ్రీలకు పైగా దంచి కొడుతున్న మండే ఎండలో నిలబడి అలసిపోతున్నారు. ఏర్పాటు చేసిన చోటే అధికంగా ఉండడంతో పలుచోట్ల ఖాళీగా దర్శనమిస్తున్నాయి. బస్ షెల్టర్లు అవసరమైన చోట ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.

HYD, RR, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో తూనీక కొలతల శాఖలో లైసెన్స్ హోల్డర్ల నియామకం అంతంత మాత్రంగానే జరుగుతుందనే ఆరోపణలు ఉన్నాయి. మూడు జిల్లాల్లో కలిపి మొత్తం 30 మందికి పైగా సిబ్బంది లేకపోవడం గమనార్హం. దీంతో తూనికలపై నగరంలోని అనేక చోట్ల తనిఖీలు కరవయ్యాయి. లైసెన్స్ లేకుండానే అనేక దుకాణాల్లో విచ్చలవిడిగా బరువు కొలిచే యంత్రాలను ఉపయోగిస్తున్నారని, వాటికి గ్యారంటీ ఏంటని వినియోగదారులు వాపోతున్నారు.
Sorry, no posts matched your criteria.