India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

వర్గల్ మండల కేంద్రంలోని శంభుగిరి కొండలపై రంగు అక్షరాల్లో శాసనం వెలుగు చూసింది. కొత్త తెలంగాణ చరిత్ర బృందానికి చెందిన శ్రీ రామోజీ హరగోపాల్, వేముగంటి మురళీకృష్ణలు దీనిని గుర్తించారు. ఈ శాసనం లిఖించిన గుహను దేవాలయ సిబ్బంది స్టోర్ రూం తరహాలో వినియోగిస్తున్నారు. శాసనంలోని చాలా భాగం చెదిరి కొన్ని పదాలు మాత్రమే మిగిలాయని హరగోపాల్ తెలిపారు. అక్షరాలు వరగంటి, స్వస్తిశ్రీ, మల్ల, కల్గిని కనిపిస్తున్నాయి.

నేటి నుంచి ప్రారంభంకానున్న “స్వచ్ఛదనం-పచ్చదనం” కార్యక్రమంపై ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్లు ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ✒ఈనెల 5న ప్రజలకు “స్వచ్ఛదనం-పచ్చదనం” కార్యక్రమంపై అవగాహన✒ప్రభుత్వ కార్యాలయాలు,కూడళ్లు,రోడ్లను శుభ్రం చేయడం✒మరుగుదొడ్లు లేని ఇళ్లను గుర్తించడం✒వ్యక్తిగత మరుగుదొడ్ల వాడకంపై ప్రజలకు అవగాహన✒చెత్త సేకరించి వాహనాలకు జీపీఎస్ వ్యవస్థ అమలు చేయడం తదితర పనులు చేపట్టనున్నారు.

వనపర్తి జిల్లా మదనాపురం మండలం శంకరమ్మపేట వద్ద ఊకచెట్టు వాగుపై ఉన్న సరళ సాగర్ ప్రాజెక్టును 1959లో నిర్మించారు. అప్పట్లో దీనిని 22 అడుగుల పూర్తిస్థాయి నీటిమట్టంతో రూపొందించారు. ఆసియా ఖండంలోనే ఆటోమేటిక్ సైఫన్ సిస్టం కలిగిన ప్రాజెక్టులో సరళ సాగర్ 2వదిగా చరిత్రలో నిలిచింది. ఈ ప్రాజెక్టులో నీరు నిండిన వెంటనే ఆటోమేటిక్‌గా సైఫన్స్ తెరుచుకోడం, వరద ఉద్ధృతి తగ్గగానే మూసుకోవడం దీనీ ప్రత్యేకతలు.

జిల్లాలోని కౌలాస్ నాల ప్రాజెక్ట్ ప్రస్తుత నీటి మట్టం 454.70 మీటర్లుగా నీటి నిల్వ సామర్థ్యం 0.580 టీఎంసీలుగా ఉంది. నిజాంసాగర్ ప్రాజెక్ట్ ప్రస్తుత నీటి మట్టం 1,389.55 అడుగులుగా నీటి నిల్వ సామర్థ్యం 3.866 టీఎంసీలుగా ఉంది. కల్యాణి ప్రాజెక్ట్ నీటి మట్టం 409.50 మీటర్లు కాగా ప్రస్తుతం 406.80 మీటర్లుగా ఉంది. ఇక సింగీతం రిజర్వాయర్ నీటి మట్టం 416.550 మీటర్లకు గాను ప్రస్తుతం 416.400 మీటర్లుగా ఉంది.

ఓపెన్ స్కూల్ పది, ఇంటర్మీడియట్ అడ్మిషన్లు ఈనెల 8 నుంచి సెప్టెంబర్ 10వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు డీఈఓ వెంకటేశ్వర్లు ఆదివారం తెలిపారు. చదువు మధ్యలో మానేసిన వారు ఓపెన్ స్కూల్ విధానంలో చదువుకోవచ్చని పేర్కొన్నారు. పదవ తరగతి చదివిన వారు ఇంటర్మీడియట్లో చేరేందుకు అర్హులని చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

చదువుకున్న నిరుద్యోగ యువతీ, యువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకుగాను NLGలో నైపుణ్యాల అభివృద్ధి సంస్థను నిర్మిస్తున్నట్లు రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన నల్గొండలోని తన క్యాంపు కార్యాలయం సమీపంలో ఉన్న మున్సిపల్ పార్కులో న్యాక్ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన 30 మంది మహిళలకు ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా ఉచిత కుట్టు మిషన్లను పంపిణీ చేశారు.

HYD నగరంలో నవంబర్ నెలలో అంబర్పేట వంతెనను ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నామని R&B మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఓఆర్ఆర్ కట్టింది కాబట్టే ఐటీ కంపెనీలు HYD ప్రాంతానికి వచ్చాయన్నారు. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులను నవంబర్ నెలలో ప్రారంభించి 18 నుంచి 20 నెలల్లో పూర్తి చేసేందుకు ప్రయత్నాలు చేస్తామన్నారు.

HYD నగరంలో నవంబర్ నెలలో అంబర్పేట వంతెనను ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నామని R&B మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఓఆర్ఆర్ కట్టింది కాబట్టే ఐటీ కంపెనీలు HYD ప్రాంతానికి వచ్చాయన్నారు. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులను నవంబర్ నెలలో ప్రారంభించి 18 నుంచి 20 నెలల్లో పూర్తి చేసేందుకు ప్రయత్నాలు చేస్తామన్నారు.

జగిత్యాల జిల్లాలోని సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఆదివారం రూ.1,46,430 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.80,532, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.42,830, అన్నదానం రూ.23,068, వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు.

ఖమ్మం: రైతుల భూములను ఆక్రమించుకునే వారిని వదలొద్దని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పోలీస్ కమిషనర్ సునీల్ దత్ కు సూచించారు. ఆదివారం పోలీస్ కమిషనర్‌తో మంత్రి సమావేశమై శాంతి భద్రతలపై చర్చించారు. జిల్లాలో గంజాయి విక్రయాలు.. వాడకంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. వారిపై ఉక్కుపాదం మోపాలని పేర్కొన్నారు. గంజాయి మూలంగా యువత పెడదోవ పడతున్నారని దీన్ని అంతమొందించేందుకు తగిన చర్యలు చేపట్టాలన్నారు.
Sorry, no posts matched your criteria.