India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నెల రోజుల్లో BSNL సేవలు ప్రారంభిస్తామని టెలికాం GM వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రైవేటు కంపెనీల్లో ఛార్జీలు పెరగడంతో ప్రజలు BSNL వైపు మొగ్గుచూపుతున్నట్లు పేర్కొన్నారు. కాగా జిల్లాలో ఇప్పటివరకు 270 టవర్లను 4Gకి మార్చనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే కొన్ని టవర్లు పూర్తికాగా మరికొన్నింటి పనులు కొనసాగుతున్నాయి.

ఉమ్మడి జిల్లాలో పలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 24 గంటల వైద్య సేవలు ముచ్చటగానే మిగులుతున్నాయి. 24 గంటలు సేవలు అందించాల్సి ఉండగా వైద్యులు సిబ్బంది కొరత వల్ల సమయం కుదించారు. రోజు సాయంత్రం 6 గంటలకే ఆసుపత్రిని మూసి వేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో అత్యవసర సమయంలో రోగులు పట్టణాల్లోని ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరుతున్నారు.

జిల్లా వ్యాప్తంగా సుమారు 3 వేల మంది రైతులకు మొదటి విడత రుణమాఫీ కాలేదు. రాష్ట్ర అధికారుల సూచన మేరకు జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ సెల్‌కు 3 వేల మంది రైతులు దరఖాస్తులు చేసుకున్నారు. అందులో 1,800 మంది రైతుల ఆధార్ నంబర్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక పోర్టల్లో నమోదు చేసి వారికి రుణమాఫీ ఎందుకు కాలేదో తెలియజేసి చేతులు దులుపుకున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.

గిఫ్ట్ వోచర్ పేరుతో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి రూ.లక్షలు పోగొట్టుకున్నాడు. అమీన్‌పూర్ పోలీసుల వివరాలు.. సాయి భగవాన్ కాలనీకి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి జులై 17న యాపిల్ ప్లే స్టోర్‌లో గిఫ్ట్ వోచర్లు కొనుగోలు చేస్తే నగదు రెట్టింపొస్తాయని మెసేజ్ వచ్చింది. నమ్మిన బాధితుడు రూ.2.50లక్షలు ఇన్వెస్ట్ చేశాడు. అసలు, రెట్టింపు డబ్బు ఇవ్వాలని అడగ్గా అపరిచిత వ్యక్తి స్పందించ లేదు. పోలీసులను ఆశ్రయించాడు.

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో వరుస సెలవుల అనంతరం మంగళవారం క్రయవిక్రయాలు ప్రారంభమయ్యాయి. ఈరోజు క్వింటా ఏసీ మిర్చి ధర రూ.19,400 జెండా పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. గత వారం మిర్చి ధర రూ.19,300 ఉండగా ఈరోజు రూ.100 పెరిగినట్లు వ్యాపారస్థులు తెలిపారు. రైతుల తమ సరుకు మార్కెట్ తరలించే సమయంలో జాగ్రత్తలు పాటించాలని పేర్కొన్నారు.

కొడుకును పోలీసులు తీసుకెళ్తాన్నారనే భయంతో ఓ తల్లి గుండె ఆగిపోయింది. స్థానికుల కథనం ప్రకారం.. కొత్తగూడెం రామవరం 6వ వార్డులో కొందరు యువకులు మద్యం తాగుతున్నారు. అదే సమయంలో పెట్రోలింగ్‌కి వచ్చిన పోలీసు సిబ్బంది సంజయ్, అతడి స్నేహితులను తీసుకెళ్తున్నారు. అందులో చంద్రకళ కొడుకును చూసి తీవ్ర అస్వస్థతకు గురై కుప్పకూలింది. బంధువులు, స్థానికులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందింది.

పోచంపల్లి: 13 అడుగుల పొడవైన జుట్టుతో లక్ష్మణాచారి అందరినీ ఆకర్షిస్తున్నాడు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం దేశ్‌ముఖి గ్రామానికి చెందిన గుండోజు లక్ష్మణాచారి(72) వీరభద్ర స్వామి తన 18వ ఏట వీరభద్ర స్వామి కలలో కనిపించాడు. దీంతో జుట్టు కత్తిరించుకోకుండా దేవుడికి అర్పించినట్లు లక్ష్మణాచారి తెలిపారు.

ధార్ గ్యాంగ్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఘట్‌కేసర్ క్రైమ్ ఎస్ఐ అశోక్ సూచించారు. హైదరాబాద్ నగరంలో ధార్ గ్యాంగ్ కదలికలు కనిపించాయని పేర్కొన్నారు. రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులపై అనుమానం వస్తే ఫోన్ చేయాలని కోరారు. స్థానిక పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ఇటీవల హైదరాబాద్‌లో ధార్ గ్యాంగ్ పలు చోట్ల చోరీలకు పాల్పడిన విషయం విదితమే.

ధార్ గ్యాంగ్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఘట్‌కేసర్ క్రైమ్ ఎస్ఐ అశోక్ సూచించారు. హైదరాబాద్ నగరంలో ధార్ గ్యాంగ్ కదలికలు కనిపించాయని పేర్కొన్నారు. రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులపై అనుమానం వస్తే ఫోన్ చేయాలని కోరారు. స్థానిక పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ఇటీవల హైదరాబాద్‌లో ధార్ గ్యాంగ్ పలు చోట్ల చోరీలకు పాల్పడిన విషయం విదితమే.

CM రేవంత్ రెడ్డి ఆదేశాలతో పంచాయతీ ఎన్నికలపై అధికార యంత్రాంగం కార్యాచరణ ప్రారంభించింది. ఇందుకోసం ఉమ్మడి KNR జిల్లాకు వచ్చే నెల 2న వార్డుల మ్యాపింగ్, ఓటరు జాబితా తయారీపై కంప్యూటర్ ఆపరేటర్లకు శిక్షణ ఇవ్వనున్నారు. జగిత్యాలలో 380, పెద్దపల్లి 265, KNR 313, సిరిసిల్ల 255.. ఉమ్మడి జిల్లాలోని 1,213 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. కాగా, ప్రతి జిల్లా నుంచి 5 ఆపరేటర్లు శిక్షణలో పాల్గొననున్నారు.
Sorry, no posts matched your criteria.