India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పంటలు పండించుకుని జీవనాధారం పొందేందుకు పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములు అవి. క్రయ విక్రయాలు, వ్యవసాయేతర పనులు చేయడానికి వీల్లేనివి. కానీ ధరణి పోర్టల్‌లో ఆ భూముల రికార్డులను తారుమారు చేశారు. అసైన్డ్ భూములను పట్టా భూములుగా మార్చేశారు. కంది మండలం పరిధిలోని 11 గ్రామాల్లో 518 ఎకరాల అసైన్డ్ భూములను పట్టా భూములుగా రికార్డులను మార్చేశారు.
మహబూబ్‌నగర్ లోక్ సభ పరిధిలో ప్రధాన పార్టీల నేతలు నువ్వా.. నేనా.. అంటూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. BRS నుంచి ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి వంశీచంద్ రెడ్డి, BJP నుంచి డీకే అరుణ బరిలో ఉన్నారు. కాంగ్రెస్, BJP పార్టీలు ప్రత్యేక ఫోకస్ పెట్టాయి. ఈసారి కూడా గెలుపు మాదే అని BRS, తామే గెలుస్తామని కాంగ్రెస్, బీజేపీ ధీమాలో ఉన్నాయి. మరి ఇక్కడ ‘పాగా’ వేసేది ఎవరో..? చూడాలి. దీనిపై మీ కామెంట్ ?
నేలకొండపల్లి మండలంలోని గువ్వల గూడెం గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎల్లయ్య (50) అనే వ్యక్తి దుర్మరణం చెందాడు. ముదిగొండ మండలం లోని గోకినపల్లి నుంచి నేలకొండపల్లి వస్తుండగా ట్రాక్టర్ ఢీకొట్టడంతో బైక్ మీద నుంచి కింద పడిపోయారు. ఎల్లయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు.
దుమ్ముగూడెం సరిహద్దు ఆనుకొని ఉన్న ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని సుకుమా జిల్లా చింతగుఫా పోలీస్ స్టేషన్ పరిధి దులేద్ – ముక్తాంజ్ గ్రామాల అటవీ ప్రాంతంలో మావోయిస్టులు పికప్ వాహనానికి నిప్పు పెట్టిన ఘటన శనివారం చోటుచేసుకుంది. దులేద్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి చెందిన వాహనానికి నిప్పంటించిన ఘటనపై పోలీస్టేషన్లో కేసు నమోదైంది.
HYDలో ప్రస్తుతం 19,03,865 నిర్మాణాలు ఆస్తి పన్ను పరిధిలో ఉండగా.. సుమారు 4 లక్షల మంది పన్ను చెల్లించలేదని అధికారులు చెబుతున్నారు. ప్రైవేటు ఆస్తులతో పాటు వందలాది ప్రభుత్వ ఆస్తులు కలిపి రూ.9,803.39 కోట్లు బకాయి పడ్డాయి. ఏప్రిల్ 1 నుంచి ఆస్తి పన్నుపై 5% వడ్డీ రాయితీతో ఎర్లీబర్డ్ పథకాన్ని అమలు చేస్తున్నట్లు జీహెచ్ఎంసీ పేర్కొంది.
ఇంటి పన్ను బకాయిలపై 90శాతం వడ్డీ మాఫీ ద్వారా చెల్లించే విధానం నేటితో ముగియనుంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మార్చి 31 వరకు ఇంటి పన్ను చెల్లిస్తే 90 శాతం వడ్డీ మాఫీ చేయడానికి అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో జిల్లాలోని అన్ని మునిసిపాలిటీల్లో ఈ అవకాశం నేటితో ముగియనుంది. మున్సిపల్ సిబ్బంది ఇంటింటికి వెళ్లి ఈ విషయాన్ని ప్రజలకు వివరిస్తున్నారు.
భార్య చూస్తుండగానే చెరువులో మునిగి భర్త మృతి చెందిన ఘటన బాచుపల్లి పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. బాచుపల్లి పెట్రోల్ బంకు సమీపంలో హన్మంత్, కల్పన దంపతులు ఉంటున్నారు. శనివారం వారు భైరుని చెరువుకి వెళ్లారు. కల్పన ఒడ్డున నిల్చోగా.. హన్మంత్ స్నానానికి నీటిలోకి దిగి ఎంతకీ తిరిగి రాలేదు. సాయంత్రం మృతదేహం లభ్యమైంది.
భార్య చూస్తుండగానే చెరువులో మునిగి భర్త మృతి చెందిన ఘటన బాచుపల్లి పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. బాచుపల్లి పెట్రోల్ బంకు సమీపంలో హన్మంత్, కల్పన దంపతులు ఉంటున్నారు. శనివారం వారు భైరుని చెరువుకి వెళ్లారు. కల్పన ఒడ్డున నిల్చోగా.. హన్మంత్ స్నానానికి నీటిలోకి దిగి ఎంతకీ తిరిగి రాలేదు. సాయంత్రం మృతదేహం లభ్యమైంది.
జగిత్యాల పట్టణంలో జోరుగా హైటెక్ వ్యభిచారం కొనసాగుతుంది. అందమైన యువతులు, మహిళల ఫొటోలను దళారులు వాట్సాప్ స్టేటస్గా పెట్టి యువతను ఆకర్షిస్తున్నారు. కేవలం తమకు తెలిసిన వ్యక్తుల ద్వారా ఈ హైటెక్ వ్యభిచారం నడిపిస్తున్నట్లు సమాచారం. పోలీస్ అధికారులు ఇలాంటి దళారులపై నిఘా పెట్టినట్లు తెలిపారు. పట్టుబడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.
రైలు కిందపడి వ్యక్తి మృతి చెందిన ఘటన సిర్పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. హెడ్ కానిస్టేబుల్ సురేష్ గౌడ్ కథనం ప్రకారం.. బిలాస్పూర్ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న రైలులో ఝార్ఖండ్ రాష్ట్రం గర్వ జిల్లా తెనర్కు చెందిన దిలీప్ కుమార్ సింగ్ ప్రయాణిస్తుండగా ప్రమాదవశాత్తు రైలు కింద పడి మృతి చెందినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Sorry, no posts matched your criteria.