India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కొడుకును తల్లి హత్య చేసిన ఘటన సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డిలో జరిగినట్లు CI సంతోశ్ తెలిపారు. గ్రామానికి చెందిన సాయిలు మార్చి 24న హత్యకు గురైన విషయం తెలిసిందే. జల్సాలకు బానిసైన సాయిలు 7 పెళ్లిళ్లు చేసుకొని భార్యలను వదిలేశాడు. ఈక్రమంలో మద్యానికి బానిసై తల్లి లచ్చవ్వను రోజు వేధించేవాడు. అది సహించలేని లచ్చవ్వ మనుమడు దేవ్, మారుతితో కలిసి అతడి మెడకు టవల్ బిగించి హత్యచేసినట్లు CI వెల్లడించారు.
మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం దామరంచ శివారులోని ఓ పౌల్ట్రీ ఫామ్‌లో వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. గ్రామానికి చెందిన రవి అనే వ్యక్తి తన వ్యవసాయ పొలం వద్ద కోళ్ల ఫారం నిర్వహిస్తున్నారు. ఆదివారం పౌల్ట్రీ ఫామ్‌కు వెళ్లిన రవి అక్కడ ఉరివేసుకొని మృతిచెంది ఉన్నారు. కాగా బంధువులు రవి మృతిపై అనుమానం వ్యక్తం చేయడంతో కేసు నమోదు చేసిన వెల్దుర్తి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఉమ్మడి జిల్లాలో దాదాపు 1500 గ్రామాల్లో తాగునీటి సమస్య ఏర్పడనున్నట్లు అధికారులు ముందస్తుగా గుర్తించారు. నల్గొండ జిల్లాలో 788, సూర్యాపేటలో 412, యాదాద్రి భువనగిరిలో 300 ఆవాసాల్లో తాగు నీటి సమస్యలు ఏర్పడే అవకాశం ఉందని అధికారులు ముందస్తు ప్రణాళికలో గుర్తించారు. ఆయా గ్రామాల్లో ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో తాగునీటి ఎద్దడి నివారణ పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
గోవిందరావుపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక(14) ఆత్మహత్య చేసుకుంది. పస్రా ఎస్ఐ కమలాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. బాలికను చల్వాయి గ్రామానికి చెందిన చింటు ప్రేమ పేరుతో వేధిస్తూ, పెళ్లి చేసుకోవాలని ఇబ్బందులకు గురి చేశాడు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన బాలిక గురువారం పురుగు మందు తాగింది. గుర్తించిన కుటుంబ సభ్యులు ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.
జీహెచ్‌ఎంసీలో పారిశుద్ధ్యం, ఎంటమాలజీ విభాగాల్లో అక్రమాలకు శాశ్వత చెక్ పెడుతూ సరికొత్త విధానాన్ని తెరపైకి తెచ్చారు. కార్మికుల అటెండెన్స్‌లో ప్రస్తుతం అమలవుతున్న ఫింగర్ ప్రింట్ బయోమెట్రిక్ హాజరును నేటి నుంచి నిలిపివేయనున్నారు. సోమవారం నుంచి అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ సిస్టంను అమలు చేయనున్నారు.

బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన బోరబండ PSపరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. జూబ్లీహిల్స్ పరిధి రహమత్‌నగర్ వాసి లక్ష్మణ్ బాబు డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. ఈక్రమంలో ఓ బాలికను కొన్నాళ్లుగా ప్రేమిస్తున్నానంటూ వెంట తిరిగాడు. ఆమెకు మాయమాటలు చెప్పి ఇతర ప్రాంతానికి తీసుకెళ్లి రూమ్‌లో పలుమార్లు అత్యాచారం చేశాడు. బాలిక కుటుంబసభ్యులు PSలో ఫిర్యాదు చేశారు.

లోక్‌సభ ఎన్నికల నిర్వహణ కోసం ప్రిసైడింగ్ ఆఫీసర్ (పీఓ), అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ (ఏపీఓ)లకు సోమ,మంగళవారాల్లో శిక్షణ తరగతులను నిర్వహించనున్నట్టు HYD ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ తెలిపారు. ఒక్కో విడతలో 50 మంది చొప్పున అధికారులకు శిక్షణ ఉంటుందన్నారు. శిక్షణకు వచ్చే వారు పోస్టల్ బ్యాలెట్ కోసం ఓటర్ గుర్తింపు కార్డు నంబర్, ఓటర్ జాబితాలో పార్ట్/సీరియల్ నంబర్ వివరాలు తీసుకురావాలని సూచించారు.

Sorry, no posts matched your criteria.