India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసించే పేద విద్యార్థులకు భారత సేవాశ్రమ సంఘం ఉచిత నోట్ పుస్తకాలను పంపిణీ చేయటం సంతోషకరమని నల్గొండ జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన భారత సేవాశ్రమ సంఘం ఆధ్వర్యంలో నల్గొండ మండలంలోని కతాల్ గూడ ప్రాథమిక పాఠశాలలో నోట్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారి బిక్షపతి, మునీశ్వరానంద స్వామి, ఎంఈఓ కే.ఆరుంధతి తదితరులు పాల్గొన్నారు.

కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే రైతు రుణమాఫీపై అసెంబ్లీలో మాట్లాడారు. రెండో విడత రుణమాఫీ చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. మూడో విడత కూడా పూర్తి చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు. పాడి సేకరణ సరైన పద్దతిలో జరగడం లేదన్న కేవీఆర్..అందుకు చర్యలు చేపట్టాలని కోరారు.

ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలో విషాదం నెలకొంది. విద్యుత్ షాక్ తో ఓ విద్యార్థి మృతి చెందాడు. గురిజ గ్రామానికి చెందిన 18 ఏళ్ల కార్తిక్ మంగళవారం తన బావ వ్యవసాయ పొలానికి వెళ్లాడు. అయితే అక్కడ ఇనుప కంచెను పట్టుకోవడంతో విద్యుత్ షాక్ తగిలి కింద పడిపోయాడు. వెంటనే స్థానికులు రిమ్స్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోని మృతి చెందాడు. మృతుడు ఇటీవలే పదవ తరగతి పూర్తి చేశాడు. ఘటనతో విషాదం నెలకొంది.

ములుగు జిల్లాలో భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు (JMWP) డివిజన్ కమిటీ కార్యదర్శి వెంకటేశ్ పేరుతో మావోయిస్టు లేక కలకలం సృష్టిస్తోంది. ఏటూరు నాగారం- మహాదేవపూర్ దళంలోని జైసింగ్, రమేశ్, సుక్కి అనే ముగ్గురిని చర్లలో పోలీసులు పట్టుకున్నారని లేఖలో పేర్కొన్నారు. వారిని చిత్రహింసలు పెట్టి, ఎన్కౌంటర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. వారికి ఏం జరిగినా కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు రుణమాఫీ- 2024 మలివిడత నిధుల విడుదల కార్యక్రమం మంగళవారం పండుగ వాతావరణంలో జరిగింది. ఈ మేరకు నిజామాబాద్ కలెక్టరేట్లో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధ్యక్షతన లబ్దిదారులైన రైతులు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

క్షేత్రస్థాయిలో రైతులకు రుణమాఫీ విషయంలో ఇబ్బందులు ఉంటే, వాటిని పరిష్కరించేందుకు వీలుగా జిల్లా స్థాయిలో సహాయక కేంద్రాన్ని ఏర్పాటు చేశామని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. సహాయక కేంద్రాన్ని సంప్రదించేందుకు వీలుపడని రైతులు నేరుగా 7288894557, 7288894554 నెంబర్లకు ఫోన్ చేసి తమ సమస్యలను పరిష్కరించుకోవచ్చని కలెక్టర్ సూచించారు.

రాహుల్ గాంధీ వరంగల్ డిక్లరేషన్ సభలో రైతులకు ఇచ్చిన మాటను సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మాట నిలబెట్టుకుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలో రూ.1 లక్ష 50 వేల వరకు 9211 మంది రైతులు రుణమాఫీ పొందారని పేర్కొన్నారు. రుణమాఫీ కింద హుస్నాబాద్ నియోజకవర్గానికి 93 కోట్ల 89 లక్షల ఆర్థిక సాయం అందిందని తెలిపారు.

MBNRరీజియన్ లోని పది డిపోల పరిధిలో ప్రతిరోజూ 3.25లక్షల KM మేర RTC బస్సులు తిప్పుతున్నామని, ‘మహాలక్ష్మి’తో ఆక్యుపెన్సీ పెరిగిందని ఆర్ఎం శ్రీదేవి తెలిపారు. గత డిసెంబర్ 9కి ముందు 2.60 లక్షల మంది ప్రయాణికులు బస్సుల్లో రాకపోకలు సాగించేవారని, మహాలక్ష్మి పెట్టిన తర్వాత 4.40 లక్షల మందికి పెరిగారన్నారు. జీరో టిక్కెట్ లతో 2.80 లక్షల మంది (55%),టిక్కెట్ చెల్లించే వారు 1.60 లక్షల మంది (45%) ఉన్నారన్నారు.

ఎన్నికల సందర్భంగా రైతులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఈరోజు అసెంబ్లీ ప్రాంగణంలో రుణమాఫీ రెండో విడత విడుదల చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. రైతుల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పార్టీ పాటుపడుతుందని తెలిపారు. ఏ రైతు కూడా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవద్దు అనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందని చెప్పారు.

విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు కామ ముసుగులో దారుణానికి పాల్పడ్డాడు. వివరాల్లోకెళ్తే.. ఇల్లందు పట్టణంలోని గిరిజన వసతి గృహంలో 9వ తరగతి చదువుతున్న బాలికను ఓ ఉపాధ్యాయుడు వేధిస్తున్నాడు. ఈ విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో మంగళవారం సదరు ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించడంతో ఉపాధ్యాయుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Sorry, no posts matched your criteria.