India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జిల్లా కేంద్రంలోని గ్రంథాలయం, స్టడీ సర్కిల్స్ అభ్యర్థులతో కిటకిటలాడుతున్నాయి. ఉదయం 7 గంటలకే గ్రంథాలయం అభ్యర్థులతో నిండిపోతోంది. వరుసగా నోటిఫికేషన్లు రావడంతో జిల్లాలోని నిరుద్యోగులు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. ఉద్యోగాలు దక్కించుకునేందుకు ప్రణాళికబద్ధంగా చదువుతున్నారు. బీసీ స్టడీ సర్కిల్, ఎస్సీ స్టడీ సర్కిల్స్‌లో శిక్షణ తీసుకుంటున్నారు.
కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన ఓ జర్నలిస్టు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హైదరాబాద్ నగరంలోని బోరబండ ప్రాంతంలో ఈటీవీ రిపోర్టర్‌గా పని చేస్తున్న రఘు కుటుంబ కలహాలతో నేడు ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియ రాలేదు. జర్నలిస్టు మృతితో ఆయా సంఘాల నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
పేదలకు బ్యాంక్ ఖాతాలు ఎందుకని హేళన చేశారని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం పేదలు దాదాపు రూ.2 లక్షల కోట్లు పొదుపు చేశారని తెలిపారు. గతంలో నిరర్ధక ఆస్తులు చాలా ఉండేవని, బీజేపీ ప్రభుత్వం వచ్చాక 55 కోట్ల కొత్త బ్యాంకు ఖాతాలు ఇచ్చామని తెలిపారు.
కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలో దండబోయిన మణేమ్మ (40) అనే అంగన్వాడీ ఆయా అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. భర్తనే హత్య చేసి ఉంటారని మృతురాలి బంధువుల ఆరోపిస్తున్నారు. ఈ మేరకు రామారెడ్డి పోలీసులకి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఆత్మహత్యనా..? హత్యనా అనే కోణంలో పోలిసులు విచారణ చేపట్టారు. మణెమ్మ మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం సోమవారం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సీతక్క మాట్లాడుతూ.. అభివృద్ధి చేసే కాంగ్రెస్ పార్టీని ఆదరించాలన్నారు. ఆదివాసి ఆడబిడ్డ ఆత్రం సుగుణను పార్లమెంటుకు పంపాలని ప్రజలను కోరారు. మతతత్వ రాజకీయాలు చేసి బీజేపీ ని ఓడించాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్, నియోజకవర్గ ఇంఛార్జ్ ఆడే గజేందర్ తదితరులున్నారు.
మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం నర్సాపూర్ సమీపంలోని వాగులో సోమవారం గుర్తు తెలియని మృతదేహం లభ్యం అయింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తాండూర్ మండలం నర్సాపూర్ సమీపంలోని చెక్ పోస్ట్ సమీపంలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం అయినట్లు తెలిపారు. మృతదేహాన్ని స్థానిక పోలీసులు బయటకు తీసినట్లు సమాచారం. మృతదేహానికి సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది.
అడ్డాకుల మండలం శాగాపూర్ గ్రామంలో ఉపాధి హామీ పనుల నిమిత్తం కూలీలు గ్రామ శివారు కందూర్ స్టేజ్ దగ్గరకు కరువు పనులకు వెళ్లారు. పనులు పూర్తయిన వెంటనే దాదాపు 12:30కు ఉచిత బస్సు ప్రయాణం ఆలోచన వచ్చింది. ఇంతలో మహబూబ్‌నగర్ నుంచి వనపర్తికి వెళ్లే పల్లెవెలుగు బస్సు కందూర్ స్టేజ్ దగ్గర ఆపడంతో గ్రామానికి చెందిన ఉపాధి కూలీలు బస్సు ఎక్కారు.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జీఆర్పీ, RPF పోలీసులు కలిసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో చేపట్టిన తనిఖీల్లో రూ.37.50 లక్షల నగదు పట్టుబడింది. పోలీసులు తెలిపిన వివరాలు.. తమిళనాడుకు చెందిన లక్ష్మణ్ రామ్ బ్యాగులో నగదు గుర్తించిన పోలీసులు సరైన పత్రాలు లేకపోవడంతో సీజ్ చేసినట్లు తెలిపారు. ఆదాయ శాఖ అధికారులకు నగదు అప్పజెప్పినట్లు GRP ఇన్‌స్పెక్టర్ సాయి ఈశ్వర్ గౌడ్ పేర్కొన్నారు.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జీఆర్పీ, RPF పోలీసులు కలిసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో చేపట్టిన తనిఖీల్లో రూ.37.50 లక్షల నగదు పట్టుబడింది. పోలీసులు తెలిపిన వివరాలు.. తమిళనాడుకు చెందిన లక్ష్మణ్ రామ్ బ్యాగులో నగదు గుర్తించిన పోలీసులు సరైన పత్రాలు లేకపోవడంతో సీజ్ చేసినట్లు తెలిపారు. ఆదాయ శాఖ అధికారులకు నగదు అప్పజెప్పినట్లు GRP ఇన్‌స్పెక్టర్ సాయి ఈశ్వర్ గౌడ్ పేర్కొన్నారు.
వరంగల్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో వేసవి వడగాల్పులు, వడదెబ్బ బారిన పడకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తల గురించి సోమవారం జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..రానున్న 2 నెలల పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని..ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా తగుజాగ్రత్తలు తీసుకునేలా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం గోడప్రతులను ఆవిష్కరించారు.
Sorry, no posts matched your criteria.