Telangana

News April 1, 2024

అసత్య ప్రచారాలపై చర్యలు తీసుకోవాలి: కొప్పుల

image

ఇటీవల సోషల్ మీడియాలో తనపై వస్తున్న అసత్య ప్రచారాలను పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఖండించారు. ఈ మేరకు రామగుండం సీపీ ఎం శ్రీనివాసులును కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో తనపై వస్తున్న అసత్య ప్రచారాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. ఆయన వెంట బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.

News April 1, 2024

ఫణిగిరిలో 2 వేల ఏళ్ల నాటి నాణేలు లభ్యం

image

సూర్యాపేట జిల్లాలో 2వేల సంవత్సరాల క్రితం నాటి నాణేలు బయటపడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తిరుమలగిరి మండలం ఫణిగిరిలో బౌద్ధ కళా ఖండాలుగా చెప్పబడుతున్న 3700 సీసపు నాణేలు పురావస్తు శాస్త్రవేత్తలు ఆదివారం వెలికి తీశారు. తవ్వకాలలో అనేక పలకలు, వ్యాసాలు, శాసనాలు, నాణేలు, లిఖిత పూర్వక స్తంభాలు బయటపడ్డాయి. 2015లో కూడా ఫణిగిరిలో 2వేల ఏళ్లనాటి బౌద్ధ అవశేషాలను పురావస్తు శాఖ వారు కనుగొన్నారు.

News April 1, 2024

శంకర్‌పల్లి: గుర్తు తెలియని మహిళ మృతి

image

గుర్తు తెలియని మహిళ మృతి చెందిన ఘటన శంకర్పల్లి PS పరిధిలో జరిగింది. సోమవారం CI తెలిపిన వివరాల ప్రకారం.. మున్సిపల్ పరిధి రామంతాపూర్‌లో గౌండ్ల పాండు గౌడ్ టిఫిన్ సెంటర్ వద్ద ఓ మహిళ(55) మృతదేహం లభ్యమైంది. మహిళ ఒంటిపై ఆరెంజ్ క్రీమ్ కలర్ చీర, బ్లూ కలర్ జాకెట్ ఉన్నాయి. ఆహారం దొరకక, ఎండ తీవ్రత వల్ల వడదెబ్బ తగిలి మహిళ చనిపోయిందని అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

News April 1, 2024

HYD: గడిచిన 24 గంటల్లో రూ.9,54,200 సీజ్

image

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నియమావళి అమలులో భాగంగా జిల్లాలో ఇప్పటి వరకు రూ.3,28,66,780 నగదు పట్టుకొని సీజ్ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ తెలిపారు. దీంతో పాటు 18,752.83 లీటర్ల మద్యం పట్టుకొని 122 కేసులు నమోదు చేశామన్నారు. 2144 లైసెన్స్ గల ఆయుధాలను డిపాజిట్ చేసినట్లు వివరించారు. గడిచిన 24 గంటల్లో మొత్తం రూ.9,54,200 పట్టుకొని సీజ్ చేసినట్లు పేర్కొన్నారు.

News April 1, 2024

ఉమ్మడి జిల్లాలో ఉపాధ్యాయులకు టెట్ టెన్షన్

image

ప్రభుత్వ టీచర్లకు టెట్ ఫీవర్ పట్టుకుంది. టీచర్ ఎలిజిబిలీటీ టెస్ట్ పాస్ అయితేనే ప్రమోషన్ అని గత సంవత్సరం హైకోర్ట్ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో గతంలో పదోన్నతుల ప్రక్రియ వాయిదా పడింది. ప్రస్తుతం టెట్ నోటిఫికేషన్ విడుదలైంది. గత నోటిఫికేషన్లకు భిన్నంగా.. ఈసారి దరఖాస్తులో టీచర్లకు ప్రత్యేకంగా కాలం పెట్టీ వారి వివరాలు కూడా అడుగుతుంది. ప్రమోషన్లకు లైన్లో టీచర్లు మళ్లీ రంగంలోకి దిగుతున్నారు.

News April 1, 2024

హైదరాబాద్‌లో కేటుగాళ్ల కొత్త మోసం ఇదే..!

image

HYDలో డబుల్ బెడ్ రూమ్ అర్హులను లక్ష్యంగా చేసుకుని సరికొత్త మోసానికి సైబర్ నేరగాళ్లు తెరలేపారు. డబుల్ బెడ్ రూమ్ పట్టాలు పొందిన లబ్ధిదారులను గుర్తించి వారికి ఫోన్ చేసి రూ.1,250 ఆన్‌లైన్‌లో చెల్లిస్తే కరెంట్, నీటి సదుపాయాలు కల్పించి ఇళ్లలోకి వెళ్లడానికి సిద్ధం చేస్తామన్నారు. గృహ ప్రవేశం సమయంలో తిరిగి మీ నగదు వాపస్ చేస్తామని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని, జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు.

MNCL: ఈనెల 3 నుంచి పదవ తరగతి మూల్యాంకనం

image

మంచిర్యాలలోని కార్మెల్ కాన్వెంట్ హైస్కూల్‌లో ఈ నెల 3 నుంచి 11 వరకు పదవ తరగతి పరీక్ష పత్రాల మూల్యాంకనం నిర్వహించనున్నట్లు డీఈవో యాదయ్య తెలిపారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగే మూల్యాంకనం నిర్వహణకు ఏడుగురు అసిస్టెంట్ క్యాంపు ఆఫీసర్స్, చీఫ్ ఎగ్జామినర్స్, అసిస్టెంట్ ఎగ్జామినర్స్, స్కూల్ అసిస్టెంట్లను నియమించినట్లు పేర్కొన్నారు. మూల్యాంకన కేంద్రంలో సెల్ ఫోన్లు వాడవద్దని సూచించారు.

News April 1, 2024

HYD: గడిచిన 24 గంటల్లో రూ.9,54,200 సీజ్

image

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నియమావళి అమలులో భాగంగా జిల్లాలో ఇప్పటి వరకు రూ.3,28,66,780 నగదు పట్టుకొని సీజ్ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ తెలిపారు. దీంతో పాటు 18,752.83 లీటర్ల మద్యం పట్టుకొని 122 కేసులు నమోదు చేశామన్నారు. 2144 లైసెన్స్ గల ఆయుధాలను డిపాజిట్ చేసినట్లు వివరించారు. గడిచిన 24 గంటల్లో మొత్తం రూ.9,54,200 పట్టుకొని సీజ్ చేసినట్లు పేర్కొన్నారు.

News April 1, 2024

పెబ్బేరు మార్కెట్ యార్డులో భారీ అగ్ని ప్రమాదం

image

వనపర్తి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పెబ్బేరులోని మార్కెట్ యార్డు గోదాంలో మంటలు చలరేగి గన్నీ సంచులు దగ్ధం అయ్యాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మూడు ఫైర్‌ఇంజన్లతో మంటలు ఆర్పుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

error: Content is protected !!