India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

డీజీపీ జితేందర్ రెడ్డి అధ్యక్షతన HYD నగరంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. లా అండ్ ఆర్డర్ పకడ్బందీగా అమలు చేయాలని, ప్రజలకు రక్షణ, భద్రత కల్పించడమే ధ్యేయంగా ముందుకు వెళ్లాలని డీజీపీ సూచించినట్లు రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు. ఈ సమావేశంలో సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి, ఇంటెలిజెన్స్ ఏడీజీపీ శివధర్ రెడ్డి పాల్గొన్నారు.

HYD కూకట్‌పల్లిలోని JNTUలో జరుగుతున్న PHD పరీక్షలు సోమవారంతో ముగిశాయి. రెండు రోజుల్లో కలిపి మొత్తం 675 మంది పరీక్ష రాశారు. మొత్తం 930 మంది దరఖాస్తు చేసుకోగా ఇందులో 72.58 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. రెండోరోజు ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో కలిపి 400 మంది పరీక్ష రాసినట్లు వర్సిటీ ప్రవేశాల విభాగం డైరెక్టర్ డాక్టర్ కృష్ణమోహన్‌రావు చెప్పారు. నిబంధనలను అనుసరించి పరీక్ష జరిగేలా చర్యలు తీసుకున్నారు.

ఇటీవల కురుస్తున్న వర్షాలకు మోపాల్‌లోని మంచిప్ప పెద్దచెరువు నిండింది. ఈ చెరువుపై 14 గ్రామాలు ఆధారపడి ఉన్నాయి. ఏటా పెద్ద చెరువు నిండి అలుగులు పారితే ముదక్‌పల్లి, కులాస్‌పూర్ చెరువుల్లోకి అక్కణ్నుంచి వడ్డెర కాలనీ, నర్సింగ్‌పల్లి, మోపాల్, సిర్పూర్, న్యాలకల్, ధర్మారం, మల్లారం, తదితర ప్రాంతాలకు వెళుతుంది. పెద్దచెరువు నీరు నర్సింగ్‌పల్లి ఫిల్టర్ బెడ్ శుద్ధి అయిన తర్వాత గాజుల్‌పేట్ ట్యాంకులోకి వెళ్తుంది.

కేంద్రబడ్జెట్, రాష్ట్ర శాసనసభ సమావేశాలు నేడు షురూ అయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడి జిల్లాకు ఒనగూరే ప్రయోజనాలపై ఈ ప్రాంతవాసులు ఆశగా ఎదురు చూస్తున్నారు. కేంద్రబడ్జెట్లో భాగంగా జిల్లాకు దక్కేవరాల ప్రకటనపైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోపక్క నేటినుంచి ప్రారంభమైన రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో నియోజకవర్గ సమస్యలను ప్రస్తావిస్తామని ఈ ప్రాంత ఎమ్మెల్యేలు పేర్కొన్నారు.

ఈరోజు ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పాల్గొనబోతున్నారు. ఇందులో భాగంగా గన్ పార్కు వద్ద ఉన్న తెలంగాణ అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించి, అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీశ్ రావు, వివేకానంద తదితరులు హాజరుకానున్నారు. ఈరోజు అసెంబ్లీ సమావేశంలో లాస్య నందిత మృతిపై సంతాపం తెలపనున్నారు.

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఈరోజు పత్తి ధర స్వల్పంగా పెరిగింది. సోమవారం క్వింటా పత్తి ధర రూ.7,150 పలకగా.. నేడు రూ.7,180 పలికింది. అంతర్జాతీయ మార్కెట్లో పత్తికి ఉన్న డిమాండ్‌ను బట్టి మార్కెట్ ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. మార్కెట్లో కొనుగోళ్ల ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది.

గుర్రం తన్నడంతో తీవ్రంగా గాయపడిన యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. HYD పాతబస్తీ పరిధి శాలిబండ PS ఇన్‌స్పెక్టర్ తెలిపిన వివరాలు.. చాంద్రాయణగుట్ట వాసి ఇబ్రాహీం(17) ఈనెల 17న మొహర్రం ఊరేగింపు తిలకించడానికి ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఇంజిన్ బౌలి ప్రాంతంలో గుర్రాలు వెళుతుండగా వాటి వెనుక పరిగెత్తాడు. ఒక గుర్రం తన్నడంతో అతడు గాయపడ్డాడు. ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందాడు. కేసు నమోదైంది.

Sorry, no posts matched your criteria.